కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని చిత్తాన్ని చేయడానికి వారెంతో సంతోషిస్తారు

దేవుని చిత్తాన్ని చేయడానికి వారెంతో సంతోషిస్తారు

దేవుని చిత్తాన్ని చేయడానికి వారెంతో సంతోషిస్తారు

“నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” అని యేసు తన తండ్రికి ప్రార్థించడం ద్వారా క్రైస్తవులందరికీ మాదిరినుంచాడు. (లూకా 22:​42) యెహోవాకు వినయంగా లోబడతామనే అదే అభిప్రాయాన్ని నేడు కోట్లాదిమంది దేవుని సేవకులు వ్యక్తం చేస్తున్నారు. వారిలో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 120వ తరగతికి చెందిన 52 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. 2006, మార్చి 11న పట్టభద్రులైన ఆ తరగతి సభ్యులు వివిధ దేశాల్లో సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉన్నా దేవుని చిత్తాన్ని చేయడానికి అవకాశం లభించినందుకు ఎంతో సంతోషించారు.

యెహోవా చిత్తమే తమ జీవితాల్ని నిర్దేశించేందుకు అనుమతించేలా ఆ పట్టభద్రుల్ని ఏది పురికొల్పుతుంది? బొలీవియాలో మిషనరీలుగా సేవ చేయడానికి నియమించబడిన క్రిస్‌, లెస్లీ దంపతులు ఆ ప్రశ్నకు ఇలా జవాబిచ్చారు: “మమ్మల్ని మేము ఉపేక్షించుకున్నాం కాబట్టి, యెహోవా సంస్థకు సంబంధించి ఏ పనైనా చేయడానికి మేము సిద్ధంగా ఉండాలనుకుంటున్నాం.” (మార్కు 8:​34) అల్బేనియాకు నియమించబడిన జేసన్‌, షరీలు కూడా ఇలా అన్నారు: “యెహోవా సంస్థ మాకు నిర్దేశించిన నియామకాలన్నింటిలో సవాళ్లు లేకపోలేదు. అయితే, యెహోవాను పూర్తిగా నమ్మవచ్చని మేము తెలుసుకున్నాం.”

యెహోవా చిత్తానికి లోబడాలనే ప్రోత్సాహం

బెతెల్‌ కుటుంబంలో సభ్యునిగా ఉన్న, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న జార్జ్‌ స్మిత్‌ ఆ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించారు. యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడు, ఆ స్నాతకోత్సవ కార్యక్రమానికి అధ్యక్షుడు అయిన స్టీఫెన్‌ లెట్‌ హాజరైనవారందరినీ స్వాగతించారు. ఆ సంతోష సందర్భానికి హాజరయ్యేందుకు 23 దేశాలనుండి అతిథులు న్యూయార్క్‌లోని, ప్యాటర్‌సన్‌లో ఉన్న వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌కు వచ్చారు. పట్టభద్రులందరూ “ఎంతో గొప్ప కార్యాన్ని సాధించబోతున్నారని” సహోదరుడు లెట్‌ వారితో అన్నారు. ఆ క్రొత్త మిషనరీలు లేఖనాల శక్తితో పడద్రోయగలిగే “దుర్గముల” వైపు అంటే అబద్ధ సిద్ధాంతాల వంటివాటివైపు ఆయన వారి దృష్టిని మళ్లించాడు. (2 కొరింథీయులు 10:​4, 5) ఆయన తన ప్రసంగాన్ని ఇలా ముగించారు: “మీ నియామకాల్లో మీరు కలిసే యథార్థవంతుల హృదయాలనుండి ఆ దుర్గాల వంటి అబద్ధ సిద్ధాంతాలను పడద్రోయడానికి యెహోవా మిమ్మల్ని ఉపయోగించుకోవడం మీకు ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో కదా!”

ప్రధాన కార్యాలయంలో సేవచేస్తున్న హెరాల్డ్‌ జాక్సన్‌, “గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు” అనే అంశంపై ప్రసంగించారు. ‘దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకడాన్ని’ ఆ క్రొత్త మిషనరీలు ఎన్నడూ మరచిపోకూడదని ఆయన చెప్పారు. (మత్తయి 6:​33) “ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ” చేస్తుందనీ, అది సాఫల్యానికి నిజమైన కీలకమనీ వారు గుర్తుంచుకోవాలి. (1 కొరింథీయులు 8:⁠1) “మీరు ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు మీరు చేసే పనులు ప్రేమచేత నిర్దేశించబడాలి” అని ఆయన వారితో అన్నారు.

1979 నుండి 2003 వరకు మిషనరీగా సేవచేసి, ఇప్పుడు పరిపాలక సభ సభ్యునిగా ఉన్న జెఫ్రీ జాక్సన్‌ తర్వాతి ప్రసంగంలో పట్టభద్రుల్ని ఇలా ప్రశ్నించారు: “మీరు బాధ్యులా?” తమ విషయంలో, తమ పరిచర్య విషయంలో సమతూక దృక్పథాన్ని కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. సత్యపు విత్తనాలను నాటడానికి, నీరు పోయడానికి కృషి చేయడం క్రైస్తవుల బాధ్యత. అయితే, ఆధ్యాత్మిక అభివృద్ధినిచ్చే బాధ్యత యెహోవాది ఎందుకంటే ‘వృద్ధి కలుగజేసేవాడు దేవుడే.’ (1 కొరింథీయులు 3:​6-9) సహోదరుడు జాక్సన్‌ ఇంకా ఇలా అన్నారు: “ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు యెహోవా మిమ్మల్ని బాధ్యులుగా ఎంచుతాడు. అయితే, మీకున్న అత్యంత గొప్ప బాధ్యత ఏమిటి? యెహోవాను ప్రేమించడం, మీరు సేవించబోయే ప్రజల్ని ప్రేమించడం.”

“మీరు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి” అనే కార్యక్రమ ముఖ్యాంశంపై గిలియడ్‌ ఉపదేశకుడైన లారెన్స్‌ బొవెన్‌ ప్రసంగించారు. యెహోవా ఇశ్రాయేలీయులను అరణ్యంలో అద్భుత రీతిలో నడిపించి, సంరక్షించాడని ఆయన విద్యార్థులకు గుర్తుచేశారు. (నిర్గమకాండము 13:​21, 22) యెహోవా నేడు మనల్ని నిర్దేశిస్తూ, సంరక్షిస్తున్నాడు, అలా చేయడానికి ఆయన ఉపయోగించే మాధ్యమాల్లో “సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్న” అభిషిక్త క్రైస్తవ సంఘం ఒకటి. (1 తిమోతి 3:​14, 15) వినయస్థులకు నిర్దేశాన్ని, రక్షణను ఇచ్చే సత్యాన్ని ఆ క్రొత్త మిషనరీలు సమర్థించాలి.

పట్టభద్రులు తమ “వెనక” ఉన్న దేవుని వాక్యాన్ని మరిచిపోవద్దని మరో గిలియడ్‌ ఉపదేశకుడైన వాలెస్‌ లివరెన్స్‌ ఉద్బోధించాడు. బైబిలు శతాబ్దాల క్రితం పూర్తి చేయబడింది కాబట్టి దేవుని వాక్యం ఆ అర్థంలో వెనక ఉంది. ఒక కాపరి గొఱ్ఱెల మంద వెనకనుండి పిలుపునిచ్చే విధంగానే యెహోవా కూడా తన ప్రజల వెనక ఉండి, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా వారిని నిర్దేశిస్తున్నాడు. (యెషయా 30:21; మత్తయి 24:​45-47) పట్టభద్రులు ఆ దాసుని తరగతిపట్ల మెప్పును పెంచుకొనేందుకు గిలియడ్‌ పాఠశాల సహాయం చేసింది. ఆ “దాసుడు” పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము (ఆంగ్లం)ను కూడా అందించాడు. “దాచిపెట్టబడిన భండారంలాంటి ఈ సమాచారాన్ని తీసుకుని, ఇతరులకు బోధించేందుకు దాన్ని ఉపయోగించండి” అంటూ ప్రసంగీకుడు పట్టభద్రుల్ని ప్రోత్సహించారు.​—⁠మత్తయి 13:​52.

క్షేత్రపరిచర్యలో యెహోవా చిత్తాన్ని చేయడం

పట్టభద్రులు గిలియడ్‌ స్కూల్‌కు హాజరవుతుండగా వారు పరిచర్యలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాలను “సువార్త ప్రకటించడానికి ఉత్సాహంగా ఉండండి” అనే కార్యక్రమ భాగంలో గిలియడ్‌ ఉపదేశకుడైన మార్క్‌ న్యూమర్‌ నొక్కిచెప్పారు. (రోమీయులు 1:​15) పట్టభద్రులతో జరిపిన ఇంటర్వ్యూలలో వారు నిజంగానే ప్రతీ సందర్భంలో ప్రకటించేందుకు విశేషమైన ఉత్సాహాన్ని చూపించారని వెల్లడైంది.

అంతేకాదు, సహోదరుడు కెన్నెత్‌ ఫ్లోడిన్‌, ప్రస్తుతం అమెరికాలో సేవచేస్తున్న ముగ్గురు ప్రాంతీయ పైవిచారణకర్తలను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ పట్టభద్రులు మరింత ప్రోత్సాహాన్ని పొందారు. రిచర్డ్‌ కెల్లర్‌, ఆలేయాంద్రో లాకియోలు గతంలో పశ్చిమ, మధ్య అమెరికాలలో సేవ చేశారు. అక్కడ వారికి ఎదురైన వివిధ ఇబ్బందుల్ని ఎలా సహించారో వివరించి, మిషనరీలుగా సేవచేస్తున్నప్పుడు వారికి లభించిన కొన్ని ఆశీర్వాదాల గురించి చెప్పారు. మోయాసిర్‌ ఫెలిస్బినో తన స్వదేశమైన బ్రెజిల్‌లో మిషనరీలతో కలిసి సన్నిహితంగా పనిచేసినప్పుడు ఆయనకెలాంటి శిక్షణ లభించిందో వివరించాడు.

రాబర్ట్‌ జోన్స్‌, ఉడ్వర్త్‌ మిల్స్‌, క్రిస్టోఫర్‌ స్లే అనే ముగ్గురు అనుభవజ్ఞులైన మిషనరీలను డేవిడ్‌ షేఫర్‌ ఇంటర్వ్యూ చేశారు. కష్టాలను అనుభవిస్తున్నప్పుడు యెహోవాపై నమ్మకంతో చర్య తీసుకోవడాన్ని వారు ఎలా నేర్చుకున్నారో ఆ ముగ్గురు సహోదరులు వివరించారు. యెహోవా సంస్థనుండి తాము పొందిన శిక్షణ తమ మిషనరీ నియామకాల కోసం తమను పూర్తిగా సిద్ధం చేసిందని వారు తరగతికి హామీనిచ్చారు. సహోదరుడు మిల్స్‌ ఈ మాటల్లో సారాంశాన్ని చెప్పారు: “గిలియడ్‌ స్కూల్‌లో బైబిలు సత్యాలు, వాస్తవాలు బోధించబడినా, వినయం ప్రేమల గురించి పాఠశాల బోధించిన విషయాలే నాకు ఎక్కువగా సహాయం చేశాయి.”

పరిపాలక సభ సభ్యుడైన గైపియర్స్‌ “యెహోవా ఎన్నటికీ విఫలం కాడు” అనే శీర్షికతో ముఖ్య ప్రసంగాన్ని అందించారు. ఆదాము విఫలమైనంతమాత్రాన, దేవుడు విఫలమయ్యాడని దానర్థమా? కొందరు అంటున్నట్లుగా, ఆదామును పరిపూర్ణంగా సృష్టించడంలో దేవుడు విఫలమయ్యాడా? ఖచ్చితంగా విఫలం కాలేదు ఎందుకంటే, “దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను.” (ప్రసంగి 7:​29) యేసు భూమిపై ఉన్నప్పుడు ఆయనకు ఎదురైన అత్యంత గొప్ప పరీక్షలో ఆయన చూపించిన యథార్థత, “ఆదాము విఫలమయ్యేందుకు కారణమే లేదు” అని రుజువుచేసిందని ఆ ప్రసంగీకుడు వ్యాఖ్యానించారు. యేసు విజయవంతంగా ఎదుర్కొన్న పరీక్షకన్నా ఆదాముకు ఏదెను తోటలో ఎదురైన విధేయతా పరీక్ష చాలా సులువైంది. అయినా ఆదాము విఫలమయ్యాడు. అయితే, యెహోవా ఎన్నటికీ విఫలం కాడు. ఆయన సంకల్పం తప్పక నెరవేరుతుంది. (యెషయా 55:​11) సహోదరుడు పియర్స్‌ క్రొత్త మిషనరీలతో ఇలా అన్నారు: “మీ స్వయంత్యాగ స్ఫూర్తితో యెహోవాను ఘనపరిచే ఆధిక్యత మీకుంది. మిషనరీలుగా మీరు ఎక్కడ ఉండి ఆయన సేవచేసినాసరే యెహోవా మీలో ప్రతీ ఒక్కరికీ తోడై ఉండును గాక.”

అధ్యక్షుడైన సహోదరుడు లెట్‌ యెహోవాసాక్షుల వివిధ బ్రాంచి కార్యాలయాలనుండి వచ్చిన శుభాకాంక్షలను తెలియజేసిన తర్వాత, పట్టభద్రులకు వారి పట్టాలను, నియామకాలను అందించారు. బెతెల్‌ కుటుంబంలో ఎంతో కాలంగా సేవచేస్తున్న వెర్నోన్‌ వైస్‌గార్వర్‌ ప్రేక్షకులందిరి తరఫున ముగింపు ప్రార్థన చేశారు.

ఆ స్నాతకోత్సవ కార్యక్రమం దేవుని చిత్తాన్ని చేయడానికి తమలో నూతనోల్లాసాన్ని నింపిందని అక్కడ హాజరైన 6,872 మంది భావించారు. (కీర్తన 40:8) పట్టభద్రులైన ఆండ్రూ, ఆన్నా ఇలా అన్నారు: “మేము మా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నాం. యెహోవా అడిగే దేనినైనా చేస్తామని మేము ఆయనకు వాగ్దానం చేశాం. యెహోవా మమ్మల్ని ఇప్పుడు ఆఫ్రికాలోని కామెరూన్‌కు వెళ్లమని అడిగాడు.” వారు, పట్టభద్రులయ్యే ఇతరులు, తమకు సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చే నియామకాల్ని ప్రారంభించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అవును, దేవుని చిత్తాన్ని చేయడానికి వారెంతో సంతోషిస్తారు.

[17వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంకాలు

ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 6

నియమించబడిన దేశాల సంఖ్య: 20

విద్యార్థుల సంఖ్య: 52

సగటు వయస్సు: 35.7

సత్యంలో సగటు సంవత్సరాలు: 18.3

పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 14.5

[18వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు చెందిన 120వ తరగతి పట్టభద్రులు

ఈ క్రింద ఉన్న లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోని పేర్లు ఎడమ నుండి కుడికి ఇవ్వబడ్డాయి.

(1) రైట్‌, ఎస్‌.; స్వరేస్‌, బి.; క్రైసాంట్‌, బి.; డావన్‌పోర్ట్‌, ఎల్‌. (2) జాన్సన్‌, ఎ.; అలై, సి.; కేడీ, కె.; గ్యుర్రెరో, పి.; ఆసెజ్‌, ఎ. (3) ఆర్టీజ్‌, ఎల్‌.; లైల్‌, కె.; యుజెటా, ఎమ్‌.; పారాత్‌, ఆర్‌.; బాక్కస్‌, కె.; కాటరీనా, సి. (4) పామర్‌, బి.; లవిన్‌, డి.; మాక్‌డొనో, జె.; బొస్టోక్‌, డి.; బెనెటాటోస్‌, ఎల్‌. (5) జసీకీ, ఎమ్‌.; సరాఫియానోస్‌, ఇ.; స్టెల్టర్‌, సి.; వైరా, ఆర్‌.; వూన్‌, జె.; ప్రెన్టాస్‌, కె. (6) డావన్‌పోర్ట్‌, హెచ్‌.; క్రైసాంట్‌, హెచ్‌., పారాత్‌, ఎమ్‌.; వైరా, ఇ.; స్వరేస్‌, ఎ.; కాటరీనా, ఐ.; రైట్‌, సి. (7) కేడీ, కె.; మాక్‌డొనో, జె.; ఆర్టీజ్‌, ఎమ్‌.; వూన్‌, జె.; అలై, జె.; ఆసెజ్‌, ఎమ్‌. (8) సరాఫియానోస్‌, జి.; లైల్‌, డి.; యుజెటా, సి.; స్టెల్టర్‌, పి.; ప్రెన్టాస్‌, జి.; జాన్సన్‌, ఎ.; బెనెటాటోస్‌, సి. (9) పామర్‌, జె.; జసీకీ, డబ్ల్యూ.; బాక్కస్‌, జె.; బొస్టోక్‌, ఎస్‌.; గ్యుర్రెరో, జె. ఎమ్‌.; లవిన్‌, ఎస్‌.