మనమెందుకు ఒంటరిగా మనుగడ సాగించలేము?
మనమెందుకు ఒంటరిగా మనుగడ సాగించలేము?
“ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును.”—సొలొమోను రాజు
ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన సొలొమోను రాజు ఇలా అన్నాడు: “ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును.” (ప్రసంగి 4:9, 10) మానవ ప్రవర్తనను బాగా గమనించిన ఈ జ్ఞాని, సహచర్యం కోసం మనకున్న అవసరాన్ని, అందరికి దూరంగా ఒంటరిగా ఉండకూడదనే ప్రాముఖ్యతను అలా నొక్కి చెబుతున్నాడు. అయితే, ఇది కేవలం మానవ అభిప్రాయం మాత్రమే కాదు. దైవిక జ్ఞాన ప్రేరేపణలతో సొలొమోను ఆ వ్యాఖ్యానం చేశాడు.
అందరికి దూరంగా ఒంటరిగా ఉండడం జ్ఞానయుక్తమైనది కాదు. ప్రజలకు ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. ఇతర మానవుల నుండి లభించే బలం, సహాయం మనకందరికీ అవసరం. “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి” అని ఒక బైబిలు సామెత చెబుతోంది. (సామెతలు 18:1) అందువల్ల మనల్ని ఒక గుంపులో భాగమై ఉండమనీ, ఇతరుల గురించి ఆసక్తి కలిగివుండమనీ సమాజ శాస్త్రవేత్తలు ప్రోత్సహించడంలో వింతేమీ లేదు.
సాంఘిక జీవనాన్ని పునరుద్ధరించడానికి చేయబడిన సిఫారసులలో, ప్రొఫెసర్ రాబర్ట్ పుటనామ్ “ఆధ్యాత్మిక విశ్వాస ప్రభావాన్ని బలపర్చడం” గురించి ప్రస్తావిస్తున్నాడు. ఈ విషయంలో యెహోవాసాక్షులు సర్వశ్రేష్ఠమైనవారిగా ఉన్నారు, ఎందుకంటే వారు భూవ్యాప్తంగా ఉన్న ఒక్కటే కుటుంబంలాంటి సంఘాల్లో కాపుదలను అనుభవిస్తున్నారు. అపొస్తలుడైన పేతురు మాటలకు అనుగుణంగా వారు, భక్తితో ‘దేవునికి భయపడే సహోదరులను ప్రేమిస్తారు.’ (1 పేతురు 2:17) సాక్షులు అందరికి దూరంగా ఒంటరిగా ఉండడాన్ని కూడా నివారిస్తారు, దాని నాశనకరమైన ప్రభావాలను తప్పించుకుంటారు, ఎందుకంటే సత్యారాధనకు సంబంధించిన అనేక ప్రోత్సాహకరమైన కార్యకలాపాలు, దేవుని వాక్యమైన బైబిలులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి తమ పొరుగువారికి సహాయం చేయడంలో వారు నిమగ్నమై ఉండేలా చేస్తాయి.—2 తిమోతి 2:15.
ప్రేమ, సహవాసం వారి జీవితాలను మార్చివేశాయి
యెహోవాసాక్షులది ఒక సమైక్య సమాజం, దానిలోని ప్రతి సభ్యుడు ఒక ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాడు. ఉదాహరణకు, మీగల్, ఫ్రోయీలాన్, అల్మా రూత్ అనే వారి విషయమే తీసుకోండి, వీరు ముగ్గురూ లాటిన్ అమెరికాలోని ఒకే కుటుంబానికి చెందినవారు. వారికి పుట్టుకతోనే ఎముకలకు సంబంధించిన ఒక రుగ్మత ఉంది, దాని మూలంగా ఎదుగుదల సరిగా జరగదు. ఈ ముగ్గురూ చక్రాల కుర్చీలకే బంధీలైపోయారు. సాక్షులతో సహవాసం వారి జీవితాలనెలా ప్రభావితం చేసింది?
మీగల్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “నేనెంతో క్లిష్టమైన సమయాలను ఎదుర్కొన్నాను, కానీ నేను యెహోవా
ప్రజలతో సహవసించడం ప్రారంభించినప్పుడు నా జీవితం మారిపోయింది. అందరికి దూరంగా ఒంటరిగా ఉండడం చాలా ప్రమాదకరమైనది. క్రైస్తవ కూటాల్లో తోటి విశ్వాసులతో సహవసించడం, ప్రతి వారం వారిని కలవడం సంతుష్టి, సంతృప్తి పొందడానికి నాకెంతో సహాయం చేశాయి.”దానికి అల్మా రూత్ ఇలా జతచేస్తోంది: “అప్పుడప్పుడు నేనెంతో కృంగిపోయేదాన్ని; నాకు చాలా బాధగా ఉండేది. కాని యెహోవా గురించి తెలుసుకున్న తర్వాత, నేను ఆయనతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోగలనని నాకనిపించింది. అది నా జీవితంలో నాకు అత్యంత అమూల్యమైన విషయమయ్యింది. నా కుటుంబం మాకెంతో సహాయం చేసింది, అది మమ్మల్ని మరింత ఐక్యపరిచింది.”
మీగల్ తండ్రి ప్రేమపూర్వకంగా ఆయనకు చదవడం, రాయడం నేర్పించాడు. ఆ తర్వాత మీగల్, ఫ్రోయీలాన్‌కు అల్మా రూత్‌కు అలాగే నేర్పించాడు. ఇది వారి ఆధ్యాత్మికతకు ఎంతో ఆవశ్యకమైనది. “చదువు నేర్చుకోవడం మాకెంతో ప్రయోజనాన్ని చేకూర్చింది ఎందుకంటే అప్పుడే మేము బైబిలును, బైబిలు ఆధారిత ప్రచురణలను చదివి ఆధ్యాత్మిక పోషణను పొందగలము” అని అల్మా రూత్ చెబుతోంది.
ప్రస్తుతం మీగల్ క్రైస్తవ పెద్దగా సేవచేస్తున్నాడు. ఫ్రోయీలాన్ బైబిలు మొత్తం తొమ్మిదిసార్లు చదివాడు. అల్మా రూత్ 1996 నుండి పయినీరుగా అంటే పూర్తికాల రాజ్య ప్రచారకురాలిగా సేవచేస్తూ యెహోవాకు తాను చేసే సేవను అధికం చేసుకుంది. ఆమె ఇలా వ్యాఖ్యానిస్తోంది: “యెహోవా సహాయంతో నేనీ లక్ష్యాన్ని సాధించగలిగాను, నా ప్రియ సహోదరీలు కూడా నాకు మద్దతునిచ్చారు, వారు నాకు ప్రకటించేందుకే కాదు, నేను ప్రారంభించగలిగిన 11 బైబిలు అధ్యయనాలను నేనే నిర్వహిస్తూ బోధించేందుకు కూడా సహాయం చేస్తున్నారు.”
ఎమీలీయ, మరో మంచి మాదిరినుంచింది, ప్రమాదానికి గురికావడం మూలంగా కాళ్ళకు, వెన్నెముకకు గాయాలవ్వడంతో ఆమె చక్రాల కుర్చీని ఉపయోగిస్తుంది. మెక్సికో నగరంలోని యెహోవాసాక్షులు ఆమెతో బైబిలు అధ్యయనం చేశారు, ఆమె 1996లో బాప్తిస్మం తీసుకుంది. ఎమీలీయ ఇలా చెబుతోంది: “సత్యం తెలుసుకోకముందు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను; ఏమాత్రం జీవించాలనిపించేది కాదు. నాకంతా శూన్యంగా అనిపించేది, రాత్రింబగళ్ళు ఏడ్చేదాన్ని. కాని నేను యెహోవాసాక్షులతో సహవసించినప్పుడు, సహోదరుల ప్రేమను చవిచూశాను. వారు నా పట్ల చూపించిన వ్యక్తిగత ఆసక్తి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. పెద్దల్లో ఒకరు నాకు ఒక సహోదరుడిలా, తండ్రిలా ఉన్నారు. ఆయన, కొంతమంది పరిచర్య సేవకులు నన్ను నా చక్రాల కుర్చీలో కూటాలకు, ప్రకటనా పనికి తీసుకువెళ్తారు.”
1992లో యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్న హోసే ఒంటరి జీవి. ఆయనకు 70 ఏళ్ళు, 1990లో ఆయన ఉద్యోగ విరమణ పొందాడు. హోసే ముందు ఎంతో కృంగిపోయేవాడు, కానీ ఒక సాక్షి ఆయనకు ప్రకటించిన తర్వాత ఆయన వెంటనే క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం మొదలుపెట్టాడు. అక్కడ విన్నది, చూసినది ఆయనకు నచ్చింది. ఫిలిప్పీయులు 1:1; 1 పేతురు 5:2) అలాంటి తోటి విశ్వాసులు ఆయనకు “ఆదరణ” కలిగించేవారిగా ఉన్నారు. (కొలొస్సయులు 4:11) వారు ఆయనను డాక్టరు దగ్గరికి తీసుకువెళ్తారు, ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శిస్తారు, ఆయనకు జరిగిన నాలుగు ఆపరేషన్ల సమయంలోనూ ఆయనకు మద్దతునిచ్చారు. “వారు నా పట్ల శ్రద్ధ చూపిస్తారు. వారు నిజంగా నా కుటుంబం. వారి సహచర్యం నాకిష్టం” అని ఆయన అంటున్నాడు.
ఉదాహరణకు, సహోదరుల సహవాసాన్ని ఆయన గమనించాడు, వ్యక్తిగా తన పట్ల వారు చూపిస్తున్న శ్రద్ధను గ్రహించాడు. ఇప్పుడు ఆయన సంఘంలోని పెద్దలు, పరిచర్య సేవకులు ఆయనను చూసుకుంటారు. (ఇవ్వడంలో గొప్ప ఆనందం ఉంది
సొలొమోను రాజు “ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు” అని అన్నప్పుడు ఆయన అంతకు ముందే, వస్తుసంపదలను సమకూర్చుకోవడానికి తమ శక్తినంతటినీ ధారపోయడంలోని వ్యర్థత గురించి మాట్లాడాడు. (ప్రసంగి 4:7-9) నేడు చాలామంది సరిగ్గా అదే చేస్తున్నారు, దాని కోసం కుటుంబంలోనూ, కుటుంబంవెలుపలా మానవ సంబంధాలను బలి చేయవలసి వచ్చినప్పటికీ వారు దాన్నే వెంటాడుతున్నారు.
ఆ విధమైన దురాశ, స్వార్థం అనేకులు తాముగా అందరికి దూరంగా ఒంటరిగా ఉండిపోయేలా చేశాయి. ఇది వారికి అటు సంతోషాన్నీ ఇటు సంతృప్తికరమైన జీవితాన్నీ ఇవ్వలేకపోయింది, ఎందుకంటే అలాంటి లక్షణాలకు లొంగిపోయేవారికి సాధారణంగా ఆశాభంగం, నిరాశ మిగులుతాయి. దానికి భిన్నంగా, ఇంతక్రితం మనం పరిశీలించిన వృత్తాంతాలు యెహోవా సేవ చేసేవారితో, ఆయనపట్ల మరియు పొరుగువారిపట్ల ప్రేమతో పురికొల్పబడినవారితో సహవసించడం వల్ల కలిగే మంచి ప్రభావాల గురించి తెలియజేస్తున్నాయి. ఈ వ్యక్తులు క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరుకావడం, తోటి క్రైస్తవులు చూపించే శ్రద్ధనూ మద్దతునూ పొందడం, పరిచర్యలో ఆసక్తిగా పాల్గొనడం వంటివి వారు ఒంటరితనానికి సంబంధించిన ప్రతికూల భావాలను అధిగమించడంలో ప్రాముఖ్యమైన పాత్ర వహించాయి.—సామెతలు 17:17; హెబ్రీయులు 10:24, 25.
మనం పరస్పరం ఒకరిపై మరొకరం ఆధారపడతాము కాబట్టి, ఇతరులకోసం ఏదైనా చేయడం వల్ల సంతృప్తి కలగడం సహజమే. ఇతరులకు ప్రయోజనం చేకూర్చిన పని చేసిన ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ఇలా అన్నాడు: “ఒక వ్యక్తి విలువను చూడవలసింది . . . ఆయన ఏమి తీసుకోగలడనేదాన్ని బట్టి కాదు గానీ ఆయన ఏమి ఇస్తున్నాడనేదాన్ని బట్టే.” ఇది, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలతో పొందిక కలిగివుంది. (అపొస్తలుల కార్యములు 20:35) కాబట్టి, ప్రేమను పొందడం మంచిదే అయినా, ఇతరుల పట్ల ప్రేమ చూపించడం కూడా ఎంతో ఆరోగ్యదాయకమైనదే.
ఆధ్యాత్మిక సహాయాన్ని అందించడానికి అనేక సంవత్సరాలపాటు సంఘాలను దర్శిస్తూ, అంతగా ధనవంతులుకాని క్రైస్తవులు కూటాలు జరుపుకోవడానికి స్థలాలు నిర్మించుకునేందుకు సహాయం చేసిన ఒక ప్రయాణ పైవిచారణకర్త తన భావాలను ఇలా వ్యక్తం చేస్తున్నారు: “నా సహోదరులకు సేవ చేయడం వల్ల కలిగే ఆనందం, కృతజ్ఞతతో నిండిపోయిన వాళ్ళ ముఖాలను చూడడం వారికి సహాయం చేసేందుకు అవకాశాల కోసం అన్వేషించేలా నన్ను పురికొల్పుతాయి. ఇతరుల పట్ల వ్యక్తిగత ఆసక్తి చూపించడం సంతోషానికి కీలకమని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. పెద్దలుగా మనం ‘గాలికి మరుగైనచోటువలె, ఎండినచోట నీళ్లకాలువలవలె, అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలె’ ఉండాలని నాకు తెలుసు.”—యెషయా 32:2.
ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు!
ఇతరులకు సహాయం చేయడంలో, యెహోవా సేవ చేసేవారి సహవాసాన్ని కోరుకోవడంలో ఖచ్చితంగా గొప్ప ప్రయోజనం ఉంది. కీర్తనకర్త, “సహోదరులు ఐక్యత కలిగి కీర్తన 133:1) మీగల్, ఫ్రోయీలాన్, అల్మా రూత్‌ల విషయంలో చూపించబడినట్లుగా ఒకరికొకరు మద్దతునిచ్చుకోవడంలో కుటుంబ ఐక్యత ప్రధాన పాత్ర వహిస్తుంది. సత్యారాధనలో ఒకరితో ఒకరం ఐక్యమై ఉండడం ఎంతటి ఆశీర్వాదమో కదా! అపొస్తలుడైన పేతురు క్రైస్తవ భర్తలకు, భార్యలకు ఉపదేశం ఇచ్చిన తర్వాత ఇలా వ్రాశాడు: “తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.”—1 పేతురు 3:8.
నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” అన్నాడు. (నిజమైన స్నేహం భావోద్వేగపరంగానూ ఆధ్యాత్మికంగానూ గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తుంది. విశ్వాసంలోవున్న సహవాసులను ఉద్దేశించి మాట్లాడుతూ పౌలు ఇలా ఉద్బోధించాడు: “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి. . . . ఒకనియెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.”—1 థెస్సలొనీకయులు 5:14, 15.
కాబట్టి, ఇతరులకు మేలు చేయడానికి ఆచరణాత్మకమైన మార్గాల కోసం చూడండి. ‘అందరియెడల, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడల మేలు చేయండి’ ఎందుకంటే ఇది మీ జీవితానికి నిజమైన అర్థాన్నిస్తుంది, అంతేకాదు మీ సంతృప్తికి దోహదపడుతుంది. (గలతీయులు 6:9, 10) యేసు శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు, మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక—సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?” (యాకోబు 2:15, 16) ఆ ప్రశ్నకు సమాధానం స్పష్టమే. మనం ‘మన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ’ చూడాలి.—ఫిలిప్పీయులు 2:4.
ఏదైనా ప్రత్యేక అవసరం ఏర్పడినప్పుడు లేదా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, ఇతరులకు వస్తుపరంగా సహాయం చేయడంతోపాటు యెహోవాసాక్షులు అత్యంత ప్రాముఖ్యమైన విధంగా తమ తోటి మానవులకు ప్రయోజనం చేకూర్చడంలో అంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో నిమగ్నమైవుంటారు. (మత్తయి 24:14) ఈ ఆశా ఓదార్పుల సందేశాన్ని ప్రకటించడంలో 60,00,000 కంటే ఎక్కువమంది పాల్గొనడమనేది వారికి ఇతరులపట్ల ఉన్న నిజమైన, ప్రేమపూర్వకమైన ఆసక్తికి నిదర్శనం. పరిశుద్ధ లేఖనాల నుండి సహాయాన్ని అందించడం మానవులకుండే మరో అవసరాన్ని తీర్చడానికి కూడా సహాయం చేస్తుంది. అదేమిటి?
ఒక ప్రాముఖ్యమైన అవసరాన్ని తీర్చడం
నిజమైన సంతోషాన్ని పొందడానికి, మనకు దేవునితో సరైన సంబంధం ఉండాలి. “అన్ని కాలాల్లోనూ, సర్వత్రా, ప్రారంభం నుండి ప్రస్తుతం వరకు, తనకంటే ఉన్నతమైనదీ మరింత శక్తివంతమైనదీ అని తాను విశ్వసించిన దేనికైనాసరే ప్రార్థించాలన్న ప్రేరణ మనిషికి కలిగిందన్న వాస్తవం, మతం స్వాభావికమైనదనీ దాన్ని వైజ్ఞానికపరంగా గుర్తించాలనీ చూపిస్తోంది. . . . దేవుని కోసం మానవుని అన్వేషణ, దేవునిలో మానవునికున్న నమ్మకం యొక్క సర్వవ్యాప్తతను చూసి మనం సంభ్రమాశ్చర్యపూజ్య భావాలతో నిలబడిపోవలసిందే.”—మానవుడు ఒంటరిగా మనుగడ సాగించడు, (ఆంగ్లం), ఏ. క్రెసీ రచించినది.
యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు ధన్యులు.” (మత్తయి 5:3, NW) తోటి మానవుల నుండి ఎంతో కాలంపాటు దూరంగా ఒంటరిగా ఉండడం ప్రజలకు మంచిది కాదు. మరిముఖ్యంగా, మన సృష్టికర్తనుండి మనల్నిమనం దూరంచేసుకోవడం చాలా ప్రమాదకరం. (ప్రకటన 4:10, 11) “దేవుని గూర్చిన విజ్ఞానము”ను సంపాదించుకోవడం, దాన్ని అన్వయించుకోవడం మన జీవితంలో ప్రాముఖ్యమైన అంశమై ఉండాలి. (సామెతలు 2:1-5) వాస్తవానికి, మనం మన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉండాలి, ఎందుకంటే మనం దేవునికి దూరంగా ఒంటరిగా మనుగడ సాగించలేము. కనుక సంతోషదాయకమైన, నిజంగా ప్రతిఫలదాయకమైన జీవితం ‘సర్వలోకములో మహోన్నతుడైన’ యెహోవాతో మంచి సంబంధంపై ఆధారపడి ఉంటుంది.—కీర్తన 83:18.
[5వ పేజీలోని చిత్రం]
మీగల్: “నేనెంతో క్లిష్టమైన సమయాలను ఎదుర్కొన్నాను, కానీ నేను యెహోవా ప్రజలతో సహవసించడం ప్రారంభించినప్పుడు నా జీవితం మారిపోయింది”
[5వ పేజీలోని చిత్రం]
అల్మా రూత్: “యెహోవా గురించి తెలుసుకున్న తర్వాత, నేను ఆయనతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోగలనని నాకనిపించింది”
[6వ పేజీలోని చిత్రం]
ఎమీలీయ: “సత్యం తెలుసుకోకముందు . . . నాకంతా శూన్యంగా అనిపించేది”
[7వ పేజీలోని చిత్రం]
సత్యారాధకులతో సహవసించడం మన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవడానికి దోహదపడుతుంది