దేవుడు ఎక్కడున్నాడు?
దేవుడు ఎక్కడున్నాడు?
సెప్టెంబరు 11, 2001: ప్రయాణీకులను తీసుకువెళ్లే ఒక జెట్ విమానం ఉదయం 8:46 నిమిషాలకు, న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, నార్త్ టవర్లోకి దూసుకుపోయింది. ఆ రోజు తీవ్రవాదులు పథకం ప్రకారం చేసిన ఎన్నో దాడుల్లో ఇది మొదటిది. అది జరిగిన 102 నిమిషాల్లో దాదాపు 3,000 మంది చనిపోయారు.
డిసెంబరు 26, 2004
హిందూ మహా సముద్రంలో 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల ఎన్నో చోట్ల ఎగసిపడిన భయంకరమైన అలలు దాదాపు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫ్రికాతో సహా 11 దేశాలను దెబ్బతీశాయి. ఒక్క రోజులోనే 1,50,000 మంది చనిపోయారు లేదా గల్లంతయ్యారు. పదిలక్షల కన్నా ఎక్కువ మంది నిరాశ్రయులయ్యారు.
ఆగస్టు 1, 2009: నలభై రెండు సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి, తన ఐదేళ్ల కొడుకును తీసుకుని నీటి మీద జెట్-స్కీయింగ్ చేస్తూ చెక్కతో కట్టిన రేవును లేదా జెట్టీని ఢీకొన్నాడు. తండ్రి చనిపోయాడు. కొడుకు మరుసటి రోజు వరకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడి చనిపోయాడు. చనిపోయిన వాళ్ల బంధువు ఒకామె బాధతో కుమిలిపోతూ, “ఏదైనా అద్భుతం జరిగి ఆ బాబు బ్రతుకుతాడని ఆశపడ్డాం” అంది.
మీరు తీవ్రవాదుల దాడుల గురించి, ప్రకృతి విపత్తుల గురించి చదివినప్పుడు లేదా మీ జీవితంలోనే ఏదైనా ఘోరం జరిగినప్పుడు మీరు చాలా బాధపడివుంటారు. అప్పుడు మీరిలా అనుకున్నారా: ‘అసలు జరుగుతున్న వాటిని దేవుడు చూస్తున్నాడా? ఆయన మన గురించి పట్టించుకోవడం మానేశాడా?’ బైబిల్లో ఊరటనిచ్చే సమాధానం ఉంది. దాని గురించి చూద్దాం. (w10-E 05/01)
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Dieter Telemans/Panos Pictures
PRAKASH SINGH/AFP/Getty Images
© Dieter Telemans/Panos Pictures