రాజుల మాదిరిని అనుసరించండి
రాజుల మాదిరిని అనుసరించండి
“అతడు . . . ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొన వలెను; అది అతనియొద్ద ఉండవలెను. . . . తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను.”—ద్వితీయోపదేశకాండము 17:18-22.
1. ఒక క్రైస్తవుడు ఎవరిలా ఉండాలనుకోవచ్చు?
మిమ్మల్ని మీరు ఒక రాజుతోగానీ రాణితోగానీ ఎన్నడూ పోల్చుకోకపోవచ్చు. యథార్థవంతుడైన బైబిలు విద్యార్థే కానీ క్రైస్తవుడే కానీ మంచి రాజులైనటువంటి దావీదు, యోషీయా, హిజ్కియా లేదా యెహోషాపాతు వంటివారిలా తాను రాజ్యాధికారంతో ప్రవర్తిస్తున్నట్లు ఊహించుకోగలడా? మీరు, కనీసం ఒక ప్రత్యేకమైన మార్గంలో మాత్రం వారిలాగే ఉండగలరు, ఉండాలి కూడా. ఇంతకూ ఏమిటా మార్గం? ఆ విషయంలో మీరు వారిలాగే ఎందుకు ఉండాలి?
2, 3. మానవ రాజు విషయమై యెహోవా ముందుగానే ఏమి గ్రహించాడు, ఆ రాజు ఏమి చేయాలి?
2 మోషే కాలంలో, ఇశ్రాయేలీయులకు మానవ రాజును యెహోవా అనుమతించడానికి చాలాకాలం ముందు, తమకొక రాజు ఉండాలనే కోరిక తన ప్రజల్లో కలుగుతుందని ఆయన ముందుగానే గ్రహించాడు. ఆ కారణంగానే ధర్మశాస్త్ర నిబంధనలో, దానికి సంబంధించిన సూచనలను చేర్చేలా ఆయన మోషేను ప్రేరేపించాడు. అవి రాజులకోసం ఇవ్వబడిన సూచనలు.
3 దేవుడు ఇలా అన్నాడు: “నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొని అందులో నివసించి—నా చుట్టునున్న సమస్త జనమువలె నా మీద రాజును నియమించుకొందుననుకొనిన యెడల, నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీమీద రాజుగా నియమించుకొనవలెను. . . . అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత . . . ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను; అది అతనియొద్ద ఉండవలెను. . . . తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను.”—ద్వితీయోపదేశకాండము 17:14-22.
4. రాజుకు దేవుడిచ్చిన నిర్దేశాల్లో ఏమేమి ఇమిడి ఉన్నాయి?
4 తన ఆరాధకుల కోసం యెహోవా ఎంపిక చేసే రాజు తాను స్వయంగా నకలు చేసుకోవాల్సిన గ్రంథాలను మీ బైబిల్లో చూడవచ్చు. ఆ రాజు ఆ ప్రతిని ప్రతిరోజూ, పదే పదే చదవాలి. అది జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి చేసే అభ్యాసం కాదు. అదొక అధ్యయనం, దానికొక ప్రయోజనకరమైన లక్ష్యముంది. యెహోవా అంగీకారం కోరుకునే రాజు సరైన హృదయ వైఖరిని పెంపొందించుకొని దాన్ని కాపాడుకొనేందుకు అలాంటి అధ్యయనం చేయడం అవసరం. విజయవంతమైన, వివేచనగల రాజుగా తయారవ్వాలంటే ఆయన ఆ ప్రేరేపిత గ్రంథాలను అధ్యయనం చేయాల్సిన అవసరముంది.—2 రాజులు 22:8-13; సామెతలు 1:1-4.
ఒక రాజులా నేర్చుకోండి
5. దావీదు రాజు నకలు చేసుకొని చదవడానికి బైబిల్లోని ఏ ఏ భాగాలు ఆయనకు అందుబాటులో ఉండేవి, ఆ విషయంలో ఆయనెలా భావించాడు?
5 దావీదు ఇశ్రాయేలు దేశానికి రాజైనప్పుడు ఆయన ఏమి చేయాల్సి ఉండేదని మీరు అనుకుంటున్నారు? బైబిలులోని మొదటి ఐదు పుస్తకాలను (ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము) నకలు చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని నకలు చేసుకోవడానికి తన సొంత కళ్ళను, చేతులను ఉపయోగించడం దావీదు మనస్సులోను, హృదయంలోను ఎంత గాఢమైన ముద్రవేసి ఉండవచ్చో ఆలోచించండి. యోబు పుస్తకంతోపాటు బహుశా 90, 91వ కీర్తనలను కూడా మోషే వ్రాసి ఉండవచ్చు. మరి వాటిని కూడా దావీదు నకలు కీర్తన 19:7-11 లో చేసిన వ్యాఖ్యానాల్లో మీకు తగినంత ఆధారం ఉంది.
చేసుకొన్నాడా? బహుశా చేసుకొని ఉండవచ్చు. వాటితోపాటు బహుశా యెహోషువ, న్యాయాధిపతులు, రూతు పుస్తకాలు కూడా ఆయనకు లభ్యమై ఉండవచ్చు. దాన్నిబట్టి దావీదు రాజు చదవడానికి, గ్రహించడానికి బైబిలులోని అధిక భాగమే ఆయన వద్ద ఉండి ఉండవచ్చునని మీరు గమనించవచ్చు. ఆయన వాటిని చదివి గ్రహించాడని నమ్మడానికి, ఆయన దేవుని ధర్మశాస్త్రం గురించి6. యేసు కూడా తన పితరుడైన దావీదు వలెనే లేఖనాలపై ఆసక్తి చూపించాడని మనం నమ్మకంగా ఎలా చెప్పవచ్చు?
6 గొప్ప దావీదు—దావీదు కుమారుడైన యేసు—అదే మాదిరిని అనుసరించాడు. వారం వారం స్థానిక సమాజమందిరానికి వెళ్ళే అలవాటు యేసుకు ఉండేది. ఆయన అక్కడ లేఖనాలను చదవడాన్ని వాటిని వివరించడాన్ని విన్నాడు. అంతేగాక, అప్పుడప్పుడు యేసు స్వయంగా దేవుని వాక్యాన్ని ప్రజల ఎదుట బిగ్గరగా చదివి దాని అన్వయింపును వివరించేవాడు. (లూకా 4:16-21) లేఖనాలతో ఆయనకున్న పరిచయాన్ని మీరు సులభంగానే గ్రహించగలుగుతారు. యేసు ఎంత తరచుగా ‘వ్రాయబడియున్నది’ అన్నాడో లేదా నిర్దిష్టమైన లేఖన భాగాలను వేరే విధాలుగా ఎలా సూచించాడో సువార్త వృత్తాంతాలను చదివి గమనించండి. ఉదాహరణకు మత్తయి వ్రాసినదాని ప్రకారం, తన కొండమీది ప్రసంగంలో యేసు హీబ్రూ లేఖనాలను 21 సార్లు ఉల్లేఖించాడు.—మత్తయి 4:4-10; 7:29; 11:10; 21:13; 26:24, 31; యోహాను 6:31, 45; 8:17.
7. మత నాయకుల నుండి యేసు ఎలా భిన్నంగా ఉన్నాడు?
7 కీర్తన 1:1-3 లో ఉన్న సలహాను యేసు పాటించాడు: “దుష్టుల ఆలోచన చొప్పున నడువక . . . యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. . . . అతడు చేయునదంతయు సఫలమగును.” ఆయన కాలంలోని, “యెహోవా ధర్మశాస్త్రము”ను నిర్లక్ష్యం చేస్తూ, ‘మోషే పీఠమందు కూర్చున్న’ మతనాయకులకు అది ఎంత భిన్నమైనదో కదా!—మత్తయి 23:2-4.
8. యూదా మత నాయకులు బైబిలు చదివినా అధ్యయనం చేసినా వారికి ఎందుకు ప్రయోజనాన్ని చేకూర్చలేదు?
8 అయినప్పటికీ, బైబిలు అధ్యయనాన్ని యేసు నిరుత్సాహపరుస్తున్నాడన్నట్లు అన్వయించబడగల ఒక భాగాన్ని బట్టి కొందరు అయోమయంలో పడవచ్చు. యోహాను 5:39, 40 లో యేసు తన కాలంలోని కొందరితో అన్నదాన్ని మనమిలా చదువుతాం: “లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు.” అలా అనడం ద్వారా తన మాటలు వింటున్న యూదులను లేఖనాల అధ్యయనం చేయకూడదని యేసు నిరుత్సాహపరచడం లేదు. బదులుగా, ఆయన వారి కపటాన్ని లేదా వారి పరస్పర వైరుద్ధ్యాన్ని ఎత్తి చూపుతున్నాడు. లేఖనాలు నిత్యజీవానికి నడిపించగలవని వారు గ్రహించారు, కానీ వారు పరిశీలిస్తున్న లేఖనాలే వారిని మెస్సీయ అయిన యేసువైపుకు కూడా నడిపించగలిగేవి. ఏది ఏమైనా వారు ఆయనను అంగీకరించలేదు. వారు నిష్కపటులూ నేర్చుకొనే అభిలాష గలవారూ కాదు కాబట్టి, అధ్యయనం వారికి ఎటువంటి ప్రయోజనాన్నీ చేకూర్చదు.—ద్వితీయోపదేశకాండము 18:15; లూకా 11:52; యోహాను 7:47, 48.
9. అపొస్తలులు, మునుపటి ప్రవక్తలు ఎలాంటి చక్కని మాదిరిని ఉంచారు?
9 యేసు శిష్యులతోసహా అపొస్తలులు ఎంత వ్యత్యాసంగా ఉండేవారు! వారు ‘రక్షణార్థమైన జ్ఞానము కలిగించే శక్తిగల పరిశుద్ధలేఖనములను’ అధ్యయనం చేశారు. (2 తిమోతి 3:14, 15) ఈ విషయంలో వారు, పూర్వం ‘కష్టపడి పరిశీలించిన జాగ్రత్తగా పరిశోధించిన’ ప్రవక్తలను పోలివున్నారు. ఆ ప్రవక్తలు పరిశోధనను ఒక్కసారిగా పెల్లుబికి కొన్ని నెలలో ఒక సంవత్సరమో కొనసాగే అధ్యయనంగా పరిగణించలేదు. వారు ప్రత్యేకంగా క్రీస్తు గురించీ మానవాళిని రక్షించే ఆయన పాత్రలోని మహిమలను గురించీ ‘నిరంతరం పరిశోధనలో కొనసాగారు’ అని అపొస్తలుడైన పేతురు చెబుతున్నాడు. (1 పేతురు 1:10, 11, NW.) పేతురు తన మొదటి ఉత్తరంలో పది బైబిలు పుస్తకాల నుండి 34 సార్లు ఉల్లేఖించాడు.
10. మనలో ప్రతి ఒక్కరం బైబిలు అధ్యయనంపై ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలి?
10 దేవుని వాక్యాన్ని శ్రద్ధతో అధ్యయనం చేయాలన్నది ప్రాచీన ఇశ్రాయేలు రాజులకు ఇవ్వబడిన నియామకమని లూకా 22:28-30; రోమీయులు 8:17; 2 తిమోతి 2:12; ప్రకటన 5:9,10; 20:6) అలాగే నేడు, దేవుని రాజ్య పరిపాలన క్రింద ఈ భూమిపై ఆశీర్వాదాల కోసం ఎదురుచూసే వారందరూ రాజుల మాదిరిని అనుసరించాల్సిన అవసరం ఉంది.—మత్తయి 25:34, 46.
స్పష్టమవుతోంది. యేసు అదే మాదిరిని అనుసరించాడు. దాన్ని అధ్యయనం చేయడం, పరలోకంలో క్రీస్తుతో రాజులుగా పరిపాలించబోయేవారి బాధ్యత. (రాజులతో పాటు మీరు కూడా నిర్వహించాల్సిన ఒక బాధ్యత
11. (ఎ) అధ్యయనం విషయంలో క్రైస్తవులకు ఏ ప్రమాదం పొంచి ఉంది? (బి) మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవడం మంచిది?
11 నిజ క్రైస్తవుల్లో ప్రతి ఒక్కరూ స్వయంగా బైబిలును పరిశీలించవలసి ఉందని మనం నిజాయితీతో స్పష్టంగా నొక్కిచెప్పవచ్చు. అది కేవలం మీరు మొదటిసారి యెహోవాసాక్షులతో అధ్యయనం చేసినప్పుడు మాత్రమే చేయవలసినది కాదు. మనలో ప్రతి ఒక్కరం, అపొస్తలుడైన పౌలు కాలంలోని కొందరు, తమ వ్యక్తిగత అధ్యయనాన్ని కొంత కాలం తర్వాత నిర్లక్ష్యం చేసినట్లు మనం చేయకూడదని దృఢంగా నిర్ణయించుకోవాలి. వారు “దేవోక్తులలో మొదటి మూలపాఠములను” అంటే, “క్రీస్తునుగూర్చిన మూలోపదేశము” వంటి వాటిని నేర్చుకున్నారు. కానీ, వారు తమ అధ్యయనాన్ని కొనసాగించలేదు, ఆ కారణంగా వారు ‘సంపూర్ణులగుటలో’ ముందుకు కొనసాగలేకపోయారు. (హెబ్రీయులు 5:12-6:3) అందుకే మనమిలా ప్రశ్నించుకోవాలి: ‘నేను క్రైస్తవ సంఘంతో సహవసిస్తున్నది తక్కువ కాలం నుండైనా ఎక్కువ కాలం నుండైనా దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం గురించి నేనెలా భావిస్తున్నాను? పౌలు తన కాలంలోని క్రైస్తవులు “దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి” పొందాలని ప్రార్థించాడు. అలాంటి కోరికే నాకూ ఉందని నేను చూపిస్తున్నానా?’—కొలొస్సయులు 1:9-12.
12. దేవుని వాక్యంపై ఇష్టాన్ని దినదినానికి అధికం చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
12 క్రమమైన అధ్యయన అలవాట్లను కలిగి ఉండడానికి కీలకమైన విషయం ఏమిటంటే మీరు దేవుని వాక్యంపై ఇష్టాన్ని పెంపొందించుకోవడమే. దేవుని వాక్యాన్ని ఒక సంపదగా భావిస్తూ దాన్ని క్రమంగా, ఒక లక్ష్యంతో ధ్యానించడం ఆనందాన్ని పొందే ఒక మార్గమని కీర్తన 119:14-16 వచనాలు సూచిస్తున్నాయి. మీరు ఎంతకాలం నుండి క్రైస్తవుడిగా ఉన్నా మీకిది వర్తిస్తుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, తిమోతి మాదిరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రైస్తవ పెద్ద అప్పటికే “క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె” సేవ చేస్తున్నప్పటికీ, ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి’ ఆసక్తితో కృషి చేయమని పౌలు ఆయనకు ఉద్బోధించాడు. (2 తిమోతి 2:3, 15, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం; 1 తిమోతి 4:15) దీన్నిబట్టి మీరు చేసే ‘కృషిలో’ క్రమమైన అధ్యయన అలవాట్లు ఉండాలని స్పష్టమవుతోంది.
13. (ఎ) బైబిలు అధ్యయనం కోసం ఎక్కువ సమయాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? (బి) అధ్యయనం కోసం సమయాన్ని సంపాదించుకునేందుకు ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవచ్చునని మీరు అనుకుంటున్నారు?
13 క్రమమైన అధ్యయన అలవాట్లను అలవర్చుకోవడానికి ఒక మెట్టు, బైబిలు అధ్యయనం కోసం క్రమంగా సమయాన్ని కేటాయించుకోవడం. మీరు ఈ విషయంలో ఎలా అభివృద్ధి సాధిస్తున్నారు? యథార్థమైన మీ జవాబు ఏదైనప్పటికీ, వ్యక్తిగత అధ్యయనంలో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు ప్రయోజనం పొందగలరని అనుకుంటున్నారా? ‘దాని కోసం సమయాన్ని ఎలా ఏర్పరచుకోగలను?’ అని మీరు ఆలోచిస్తుండవచ్చు. కొంతమంది ఉదయాన్నే కాస్త త్వరగా లేవడం ద్వారా తమ ప్రభావవంతమైన బైబిలు అధ్యయన సమయాన్ని అధికం చేసుకోగలిగారు. వారు 15 నిమిషాలపాటు బైబిలు చదవడం గానీ వ్యక్తిగత అధ్యయనం గానీ చేస్తారు. సాధ్యమయ్యే మరొక విషయం, మీ వారపు క్రమ పట్టికలో కాస్త సర్దుబాటు చేసుకోవడం గురించి ఏమంటారు? ఉదాహరణకు, మీకు వారంలో ఎక్కువగా వార్తాపత్రిక చదివే అలవాటు గానీ సాయంత్రాల్లో టీవీ వార్తలు చూసే అలవాటు గానీ ఉంటే, దాన్ని వారంలో కేవలం ఒక్కరోజు మానుకోవడం సాధ్యమవుతుందా? మీరు ఆ సమయాన్ని అదనపు బైబిలు అధ్యయనానికి వినియోగించుకోవచ్చు. మీరు ఒక రోజు వార్తల కోసం గడిపే సమయాన్ని దాదాపు 30 నిమిషాలు వ్యక్తిగత అధ్యయనానికి అంకితం చేశారంటే మీరు సంవత్సరానికి 25 గంటల కంటే ఎక్కువ సమయాన్ని పొందవచ్చు. అదనంగా 25 గంటలపాటు బైబిలు చదవడం లేదా అధ్యయనం చేయడం ద్వారా లభించే ప్రయోజనాలను ఊహించుకోండి! ఇక్కడ మరొక సలహా: వచ్చే వారం, ప్రతి రోజు ముగింపులో ఆ నాటి మీ కార్యకలాపాలన్నింటినీ పరిశీలించుకోండి. వాటిలో దేన్నైనా మానేసి లేదా దేనికైనా కాస్త సమయాన్ని తగ్గించి బైబిలు చదివే సమయాన్ని లేదా అధ్యయనం చేసే సమయాన్ని అధికం చేసుకునే అవకాశముందేమో చూడండి.—ఎఫెసీయులు 5:15, 16.
14, 15. (ఎ) వ్యక్తిగత అధ్యయనం విషయంలో లక్ష్యాలు ఎందుకు ప్రాముఖ్యమైనవి? (బి) బైబిలు చదివే విషయంలో సాధ్యమయ్యే లక్ష్యాలు ఏమిటి?
14 అధ్యయనం మీకు మరింత సులభంగా, ఆకర్షణీయంగా ఉండేలా చేసేది ఏమిటి? లక్ష్యాలు. ఏ ఆచరణాత్మకమైన అధ్యయన లక్ష్యాలను మీరు పెట్టుకోవచ్చు? చాలామంది మొత్తం బైబిలు చదవడాన్ని ప్రథమ లక్ష్యంగా పెట్టుకుంటారు, అది మెచ్చుకోదగినదే. బహుశా ఇప్పటివరకు, ద్వితీయోపదేశకాండము 32:45-47) ఆమె కంప్యూటర్ స్క్రీన్ మీదో ప్రింట్ తీసుకునో కాదుగానీ బైబిలు నుండే నేరుగా చదివేది.
మీరు కొన్ని బైబిలు భాగాలను అప్పుడప్పుడు చదివి వాటినుండి ప్రయోజనం పొందేవుంటారు. ఇప్పుడు మొత్తం బైబిలు చదవాలని మీరు దృఢంగా నిశ్చయించుకోగలరా? అలా చేయడానికి, మీరు నాలుగు సువార్తలను చదవడాన్ని మొదటి లక్ష్యంగా, తర్వాత మిగతా క్రైస్తవ గ్రీకు లేఖనాలను చదవడాన్ని రెండవ లక్ష్యంగా చేసుకోవచ్చు. తత్ఫలితంగా లభించే సంతృప్తినీ ప్రయోజనాలనూ చవిచూశాక, మీ తదుపరి లక్ష్యం మోషే వ్రాసిన పుస్తకాలతోపాటు చరిత్రకు సంబంధించిన పుస్తకాలనుండి ఎస్తేరు పుస్తకం వరకు చదవడం కావచ్చు. వాటిని పూర్తి చేశాక, మిగతా బైబిలును పూర్తి చేయడం సహేతుకంగా ఉంటుందని మీరు గ్రహిస్తారు. దాదాపు 65 యేండ్ల వయస్సులో క్రైస్తవురాలుగా మారిన ఒక స్త్రీ, తాను బైబిలు చదవడం ఎప్పుడు ఆరంభించిందీ ఎప్పుడు పూర్తి చేసిందీ తెలిపే తేదీలను బైబిల్లోని లోపలి పేజీల్లో వ్రాసుకుంది. అలాంటి తేదీలు ఇప్పుడు అయిదు జతలున్నాయి! (15 మొత్తం బైబిలు చదవాలనే లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్న కొందరు, నిరంతరం కొనసాగే తమ అధ్యయనాన్ని మరింత ఫలవంతమైనదిగా ప్రతిఫలదాయకమైనదిగా చేసుకునేందుకు ఇతర చర్యలు తీసుకుంటారు. దానికి ఒక విధానం ఏమిటంటే, ఒక్కో బైబిలు పుస్తకాన్ని చదవడానికి ముందు, ఎంపిక చేసుకొన్న అధ్యయన సమాచారాన్ని చదవడం. “ప్రతి లేఖనము దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నది” (ఆంగ్లం), లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే పుస్తకాల్లో ప్రతి బైబిలు పుస్తకం యొక్క చారిత్రక పూర్వాపరాలు, శైలి, అంతర్నిహితమైన ప్రయోజనాలు వంటి వాటిని గురించిన చక్కని సమాచారం ఉంటుంది. *
16. బైబిలు అధ్యయనం చేసే విషయంలో ఎలాంటి మాదిరిని మనం అనుసరించకూడదు?
16 మీరు అధ్యయనం చేసేటప్పుడు, బైబిలు విద్వాంసులమని చెప్పుకొనే అనేకులు సాధారణంగా అనుసరించే పద్ధతిని అనుసరించకండి. బైబిలు మానవులు వ్రాసినదన్నట్లుగా వారు మూలపాఠాలను విశ్లేషించడంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. వారిలో కొందరు బైబిల్లోని ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క వర్గానికి చెందిన ప్రజలకు వర్తిస్తుందని చెప్పడానికి ప్రయత్నిస్తారు లేదా ఒక మానవ గ్రంథకర్త మనస్సులో ఉన్నట్లు ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క లక్ష్యాన్ని, ఒక్కొక్క ఊహాత్మకమైన దృక్కోణాన్ని అంటగట్టడానికి ప్రయత్నిస్తారు. అలాంటి మానవ తర్కం, మనం బైబిల్ని కేవలం చరిత్ర పుస్తకంగా భావించేలా లేదా మతాన్ని పరిశీలించేందుకు నూతన మార్గంగా దృష్టించేలా చేయవచ్చు. ఇతర విద్వాంసులు, బైబిలు సాహిత్యపు భాషాతత్త్వము వంటి పద అధ్యయనాలకే అంకితమైపోతారు. వారు దేవుని సందేశసారం కంటే పద మూలాలను అధ్యయనం చేయడంలోనూ హీబ్రూ గ్రీకు భావాలను ఉదహరించడంలోనూ ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అలాంటి చర్యలు ప్రగాఢమైన, ప్రేరణాత్మకమైన విశ్వాసాన్ని కలిగించగలవని మీకు అనిపిస్తుందా?—1 థెస్సలొనీకయులు 2:13.
17. అందరికీ సంబంధించిన సందేశం ఉన్నదానిగా బైబిలును మనం ఎందుకు దృష్టించాలి?
17 విద్వాంసుల ఊహాగానాలు విలువైనవేనా? ఒక్కొక్క బైబిలు పుస్తకం ఒకే ప్రాముఖ్యమైన అంశాన్ని కలిగి ఉండడం లేదా సమగ్రంగా ఒక గుంపునే ఉద్దేశించి వ్రాయబడడం నిజమేనా? (1 కొరింథీయులు 1:19-21) వాస్తవమేమిటంటే, దేవుని వాక్యంలోని పుస్తకాలు అన్ని వయస్సులవారికీ అన్ని నేపథ్యాలవారికీ శాశ్వతమైన విలువ గలవి. ఏదైనా ఒక పుస్తకం మొదట్లో, ఒక వ్యక్తిని అంటే తిమోతి లేదా తీతు వంటి వారిని ఉద్దేశించి వ్రాయబడినప్పటికీ లేదా నిర్దిష్టమైన ఒక గుంపును, అంటే బహుశా గలతీయులనో ఫిలిప్పీయులనో ఉద్దేశించి వ్రాయబడినప్పటికీ ఆ పుస్తకాలను మనమందరమూ అధ్యయనం చెయ్యవచ్చు, చెయ్యాలి. మనలో ప్రతి ఒక్కరికీ అవి చాలా ప్రాముఖ్యమైనవి, నిర్దిష్టమైన ఒక పుస్తకం అనేక అంశాలను చర్చిస్తూ, వివిధ రకాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చవచ్చు. నిజంగానే, బైబిలు సందేశం ప్రపంచమంతటికీ అనువర్తిస్తుంది. ఆ విషయం, విశ్వవ్యాప్తంగా ఉన్న భాషల్లోకి బైబిలు ఎందుకు అనువదించబడిందో అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది.—రోమీయులు 15:4.
మీకూ ఇతరులకూ ప్రయోజనం
18. మీరు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు వేటి గురించి ఆలోచించాలి?
18 మీరు అధ్యయనం చేస్తుండగా, బైబిలును అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం, అలాగే అన్ని విషయాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూడడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మీరు గ్రహిస్తారు. (సామెతలు 2:3-5; 4:7) యెహోవా తన వాక్యం ద్వారా వెల్లడిచేసినదానికీ ఆయన సంకల్పానికీ చాలా దగ్గరి సంబంధం ఉంది. కాబట్టి మీరు చదివేటప్పుడు, వాస్తవాలనూ ఉపదేశాలనూ దేవుని సంకల్పంతో పోల్చి చూడండి. ఒకానొక సంఘటన, తలంపు లేదా ప్రవచనం యెహోవా సంకల్పంతో ఎలా సంబంధం కలిగి ఉందోనని మీరు ఆలోచించవచ్చు. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఇది నాకు యెహోవా గురించి ఏమి చెబుతోంది? దేవుని రాజ్యం ద్వారా ఆయన సంకల్పం నెరవేర్చబడే విషయంలో దీనికి ఎలాంటి సంబంధం ఉంది?’ మీరు ఇలా కూడా ఆలోచించవచ్చు: ‘నేను ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగించవచ్చు? నేను దీన్ని లేఖనాల ఆధారంగా ఇతరులకు బోధించడంలో గానీ సలహా ఇవ్వడంలో గానీ ఉపయోగించగలనా?’—యెహోషువ 1:8.
19. మీరు నేర్చుకొన్న విషయాలను ఇతరులతో పంచుకొంటుండగా ఎవరు ప్రయోజనం పొందుతారు? వివరించండి.
19 ఇతరుల గురించి ఆలోచించడం మరో విధంగా కూడా ప్రయోజనకరమైనది. మీరు మీ బైబిలు చదవడంలో అధ్యయనం చేయడంలో కొనసాగుతుండగా, మీరు క్రొత్త క్రొత్త విషయాలు నేర్చుకుంటారు, క్రొత్త అవగాహన పొందుతారు. కాబట్టి వాటిని మీరు మీ కుటుంబ సభ్యులతో గానీ ఇతరులతో గానీ జరిపే నిర్మాణాత్మకమైన సంభాషణల్లో చేర్చడానికి ప్రయత్నించండి. యుక్తమైన సమయాల్లో, యోగ్యమైన విధంగా మీరలా చేసినట్లైతే అలాంటి సంభాషణలు నిస్సందేహంగా ప్రతిఫలదాయకమైనవిగా ఉంటాయి. మీరు నేర్చుకొన్నవాటినీ లేదా మీకు ఆసక్తిగా అనిపించినవాటినీ మీరు ఇతరులతో నిష్కపటంగా ఉత్సాహంగా చెప్పడం, ఆ సమాచారానికి ఇతరులు మరింత ఆకర్షితులయ్యేలా చేయవచ్చు. అంతకంటే ముఖ్యంగా, అది వ్యక్తిగతంగా మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఏ విధంగా? ఒక వ్యక్తి తాను నేర్చుకున్నవి లేదా చదివినవి తన మనస్సులో తాజాగా ఉండగానే వాటిని గనుక ఇతరులతో చెప్పేటప్పుడు ఉపయోగించడం గానీ పునరుచ్ఛరించడం గానీ చేస్తే ఆ విషయాలు ఎక్కువ కాలంపాటు జ్ఞాపకం ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. *
20. బైబిలును పదే పదే చదవడం ఎందుకు ప్రయోజనకరం?
20 మీరు బైబిల్లోని ఏదైనా ఒక పుస్తకాన్ని చదివిన ప్రతీసారి తప్పకుండా క్రొత్త సమాచారాన్ని నేర్చుకొంటారు. గతంలో
మిమ్మల్ని అంతగా ముగ్ధులను చేయని భాగాల చేత ఇప్పుడు మీరు ముగ్ధులవుతారు. వాటిపై మీ అవగాహన అధికమవుతుంది. ఆ అవగాహన, బైబిలు పుస్తకాలు కేవలం మానవ సాహిత్యాలు కావనీ, అవి మీరు పదే పదే అధ్యయనం చేసి ప్రయోజనం పొందడానికి సరైన సంపదలనీ మీకు తెలియజేయాలి. దావీదు అటువంటి రాజు కూడా ‘తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదివాడు’ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.21. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడాన్ని అధికం చేసుకోవడం ద్వారా మీరు ఏ ప్రతిఫలం కోసం నిరీక్షించవచ్చు?
21 అవును, అర్థవంతమైన రీతిలో బైబిలు అధ్యయనం కోసం సమయం తీసుకొనేవారు గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు. వారు ఆధ్యాత్మిక రత్నాలను, అంతర్దృష్టిని పొందుతారు. దేవునితో వారి సంబంధం మరింత పటిష్టమవుతుంది, సన్నిహితమవుతుంది. వారు కుటుంబ సభ్యులకూ క్రైస్తవ సంఘంలోని సహోదర సహోదరీలకూ మున్ముందు యెహోవా ఆరాధకులుగా కాబోయేవారికీ దినదినానికి విలువ పెరుగుతున్న ఒక ఆస్తిలా కూడా అవుతారు.—రోమీయులు 10:9-14; 1 తిమోతి 4:16.
[అధస్సూచీలు]
^ పేరా 15 ఈ అధ్యయన సహాయకాలను యెహోవాసాక్షులు ప్రచురించారు, ఇవి అనేక భాషల్లో లభ్యమవుతాయి.
^ పేరా 19 కావలికోట ఆగస్టు 15, 1993, 13,14 పేజీలు చూడండి.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
• ఇశ్రాయేలులోని రాజులు ఏమి చేయాల్సి ఉంది?
• యేసు, అపొస్తలులు బైబిలు అధ్యయనం విషయంలో ఎలాంటి మాదిరిని ఉంచారు?
• మీ వ్యక్తిగత అధ్యయన సమయాన్ని అధికం చేసుకోవడానికి మీరు ఎలాంటి సర్దుబాట్లు చేసుకోగలరు?
• ఎలాంటి మనోవైఖరితో దేవుని వాక్య అధ్యయనాన్ని ప్రారంభించాలి?
[అధ్యయన ప్రశ్నలు]
[15వ పేజీలోని బాక్సు]
“మన చేతుల్లో”
“బైబిలుకు ఒక అకారాది పట్టిక, . . . వంటివి మనకు కావాలనుకుంటే ఇంటర్‌నెట్‌ను మించిన చక్కని ఉపకరణం వేరే ఏదీ లేదు. కానీ మనం బైబిలు చదవాలీ దాన్ని అధ్యయనం చేయాలీ దాని గురించి ఆలోచించాలీ దాని ప్రకారం నడచుకోవాలీ అని కోరుకుంటే మట్టుకు దాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవాలి. మన మనస్సుల్లోకీ హృదయాల్లోకీ దాన్ని తీసుకోవడానికి అదొక్కటే మార్గం.”—గర్‌ట్రూడ్ హిమ్మల్‌ఫార్బ్, పదవీ విరమణ చేసిన సుప్రసిద్ధ ప్రొఫెసర్, సిటీ యూనివర్సిటీ, న్యూయార్క్.