కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్వసనీయంగా ఉండడంవల్ల ప్రయోజనం ఉందా?

విశ్వసనీయంగా ఉండడంవల్ల ప్రయోజనం ఉందా?

విశ్వసనీయంగా ఉండడంవల్ల ప్రయోజనం ఉందా?

“మీరు ఆరోగ్య భీమా కోసం చాలా ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారు. మీరు మీ ఆరోగ్య భీమాను మా కంపెనీకి మార్చుకున్నట్లయితే ప్రతీ నెలా 900 రూపాయలు ఆదా చేసుకుంటారు, అది చాలా పెద్ద మొత్తమే” అని కార్ల్‌ అనే భీమా ఏజెంటు అన్నాడు. *

“అది నిజమే కావచ్చు, కానీ నేను చాలా సంవత్సరాల నుండి ఈ కంపెనీలోనే ఆరోగ్య భీమా కడుతున్నాను. వారు గతంలో నాకు ఎంతో సహాయం చేశారు, నేను వారికి విశ్వసనీయంగా ఉండాలనుకుంటున్నాను” అని యెన్స్‌ జవాబిచ్చాడు.

“విశ్వసనీయత ఒక సద్గుణమే, అయినా విశ్వసనీయంగా ఉండడంవల్ల మీరు అధిక మొత్తంలో డబ్బు చెల్లించాల్సివస్తోంది!” అని కార్ల్‌ జవాబిచ్చాడు.

కార్ల్‌ చెప్పింది నిజమే. సాధారణంగా ఇతరులకు విశ్వసనీయంగా లేక నమ్మకంగా ఉండడానికి డబ్బు ఖర్చుకావచ్చు. * విశ్వసనీయంగా ఉండడానికి సమయం, శక్తి మాత్రమే కాక అంకిత భావం కూడా అవసరమవుతుంది. విశ్వసనీయంగా ఉండడంవల్ల ప్రయోజనం ఉందా?

విస్తృతంగా కొనియాడబడుతున్నా అనుసరించబడడం లేదు

జర్మనీలోని అలెన్స్‌బాక్‌ ఒపీనియన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన ఒక సర్వేకు ప్రతిస్పందించినవారిలో 96 శాతం మంది, నమ్మకంగా ఉండడం అనేది అభిలషణీయమైన ఒక లక్షణమని అభిప్రాయపడ్డారు. 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు గలవారితో అలెన్స్‌బాక్‌ నిర్వహించిన రెండవ సర్వేలో ప్రతిస్పందించిన ప్రతీ ముగ్గురిలో ఇద్దరు, నమ్మకంగా ఉండడం ఒక సద్గుణమని అభిప్రాయపడ్డారు.

విశ్వసనీయత లేక నమ్మకంగా ఉండడం విస్తృతంగా కొనియాడబడుతున్నా, వాస్తవానికి విశ్వసనీయంగా ఉండడం లేక నమ్మకంగా ఉండడం విషయంలో పరిస్థితి వేరుగా ఉంది. ఉదాహరణకు, అనేక యూరప్‌ దేశాల్లో, వివాహ దంపతులు లేక కుటుంబ సభ్యులు తరచూ ఒకరిపట్ల మరొకరు విశ్వసనీయతను ఎక్కువగా చూపించడం లేదు. స్నేహితులు తరచూ ఒకరిపట్ల మరొకరు విశ్వసనీయంగా ఉండడం లేదు. గతంలో యజమానికి, ఉద్యోగికి మధ్య లేక వ్యాపారానికి, వినియోగదారులకు మధ్య, బంధాన్ని ఏర్పరచిన విశ్వసనీయత నేడు చాలావరకు తెరమరుగైపోయింది. కారణం ఏమిటి?

కొన్నిసార్లు తీరికలేని జీవితంవల్ల విశ్వసనీయతను చూపించాల్సిన బాధ్యతలను నెరవేర్చడానికి అవసరమైన సమయం లేక మానసిక శక్తి లేకుండా పోతుంది. మానవ సంబంధాల్లో నిరాశా నిస్పృహలకు గురైనవారు, ఎవరికైనా నమ్మకంగా ఉండడం విషయంలో బహుశా ఇప్పుడు సంశయిస్తుండవచ్చు. మరికొందరు విశ్వసనీయత అవసరం లేని తాత్కాలిక జీవన విధానాన్ని ఇష్టపడవచ్చు.

కారణం ఏదైనా, విశ్వసనీయత ఎక్కువగా కొనియాడబడుతున్నా అంతగా అనుసరించబడని ఒక సద్గుణం. అందుకే మనం ఈ క్రింది ప్రశ్నలను పరిశీలిద్దాం: విశ్వసనీయంగా ఉండడంవల్ల ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉంటే మనం ఎవరిపట్ల విశ్వసనీయంగా ఉండాలి, ఏయే విధాలుగా విశ్వసనీయంగా ఉండాలి? విశ్వసనీయంగా ఉండడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి?

[అధస్సూచీలు]

^ పేరా 2 ఈ ఆర్టికల్లో, తర్వాతి ఆర్టికల్లో కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

^ పేరా 5 “విశ్వసనీయత,” “నమ్మకంగా ఉండడం” ఎప్పుడూ ఒకే సందర్భంలో ఉపయోగించబడకపోయినా, అవి ఈ ఆర్టికల్లలో కొన్నిసార్లు పర్యాయపదాలుగా ఉపయోగించబడ్డాయి.

[3వ పేజీలోని బ్లర్బ్‌]

విశ్వసనీయత ఎక్కువగా కొనియాడబడుతున్నా అంతగా అనుసరించబడని ఒక సద్గుణం