తల్లిగా సంతృప్తిని పొందడం
తల్లిగా సంతృప్తిని పొందడం
ప్రపంచమంతటా నేడు చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. పారిశ్రామిక దేశాల్లోనైతే స్త్రీలు పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. వర్ధమాన దేశాల్లో, తమ కుటుంబాలను పోషించుకోవడానికి కొంతమంది ఎన్నో గంటలపాటు పొలం పనులు చేస్తున్నారు.
చాలామంది స్త్రీలు అటు బ్రతుకుతెరువు కోసం ఉద్యోగం చేయాలో ఇటు కుటుంబాన్నీ, ఇంటినీ చూసుకోవాలో తేల్చుకోలేక సతమతమౌతున్నారు. వారు కుటుంబీకుల ఆహారం, బట్టలు, వసతి కోసం డబ్బు సంపాదించడమే కాక, వంటపని, బట్టలు ఉతకడం, ఇంటిని శుభ్రంచేయడం వంటి పనులు కూడా చేస్తారు.
క్రైస్తవ స్త్రీలైతే వాటన్నిటితోపాటు, తమ పిల్లలకు దేవునితో మంచి సంబంధాన్ని కలిగివుండడం ఎలాగో నేర్పించేందుకు కృషిచేస్తుంటారు. “నిజం చెప్పాలంటే ఉద్యోగం చేసుకుంటూనే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం చాలాకష్టం, ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఉంటే అది మరీ కష్టం. పిల్లలపట్ల తగిన శ్రద్ధ చూపించడం అంత సుళువైన పని కాదు” అని ఇద్దరు అమ్మాయిల తల్లి క్రిస్టీనా చెబుతోంది.
తల్లులు అసలు ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటారు? వారు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు? తన జీవితం సార్థకమవ్వాలంటే ఒక తల్లి ఉద్యోగం చేయాల్సిందేనా?
తల్లులు ఎందుకు ఉద్యోగం చేయాలనుకుంటారు?
చాలామంది తల్లులు గత్యంతరం లేక ఉద్యోగం చేయాల్సివస్తోంది. భర్తలేని కారణంగా కొందరు ఆర్థిక భారాన్ని తామే మోయాల్సివస్తోంది. కనీస అవసరాల కోసం ఒకరి జీతమే సరిపోదని కొంతమంది భార్యాభర్తలకు అనిపించినప్పుడు వారు ఉద్యోగం చేస్తారు.
తల్లులందరూ ఆర్థిక అవసరాల కోసమే ఉద్యోగం చేయడంలేదు. వారిలో చాలామంది తమ స్వాభిమానాన్ని పెంచుకునేందుకు బయట ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు ఆర్థిక స్వావలంబన కోసమో లేదా విలాసవంతమైన జీవితం కోసమో ఉద్యోగం చేస్తుండవచ్చు. వారిలో చాలామంది తమ ఉద్యోగాన్ని ఎంతో చక్కగా సంతోషంగా చేస్తుంటారు.
ఇంకొందరైతే తోటివారి ప్రోద్భలంతో ఉద్యోగం చేయాలనుకుంటారు. ఉద్యోగం చేసే తల్లులు తరచూ ఒత్తిడికి గురవుతారని, అలసిపోతారని చాలామంది ఒప్పుకున్నా, ఉద్యోగం చేయవద్దనుకునే వారిని వారు అపార్థం చేసుకుని, ఎగతాళి కూడా చేస్తారు. “ ‘గృహిణిగా నేను ఇంటిపనులే చూసుకుంటాను’ అని చెప్పడం అంత సులభం కాదు. కొంతమంది మేమేదో మా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామన్నట్లు
వ్యవహరిస్తారు” అని ఒక స్త్రీ చెబుతోంది. రెండేళ్ల కూతురున్న రెబెకా ఇలా అంటోంది: “స్త్రీలు తమ పిల్లలపట్ల శ్రద్ధ తీసుకోవాలనే విషయం తెలిసినా, మన సమాజం ఉద్యోగం చేయని తల్లులను తక్కువచూపు చూస్తుందని నాకనిపిస్తుంది.”ఏది కల్పితం, ఏది వాస్తవం?
ఎక్కువ జీతం సంపాదిస్తూ, అందమైన దుస్తులు ధరిస్తూ, ఆత్మవిశ్వాసంతో తాను ఎంచుకున్న వృత్తిలో రాణిస్తున్న స్త్రీని “ఆదర్శ మహిళ” అని ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లోని ప్రసార మాధ్యమాలు చూపిస్తున్నాయి. ఇంటికి వచ్చేసరికి ఆమె అలసటనేది లేకుండా, తన పిల్లల సమస్యలను తీరుస్తుంది, తన భర్తచేసిన పొరపాట్లను సరిదిద్దుతుంది, ఇంటి సమస్యల్ని పరిష్కరిస్తుంది. కానీ నిజజీవితంలో చాలా తక్కువమంది స్త్రీలు అలా ఉండగలరు.
నిజానికి స్త్రీలకు దొరికే చాలా ఉద్యోగాలు ఒకేచోట కూర్చుని, తక్కువ జీతానికి చేసేవిగా ఉంటాయి. నిరుత్సాహపరిచే మరో విషయం ఏమిటంటే, ఇలాంటి ఉద్యోగాల్లో తమ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించే అవకాశం ఉండదని కొందరికి అనిపించవచ్చు. సోషల్ సైకాలజీ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “స్త్రీ సమానత్వం ఎక్కువవుతున్నా, పెద్ద జీతం, హోదా ఉన్న ఉద్యోగాల్లో పురుషులే ఉంటున్నారు.” ఉద్యోగం ఉంటేనే గుర్తింపు ఉంటుంది అనుకునే స్త్రీలకు అది ఒకవిధంగా నష్టమే. స్పానిష్ వార్తాపత్రిక ఎల్ పాయిస్ ఇలా చెబుతోంది: “స్త్రీలు బయటపనే కాదు ఇంట్లో పని కూడా చేయాలి కాబట్టి ఒత్తిడికి సంబంధించినంతవరకు మగవాళ్ళకన్నా స్త్రీలు మూడింతలు ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంచనా వేయబడింది.”
భర్తలు ఎలా సహాయం చేయవచ్చు?
ఒక క్రైస్తవ తల్లి ఉద్యోగం చేయాలా వద్దా అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఒకవేళ ఆమె వివాహిత అయితే తన భర్తతో ఆ విషయాన్ని చర్చించి, ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.—సామెతలు 14:15.
ఆర్థిక పరిస్థితులవల్ల వారిద్దరూ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటే అప్పుడేమిటి? అలాంటి పరిస్థితిలో జ్ఞానవంతుడైన ఒక భర్త బైబిలు ఇచ్చే ఈ సలహాను పాటించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తాడు: “భర్తలు, తమ భార్యలు తమకన్నా శారీరకంగా తక్కువ శక్తి కలవాళ్ళని గుర్తిస్తూ కాపురం చెయ్యాలి, మీతో సహా వాళ్ళు కూడా దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని పంచుకుంటున్నారు. కనుక వాళ్ళను మీరు గౌరవించాలి.” (1 పేతురు 3:7, ఈజీ-టు-రీడ్ వర్షన్) ఒక భర్త తన భార్య శారీరక, భావోద్రేక పరిమితులను బాగా అర్థంచేసుకోవడం ద్వారా ఆమెను గౌరవిస్తాడు. సాధ్యమైనప్పుడల్లా ఇంటిపనుల్లో తన భార్యకు చేదోడువాదోడుగా ఉంటాడు. యేసులా భర్తకూడా వినయంగా చిన్నచిన్న పనులను చేయడానికి వెనుకాడడు, అలాంటి పనులు తన హోదాకు తగనివని భావిస్తూ వాటిని చేయకూడదని అనుకోడు. (యోహాను 13:12-15) బదులుగా కష్టపడి పనిచేసే తన భార్యపట్ల తన ప్రేమను వ్యక్తం చేయడానికి అది మంచి అవకాశమని అనుకుంటాడు. మీరలా సహాయం చేస్తే మీ భార్య ఎంతగానో సంతోషిస్తుంది.—ఎఫెసీయులు 5:25, 28, 29.
ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాల్సివస్తే ఇంట్లో ఒకరికొకరు సహకరించుకోవడం ఎంతో అవసరం. స్పెయిన్‌లో ఏబీసీ అనే వార్తాపత్రికలో వచ్చిన ఒక నివేదిక ఆ విషయాన్నే నొక్కిచెప్పింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ మేటర్స్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంపై వ్యాఖ్యానిస్తూ ఆ ఆర్టికల్, స్పెయిన్‌లో విడాకులు తీసుకునేవారి శాతం అధికమవడానికి, “మతపరమైన, నైతికపరమైన ప్రమాణాలు దిగజారిపోవడం” మాత్రమే కారణం కాదుగానీ, “స్త్రీలు ఉద్యోగం చేస్తుండడం, భర్తలు ఇంటిపనుల్లో సహాయం చేయకపోవడం” కూడా కారణాలని పేర్కొంది.
క్రైస్తవ తల్లి పోషించాల్సిన ప్రాముఖ్యమైన పాత్ర
పిల్లలకు శిక్షణనివ్వవలసిన బాధ్యతను యెహోవా ముఖ్యంగా తండ్రులకే అప్పగించాడు. అయితే పిల్లల విషయంలో, అదీ వారి బాల్యంలో తాము ఒక ప్రాముఖ్యమైన పాత్ర వహించాలని క్రైస్తవ తల్లులకు తెలుసు. (సామెతలు 1:8; ఎఫెసీయులు 6:4) ఇశ్రాయేలీయులు తమ పిల్లలకు ధర్మశాస్త్రాన్ని బోధించాలని యెహోవా చెప్పినప్పుడు తల్లిదండ్రులిద్దరినీ ఉద్దేశించి మాట్లాడాడు. ఇలా చేయడానికి సమయం ఓర్పు అవసరమని, ప్రత్యేకంగా పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాటి అవసరం ఇంకా ఎక్కువగావుంటుందని ఆయనకు తెలుసు. అందుకే పిల్లలకు ఇంటి దగ్గరున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, శిక్షణనివ్వాలని దేవుడు తల్లిదండ్రులకు చెప్పాడు.—ద్వితీయోపదేశకాండము 6:4-7.
దేవుని వాక్యం, పిల్లలకు “నీ తల్లి ఉపదేశమును సామెతలు 6:20) “ఉపదేశము” అని అనువదించబడిన పదానికి ఆదిమ భాషలో “నియమ నిబంధనలు” అని అర్థం. అయితే, వివాహిత స్త్రీ తన పిల్లల విషయంలో ఎలాంటి నియమాలనైనా విధించే ముందు తన భర్తను సంప్రదిస్తుంది. కానీ ఆ వచనం చూపిస్తున్నట్లుగా తల్లులకు నియమాలు విధించే హక్కు వుంది. దైవభక్తిగల తల్లి విధించే ఆధ్యాత్మిక, నైతిక నియమాలను లక్ష్యపెట్టే పిల్లలు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. (సామెతలు 6:21, 22) ఇద్దరబ్బాయిల తల్లి టెరెసా తానెందుకు ఉద్యోగం చేయాలనుకోవడం లేదో వివరిస్తూ, ఇలా చెబుతోంది: “మా పిల్లలను దేవుని సేవించేవారిగా పెంచడమే నాకున్న అతి ప్రాముఖ్యమైన పని. దానిని నేను సాధ్యమైనంత చక్కగా నిర్వర్తించాలి అనుకుంటున్నాను.”
త్రోసివేయకుము” అని చెప్పినప్పుడు తల్లుల ప్రాముఖ్యమైన, గౌరవప్రదమైన పాత్రను నొక్కిచెబుతోంది. (తమ పిల్లలకు సహాయపడిన తల్లులు
ఇశ్రాయేలు రాజైన లెమూయేలు, తన తల్లి తన విషయంలో చేసిన కృషి నుండి నిజంగా ప్రయోజనం పొందాడు. ఆయనను సరిదిద్దడానికి ఆమె ‘ఉపదేశించిన దేవోక్తి’ దేవుని ప్రేరేపిత వాక్యంలో భాగంగా ఉంది. (సామెతలు 31:1; 2 తిమోతి 3:16, 17) గుణవంతురాలైన భార్య గురించి ఆ తల్లి ఇచ్చిన వివరణ, నేటికి కూడా అబ్బాయిలు తమ కోసం మంచి భార్యను ఎన్నుకునేందుకు సహాయం చేస్తుంది. అనైతికత, త్రాగుబోతుతనం గురించి ఆమె చేసిన హెచ్చరికలు అవి వ్రాయబడినప్పుడు ఎంత సముచితంగా ఉన్నాయో ఇప్పటికీ అవి అంతే సముచితంగా ఉన్నాయి.—సామెతలు 31:3-5, 10-31.
మొదటి శతాబ్దంలో, యునీకే తన కుమారుడైన తిమోతికి మంచి విషయాలు బోధించడానికి చేసిన కృషిని అపొస్తలుడైన పౌలు మెచ్చుకున్నాడు. ఆమె భర్త యెహోవాను కాదుగానీ బహుశా గ్రీకు దేవతలను ఆరాధించేవాడు కాబట్టి, యునీకే తిమోతికి “పరిశుద్ధ లేఖనాలపై” విశ్వాసముంచడం ఎందుకు మంచిదో కారణయుక్తంగా వివరించాల్సి వచ్చింది. యునీకే తిమోతికి లేఖనాలు బోధించడం ఎప్పటినుండి ప్రారంభించింది? “బాల్యమునుండి” లేదా మరోమాటలో చెప్పాలంటే తిమోతి చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటినుండే అని ప్రేరేపిత లేఖనాలు తెలియజేస్తున్నాయి. (2 తిమోతి 1:5; 3:14, 15) ఆమె విశ్వాసం, మాదిరి, బోధన, తిమోతి భవిష్యత్తులో చేయబోయే మిషనరీ సేవ కోసం ఆయనను సిద్ధం చేశాయనడంలో సందేహం లేదు.—ఫిలిప్పీయులు 2:19-22.
యథార్థంగా దేవుని సేవ చేస్తున్నవారికి ఆతిథ్యమివ్వడం ద్వారా తమ పిల్లలు ఆదర్శవంతమైన వ్యక్తులతో సహవసించగలిగే అవకాశాన్ని కల్పించిన తల్లుల గురించి కూడా బైబిలు ప్రస్తావిస్తోంది. ఉదాహరణకు, షూనేమీయురాలైన ఒక స్త్రీ ఎలీషా ప్రవక్తకు తరచూ తన ఇంట్లో ఆతిథ్యమిస్తుండేది. ఆమె కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా ఆ బాబుని తిరిగి బ్రతికించాడు. (2 రాజులు 4:8-10, 32-37) బైబిలు రచయితయైన మార్కు తల్లి మరియ విషయం కూడా పరిశీలించండి. తొలి శిష్యులు యెరూషలేములోని తన ఇంటిలో కూటాలు జరుపుకొనేందుకు ఆమె అంగీకరించింది. (అపొస్తలుల కార్యములు 12:12) వాళ్ల ఇంటికి క్రమంగా వచ్చే అపొస్తలుల, ఇతర క్రైస్తవుల సహవాసం నుండి మార్కు నిజంగా ప్రయోజనం పొందాడు.
తమ పిల్లలకు యెహోవా సూత్రాలను నేర్పించడానికి విశ్వసనీయులైన స్త్రీలు చేసే కృషిని ఆయనెంతో విలువైనదిగా పరిగణిస్తాడు. ఈ స్త్రీలు యథార్థతను చూపించినందుకు, తమ ఇళ్లలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడానికి కృషి చేసినందుకు దేవుడు వారినెంతో ప్రేమించాడు.—2 సమూయేలు 22:26; సామెతలు 14:1.
సంతృప్తినిచ్చే నిర్ణయాలు
ఇప్పటివరకూ చర్చించిన లేఖన ఉదాహరణలు చూపిస్తున్నట్లుగా కుటుంబ భౌతిక, ఆధ్యాత్మిక, భావోద్వేగ అవసరాలపట్ల సరైన శ్రద్ధ తీసుకోవడం విశిష్ఠమైన ప్రయోజనాలను తీసుకువస్తుంది. కానీ అలా చేయడం అంత సులభం కాదు. ఒక కంపెనీలో పెద్ద హోదాలోవుండే ఉద్యోగంతో పోలిస్తే ఇంట్లో తల్లి చేసే పనే తరచూ ఎంతో కష్టమైనదిగా అనిపిస్తుంది.
భార్య తన భర్తతో సంప్రదించిన తర్వాత ఉద్యోగం మానేయాలనో లేదా పార్ట్‌టైమ్ (వారంలో కొన్ని రోజులు లేదా రోజుకు కొన్ని గంటలు చేసేది) ఉద్యోగం చేయాలనో నిర్ణయించుకుంటే, వారు బహుశా నిరాడంబరంగా జీవించాల్సి ఉండవచ్చు. అంతేకాక ఆమె తీసుకున్న నిర్ణయాన్ని సరిగా అర్థం చేసుకోనివారు చేసే ఎగతాళిని సహించాల్సివుంటుంది. అయితే వారు చేసే త్యాగాలకు సరిపోల్చలేని ఆశీర్వాదాలు వారికి లభిస్తాయి. పేకీ అనే స్త్రీకి ముగ్గురు పిల్లలు, ఆమె పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తోంది. ఆమె ఇలా అంటోంది: “పిల్లలు స్కూల్
నుండి ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడేందుకు వీలుగా వారు వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలనుకుంటాను.” ఆమె పిల్లలు దానివల్ల ఎలాంటి ప్రయోజనం పొందారు? “నేను వారు హోమ్‌వర్క్ చేసుకోవడానికి సహాయం చేస్తాను, వారికి ఏవైనా సమస్యలొస్తే వెంటనే పరిష్కరించగలుగుతాను. మేము ప్రతీరోజు కలిసి సమయాన్ని గడపడంవల్ల మేమంతా ఒకరితో ఒకరం చక్కగా మాట్లాడుకుంటాం. ఈ సమయం నాకెంత విలువైనదంటే నేను నాకు వచ్చిన పూర్తికాల ఉద్యోగావకాశాన్ని కూడా నిరాకరించాను” అని ఆమె చెబుతోంది.తాము పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయగలిగితే కుటుంబమంతా ప్రయోజనం పొందుతుందని ఎంతోమంది క్రైస్తవ తల్లులు గ్రహించారు. మొదట్లో పేర్కొనబడిన క్రిస్టీనా ఇలా వివరిస్తోంది: “నేను ఉద్యోగం మానేసిన తర్వాత, మా కుటుంబంలో సమస్యలు చాలావరకు తక్కువయ్యాయి అనిపించింది.” మా పిల్లలతో మాట్లాడడానికి, నా భర్తకు ఎన్నో విధాలుగా సహాయం చేయడానికి నాకు సమయం లభిస్తోంది. మా అమ్మాయిలకు మంచి విషయాలు నేర్పించినప్పుడు వారు నేర్చుకొని, అభివృద్ధి సాధిస్తుంటే అది చూసి వారికింకా నేర్పించడంలో ఎంతో ఆనందం పొందుతున్నాను.” ఒక విషయం క్రిస్టీనా మనసులో నాటుకుపోయింది. “మా పెద్దమ్మాయి ఛైల్డ్ కేర్ సెంటర్‌లో తప్పటడుగులు వేయడం నేర్చుకుంది, కానీ మా రెండో అమ్మాయికైతే నేనే నడవడం నేర్పించాను. అది తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి నా చేతుల్లో వాలిపోయింది. నిజంగా అవి నా జీవితంలో మరపురాని క్షణాలు” అని ఆమె గుర్తుచేసుకుంది.
పరిశీలించాల్సిన విషయం మరొకటి ఉంది. తల్లి ఉద్యోగం చేయడం మానేస్తే పెరుగుతుంది అనుకున్న ఆర్థిక భారం మనం అనుకున్నంత ఎక్కువగా ఉండకపోవచ్చు. “నా జీతంలో ఎక్కువ భాగం ఛైల్డ్ కేర్ సెంటర్‌కి, ఆఫీస్‌కు వెళ్ళివచ్చే ఛార్జీలకే ఖర్చయ్యేది. మేము జాగ్రత్తగా ఆలోచించి చూసినప్పుడు నేను ఉద్యోగం చేయడంవల్ల ఎక్కువ డబ్బులేమీ రావడం లేదని మాకర్థమైంది” అని క్రిస్టీనా వివరించింది.
కొందరు తమ పరిస్థితిని విశ్లేషించుకున్న తర్వాత, భార్య కుటుంబాన్ని చూసుకోవడంలో ఉన్న ప్రయోజనాలతో పోలిస్తే డబ్బుకోసం వారు చేసే ఎలాంటి త్యాగాలైనా సాటిరావనే నిర్ణయానికొచ్చారు. క్రిస్టీనా భర్త, పౌల్ ఇలా అంటున్నాడు: “నా భార్య ఇంట్లోనే ఉంటూ మా ఇద్దరి అమ్మాయిలను చూసుకోగలుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా భార్య ఉద్యోగం చేస్తున్నప్పుడు మా ఇద్దరికీ ఎంతో కష్టమయ్యేది.” ఈ నిర్ణయం వాళ్ళ ఇద్దరి కూతుర్లపై ఎలాంటి ప్రభావం చూపించింది? “వాళ్ళు మరింత సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నారు, అంతేకాక ఎదిగే సంవత్సరాల్లో ఎదురయ్యే చెడు ప్రభావాలకు దూరంగా ఉంటున్నారు” అని పౌల్ అంటున్నాడు. క్రిస్టీనా, పౌల్‌లు తమ కూతుర్లతో వీలైనంత ఎక్కువ సమయం గడపడం అంత ప్రాముఖ్యమని ఎందుకు అనుకుంటున్నారు? పౌల్ ఇలా చెబుతున్నాడు: “మనం మన పిల్లలకు మంచిచెడులు నేర్పించకపోతే, ఇతరులు నేర్పిస్తారు.”
ప్రతీ కుటుంబంలో భార్యాభర్తలు తామే తమ పరిస్థితిని విశ్లేషించుకోవాలి. వారు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ విమర్శించకూడదు. (రోమీయులు 14:4; 1 థెస్సలొనీకయులు 4:10, 11) తల్లి ఉద్యోగం చేయకుండా ఉంటే కుటుంబానికి ఎన్ని ప్రయోజనాలు లభిస్తాయో ఆలోచించడం ప్రాముఖ్యం. ఈ విషయంలో ముందు ప్రస్తావించబడిన టెరెసా తన అభిప్రాయాన్ని ఇలా క్లుప్తంగా చెబుతోంది: “మీ పిల్లలను చూసుకుంటూ, వారికి నేర్పించడానికి వారితో సాధ్యమైనంత సమయం వెచ్చించడంలో ఉన్నంత సంతృప్తి మరెందులోనూ ఉండదు.”—కీర్తన 127:3. (w 08 2/1)
[21వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ తల్లులు కూడా తమ పిల్లలకు శిక్షణనివ్వడమనే ప్రాముఖ్యమైన పనిలో భాగం వహిస్తారు