కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు -న్యూయార్క్‌లో

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు -న్యూయార్క్‌లో

సేసార్‌, రోసీయోలు భార్యాభర్తలు. వాళ్లు కాలిఫోర్నియాలో సుఖంగా జీవించేవాళ్లు. సేసార్‌ ఒక ఎ.సి. టెక్నీషియన్‌గా ఉద్యోగం చేసేవాడు, రోసియో ఒక డాక్టర్‌ దగ్గర పార్ట్‌టైం ఉద్యోగం చేసేది. వాళ్లకు సొంత ఇల్లు ఉంది, పిల్లలు లేరు. అయితే ఒక విషయం వాళ్ల జీవితాల్ని మార్చేసింది. ఏంటది?

అమెరికా బ్రాంచి కార్యాలయం, 2009 అక్టోబరులో ఆ దేశంలోని అన్ని సంఘాలకు ఒక ఉత్తరం పంపించింది. న్యూయార్క్‌లోని, వాల్‌కిల్‌లో జరుగుతున్న బ్రాంచి విస్తరణ పనుల్లో సహాయం చేయడానికి, నైపుణ్యం గలవాళ్లు కొంతకాలం బెతెల్‌లో సేవకోసం అప్లికేషన్‌ పెట్టుకోమని ఆ ఉత్తరంలో ఉంది. సాధారణంగా బెతెల్‌లో సేవ చేయడానికి ఉండాల్సిన వయస్సు కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు కూడా ప్రయత్నించవచ్చని చెప్పారు. “మా వయస్సును బట్టి చూస్తే, బెతెల్‌లో సేవచేసే ఇలాంటి అవకాశం మళ్లీ ఎప్పటికీ రాదని మాకు తెలుసు. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాం” అని సేసార్‌, రోసియోలు చెప్తున్నారు. వాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ అప్లికేషన్‌లు పంపించారు.

వార్విక్‌లో స్వచ్ఛందంగా పనిచేస్తున్నవాళ్లలో కొంతమంది

ఓ సంవత్సరం గడిచింది, అయినా వాళ్లకు బెతెల్‌ ఆహ్వానం రాలేదు. అయితే తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి, వాళ్లు జీవితంలో కొన్ని సర్దుబాట్లు చేసుకున్నారు. సేసార్‌ ఇలా చెప్తున్నాడు, ‘మా ఇంటిని వేరేవాళ్లకు అద్దెకు ఇవ్వాలనుకున్నాం. కాబట్టి మా గ్యారేజ్‌ను [కార్లు పెట్టే చోటును] మేము ఉండడానికి అనుకూలంగా ఉండే గదిలా మార్చుకున్నాం. తర్వాత, మేము ఆ మధ్యే కట్టుకున్న మా 7 గదుల పెద్ద ఇంటినుండి ఆ చిన్న గదిలోకి మారాం. అలా తక్కువలో జీవించడం అలవాటు చేసుకోవడం వల్ల, ఒకవేళ బెతెల్‌ ఆహ్వానం వస్తే, దాన్ని అంగీకరించేలా ముందే సిద్ధపడ్డాం.’ మరి వాళ్లకు ఆహ్వానం వచ్చిందా? ‘మేము ఆ చిన్న గదిలోకి మారిన ఒక నెలకే, వాల్‌కిల్‌లో కొంతకాలంపాటు స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడానికి మాకు ఆహ్వానం అందింది. తక్కువలో జీవించడం వల్ల యెహోవా మమ్మల్ని ఆశీర్వదించాడని మాకు అర్థమైంది’ అని రోసియో చెప్తుంది.

జేసన్‌, సేసార్‌, విలియమ్‌

సంతోషంగా త్యాగాలు చేసి, ఎన్నో ఆశీర్వాదాలు పొందారు

సేసార్‌, రోసియోలాగే వందలమంది సహోదరసహోదరీలు, న్యూయార్క్‌లో జరుగుతున్న నిర్మాణ పనుల్లో సహాయం చేసేందుకు ఎన్నో వదులుకున్నారు. వాళ్లలో కొంతమంది వాల్‌కిల్‌లో జరుగుతున్న నిర్మాణ పనికి మద్దతిస్తున్నారు, ఇంకొంతమంది వార్విక్‌లో జరుగుతున్న ప్రపంచ ప్రధాన కార్యాలయ నిర్మాణంలో సహాయం చేస్తున్నారు. a యెహోవా సేవలో మరింతగా పాల్గొనేందుకు చాలామంది దంపతులు సౌకర్యవంతమైన తమ ఇళ్లను, మంచి ఉద్యోగాలను, ఎంతో ప్రేమగా చూసుకునే పెంపుడు జంతువులను కూడా వదిలిపెట్టారు. మరి అలా నిస్వార్థంగా త్యాగాలు చేసినవాళ్లను యెహోవా ఆశీర్వదించాడా? ఖచ్చితంగా!

వే

ఉదాహరణకు, 50లలో ఉన్న వే, డెబ్రా దంపతుల విషయమే చూడండి. సహోదరుడు వే, ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. వాళ్లు న్సాస్‌లోని తమ ఇంటిని, చాలా వస్తువులను అమ్మేసి కమ్యూటర్‌ బెతెలైట్లుగా సేవ చేయడానికి వాల్‌కిల్‌కు వచ్చేశారు. b దానికోసం వాళ్లు చాలా సర్దుబాట్లు చేసుకోవాల్సి వచ్చింది. అయినా, అలాంటి సేవకోసం ఎన్ని త్యాగాలు చేసినా తక్కువేనని వాళ్లు అనుకుంటున్నారు. బెతెల్‌లో తను చేస్తున్న సేవ గురించి డెబ్రా ఇలా అంటోంది, ‘పరదైసులో ఇళ్లు కడుతున్న చిత్రాలు మన ప్రచురణల్లో వస్తుంటాయి. ఇక్కడ జరుగుతున్న నిర్మాణపనిలో సహాయం చేయడంవల్ల, నేను కూడా పరదైసులో ఇళ్లు కడుతున్నట్లు నాకనిపిస్తుంది.’

మెల్వన్‌, షారన్‌ దంపతులు వార్విక్‌లో పనిచేయడం కోసం, దక్షిణ కరోలీనలోని తమ ఇంటిని, వస్తువులను అమ్మేశారు. వాటిని వదులుకోవడం అంత తేలిక కాదు, అయినా వాళ్లు చరిత్రలో నిలిచిపోయే ఆ నిర్మాణ పనిలో సహాయం చేయడం ఒక గొప్ప అవకాశంగా భావించారు. వాళ్లిలా అంటున్నారు, “మనం చేస్తున్న పని ప్రపంచవ్యాప్త సంస్థకు ఉపయోగపడుతుందని తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం, అనుభవిస్తేగానీ అర్థం కాదు.”

కెనత్‌

కెనత్‌ ఇళ్లు కట్టే పనిచేసి రిటైర్‌ అయ్యాడు. ఆయన భార్య పేరు మోరీన్‌. 50లలో ఉన్న వాళ్లిద్దరూ వార్విక్‌లోని నిర్మాణపనిలో సహాయం చేయడం కోసం కాలిఫోర్నియా నుండి వెళ్లారు. అయితే వెళ్లేముందు, తమ ఇంటిని చూసుకోమని సంఘంలోని ఓ సహోదరిని అడిగారు. అలాగే, వయసుపైబడిన కెనత్‌ తండ్రిని చూసుకోవడానికి తమ కుటుంబసభ్యుల సహాయం కోరారు. బెతెల్‌ సేవకోసం చేసిన త్యాగాలను బట్టి వాళ్లు బాధపడుతున్నారా? ఎంతమాత్రం కాదు! కెనత్‌ ఏమి చెప్తున్నాడో చూడండి, “మేము ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాం. అంటే మాకు సమస్యలు లేవని కాదు. సమస్యలున్నా మేమెంతో సంతృప్తిగా జీవిస్తున్నాం. ఇలాంటి సేవ చేయడం చాలా మంచిదని ఇతరులకు మేము మనస్ఫూర్తిగా చెప్తాం.”

సవాళ్లను అధిగమించారు

నిర్మాణపని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన చాలామంది ఎన్నో సవాళ్లు అధిగమించారు. ఉదాహరణకు, 60లలో ఉన్న విలియమ్‌, సాండ్ర దంపతులు పెన్సిల్వేనియాలో చీకూచింత లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. వాళ్లకు యంత్రాల విడిభాగాలు తయారు చేసే కంపెనీ ఉంది, అందులో 17 మంది పని చేస్తున్నారు. వాళ్లు చిన్నప్పటి నుండి ఒకే సంఘంలో ఉన్నారు, వాళ్ల బంధువుల్లో చాలామంది కూడా అదే ప్రాంతంలో ఉన్నారు. అయితే వాళ్లకు, వాల్‌కిల్‌లో జరుగుతున్న నిర్మాణపనిలో కమ్యూటర్లుగా పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్లాలంటే తమవాళ్లందర్నీ, తమ పరిసరాలను వదిలి వెళ్లాలని వాళ్లకు తెలుసు. ‘మేము బాగా అలవాటుపడిన వాటిని, ఇష్టమైన వాళ్లందర్నీ విడిచిపెట్టి వెళ్లడమే మాకు అన్నిటికన్నా పెద్ద సవాలు’ అని విలియమ్‌ అంటున్నాడు. ఏదేమైనా, బాగా ప్రార్థించిన తర్వాత, వాల్‌కిల్‌కు వెళ్లాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నందుకు వాళ్లెప్పుడూ బాధపడలేదు. విలియమ్‌ ఇంకా ఇలా చెప్తున్నాడు, “బెతెల్‌ కుటుంబంతో కలిసి పనిచేయడం వల్ల వచ్చే ఆనందం దేనికీ సాటిరాదు. మా జీవితంలో ఇంతకు ముందెప్పుడూ ఇంత సంతోషంగా లేము.”

వాల్‌కిల్‌లో పనిచేస్తున్న కొంతమంది భార్యాభర్తలు

హవాయ్‌లో ఉంటున్న రికీ నిర్మాణరంగంలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఆయనకు వార్విక్‌లో జరుగుతున్న నిర్మాణపనిలో కమ్యూటర్‌గా సేవ చేసే అవకాశం వచ్చింది. ఆయన అలా సేవచేయడం ఆయన భార్య కెండ్రకు కూడా ఇష్టమే. కానీ వాళ్ల ఆలోచనంతా 11 ఏళ్ల అబ్బాయి జేకబ్‌ గురించే. కుటుంబం మొత్తాన్ని న్యూయార్క్‌ నగరానికి మార్చితే, వాళ్ల అబ్బాయి అక్కడి కొత్త పరిసరాలకు అలవాటుపడతాడో లేదోననే ఆలోచనలో పడ్డారు.

“అన్నిటికన్నా ముందు, ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండే పిల్లలున్న సంఘం ఎక్కడుందో తెలుసుకోవాలనుకున్నాం. ఎందుకంటే మా అబ్బాయికి చాలామంది మంచి స్నేహితులు ఉండాలని మేము కోరుకున్నాం” అని రికీ చెప్తున్నాడు. అయితే, చివరికి వాళ్లు వెళ్లిన సంఘంలో పిల్లలు చాలా తక్కువమంది ఉన్నారు, కానీ బెతెల్‌ సభ్యులు ఎక్కువమంది ఉన్నారు. రికీ ఇంకా ఇలా అంటున్నాడు, “మొదటిసారి కూటానికి హాజరైన తర్వాత, తన వయసు పిల్లలు లేరు కాబట్టి ఆ సంఘం ఎలా ఉందని మా అబ్బాయిని అడిగాను. దానికి మా అబ్బాయి ఇలా అన్నాడు, ‘ఏం ఫర్లేదు డాడీ, బెతెల్‌లో సేవ చేస్తున్న అన్నయ్యలే నాకు ఫ్రెండ్స్‌.’”

తమ సంఘంలోని బెతెల్‌ సభ్యులతో సరదాగా మాట్లాడుతున్న జేకబ్‌ అతని తల్లిదండ్రులు

నిజంగానే, బెతెల్‌ సభ్యులు చాలామంది జేకబ్‌కు స్నేహితులయ్యారు. అది ఆ అబ్బాయిమీద ఎలాంటి ప్రభావం చూపించింది? రికీ ఇలా చెప్తున్నాడు “ఒక రోజు రాత్రి నేను మా అబ్బాయి గదిలో లైటు వెలుగుతూ ఉండడం గమనించాను. వాడు పడుకోకుండా వీడియోగేమ్‌ ఆడుతున్నాడేమో అనుకుని వెళ్లి చూశాను, కానీ వాడు బైబిలు చదువుతున్నాడు. ఏం చేస్తున్నావని అడిగితే ‘నేను కూడా బెతెల్‌ సభ్యుడినే కదా, ఒక సంవత్సరంలో బైబిలు మొత్తం చదువుతాను.’ అని అన్నాడు.” వార్విక్‌లోని నిర్మాణపనిలో రికీ సహాయపడుతున్నందుకు, వాళ్లు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ల అబ్బాయి దేవునికి మరింత దగ్గరౌతున్నందుకు రికీ, కెండ్ర చాలా సంతోషిస్తున్నారు.—సామె. 22:6.

భవిష్యత్తు గురించి దిగులులేదు

లూయిస్‌, డేల్‌

వాల్‌కిల్‌లో అలాగే వార్విక్‌లో జరుగుతున్న నిర్మాణపనులు త్వరలో పూర్తవుతాయి, కాబట్టి తమ బెతెల్‌సేవ ఇక కొంతకాలమే ఉంటుందని ఆ పనుల్లో సహాయం చేస్తున్నవాళ్లకు తెలుసు. మరి ఆ తర్వాత ఎక్కడికెళ్లాలో, ఏమి చేయాలో అని ఆ సహోదరసహోదరీలు అతిగా దిగులుపడుతున్నారా? ఎంతమాత్రం లేదు. వాళ్లలో చాలామంది, 50లలో ఉన్న జాన్‌-కార్‌మన్‌, లూయిస్‌-కెన్య అనే ఇద్దరు దంపతుల భావాలనే వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరు దంపతులు ఫ్లోరిడా నుండి వచ్చారు. నిర్మాణపనిలో అనుభవమున్న జాన్‌, ఆయన భార్య కార్‌మన్‌, వార్విక్‌ నిర్మాణపనిలో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. వాళ్లు ఏమంటున్నారంటే, “ఈ రోజువరకు కూడా యెహోవా మా అవసరాలన్నిటినీ ఎలా తీరుస్తూ వచ్చాడో మేము చూశాం. యెహోవా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది, కొంతకాలం తర్వాత వదిలేయడానికి కాదని మాకు తెలుసు.” (కీర్త. 119:116) లూయిస్‌, కెన్యలు వాల్‌కిల్‌లో సేవ చేస్తున్నారు. లూయిస్‌, మంటలు ఆర్పే పరికరాల్ని తయారు చేసేవాడు. వాళ్లిలా చెప్తున్నారు, “యెహోవా మాకు కావాల్సినవాటిని ఇవ్వడాన్ని మేము ఇప్పటికే చూశాం. ఆయన మా అవసరాలను ఎలా, ఎప్పుడు, ఎక్కడ తీరుస్తాడో మాకు తెలీదు. కానీ, యెహోవా తప్పకుండా మా అవసరాలను తీరుస్తూనే ఉంటాడనే నమ్మకం మాకుంది.”—కీర్త. 34:10; 37:25.

‘పట్టలేనంతగా ఆశీస్సులు కుమ్మరిస్తాడు’

జాన్‌, మెల్వన్‌

ఈ నిర్మాణపనుల్లో సేవ చేయడానికి వచ్చిన వాళ్లలో చాలామంది, కావాలనుకుంటే వివిధ కారణాలను బట్టి అక్కడకు రాకుండా ఉండేవాళ్లే. అయినప్పటికీ, వాళ్లు యెహోవాను పరీక్షించాలని కోరుకున్నారు. “నన్ను పరీక్షించండి, నేను పరలోక ద్వారాలు తెరచి, పట్టలేనంతగా ఆశీస్సులు కుమ్మరిస్తానో లేదో చూడండి” అని యెహోవా మనందరికీ చెప్తున్నాడు.—మలా. 3:10, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

మీరు కూడా యెహోవాను పరీక్షించి, ఆయన సమృద్ధిగా ఇచ్చే దీవెనలను పొందాలనుకుంటున్నారా? అయితే, న్యూయార్క్‌లో జరుగుతున్న నిర్మాణపనుల్లో లేదా ఆరాధనకు సంబంధించిన ఇతర నిర్మాణపనుల్లో మీరు ఏవిధంగా సహాయపడగలరో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. అలా చేసి యెహోవా ఇచ్చే ఆశీర్వాదాలను చవిచూడండి.—మార్కు 10:29, 30.

గారీ

ఇలాంటి సేవ అందరూ చేపట్టాలని అలబామాలో సివిల్‌ ఇంజనీరుగా పని చేసిన డేల్‌, ఆయన భార్య క్యాతీ చెప్తున్నారు. వాల్‌కిల్‌లో స్వచ్ఛంద సేవ చేస్తున్న వీళ్లు ఇలా అంటున్నారు, “మీరు ధైర్యం చేసి సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టగలిగితే, పరిశుద్ధాత్మ ఎలా పని చేస్తుందో మీరు చూస్తారు.” అలా సేవ చేయడానికి ముందుకు రావాలంటే ఏమి చేయాలి? దానిగురించి డేల్‌ ఇలా చెప్తున్నాడు, “తక్కువలో, బాగా తక్కువలో జీవించడం నేర్చుకోండి, అలా చేసినందుకు మీరెప్పుడూ బాధపడరు.” ఉత్తర కరోలీనకు చెందిన గారీకు నిర్మాణరంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. గారీ, ఆయన భార్య మోరీన్‌ వార్విక్‌లో సేవ చేస్తున్నారు. వాళ్లిలా అంటున్నారు, ‘ఎన్నో ఏళ్లుగా బెతెల్‌లో సేవ చేస్తున్న చాలామంది సహోదరసహోదరీలను కలవడం, వాళ్లతో కలిసి పనిచేయడం ఒక ఆశీర్వాదం’. ఆయనిలా చెప్తున్నాడు, “బెతెల్‌లో సేవ చేయాలంటే తక్కువలో జీవించడం అలవాటు చేసుకోవాలి. ఈ లోకంలో, అలా జీవించడమే చాలా ఉత్తమం.” ఇల్లినోయిస్‌కు చెందిన జేసన్‌, ఒక ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌ దగ్గర పని చేసేవాడు. ఆయన భార్య పేరు జెనిఫర్‌. వాళ్లు వాల్‌కిల్‌లో జరుగుతున్న నిర్మాణపనిలో పాల్గొనడం గురించి ఇలా అంటున్నారు, “ఇక్కడ జీవితం నూతనలోకంలో జీవితానికి చాలా దగ్గరగా ఉంది.” జెనిఫర్‌ ఇలా అంటోంది, ‘మనం చేసే ఈ పని యెహోవా దృష్టిలో ఎప్పటికీ విలువైనదే. అలాంటి సేవ చేస్తున్నందుకు యెహోవా మన ఊహకందనంతగా దీవిస్తాడు.’

b తమ ఖర్చుల్ని తామే భరిస్తూ, వారంలో ఒకరోజు లేదా అంతకంటే ఎక్కువ రోజులు బెతెల్‌లో సేవచేసే వాళ్లను పార్ట్‌టైం కమ్యూటర్‌ బెతెలైట్లు అంటారు.