హెచ్చరికను లక్ష్యపెట్టండి!
హెచ్చరికను లక్ష్యపెట్టండి!
బూమ్! అగ్ని పర్వతం బ్రద్ధలైంది! అది 1991 జూన్ 3. జపాన్లోని ఫూజెన్ పర్వతంలో నుండి వేడి వాయువులు, బూడిద ప్రచండ వేగంతో పైకి ఎగజిమ్మాయి. వేడి లావా మిశ్రమం ఆ పర్వతం నుండి క్రిందికి ప్రవహించింది. ఈ విస్ఫోటనం 43 మందిని హతమార్చింది. కొన ఊపిరితో ప్రాణాలు దక్కించుకున్నవారి శరీరాలు ఘోరంగా కాలిపోయాయి. “నీళ్లు, నీళ్లు, దయచేసి నీళ్లివ్వండి,” అని కొందరు ఆక్రందనలు చేశారు. వాళ్లకు సహాయం చేయడానికి అగ్ని మాపకదళంవారు, పోలీసులు పరుగులు తీశారు.
ఈ సంఘటనకు రెండు వారాల మునుపు ఫూజెన్ పర్వత శిఖరాగ్రాన లావా గుమ్మటంలా కనిపించింది, దానితో అధికారులు, నివాసులు అప్రమత్తమయ్యారు. దుర్ఘటన జరగడానికి వారం కంటే ముందే, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. విస్ఫోటనం జరగడానికి కేవలం ఒక రోజు ముందు, నిర్బంధిత ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు ప్రెస్ వాళ్లకు చెప్పారు. అయినా, దుర్ఘటన జరిగిన ఆ మధ్యాహ్నం వేళ 43 మంది ప్రమాద ప్రాంతంలో ఉన్నారు.
ఎందుకు అంతమంది ఆ ప్రాంతంలోకి వెళ్లారు లేక అక్కడే ఉండిపోయారు? తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయిన కొంతమంది రైతులు తమ పొలాలను, ఇతర ఆస్తులను చూసుకోవడానికి అక్కడికి తిరిగి వెళ్లారు. అగ్ని పర్వత నిపుణులు ముగ్గురు తమ విద్యా సంబంధిత జిజ్ఞాసను తీర్చుకోవడానికి అగ్ని పర్వతానికి వీలైనంత దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నించారు. చాలామంది రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు అగ్ని పర్వత చర్యలకు సంబంధించి వేడివేడి వార్తల్ని సేకరించాలన్న ఉద్దేశంతో ప్రమాద ప్రాంతంలోకి వెళ్లారు. ప్రెస్ వాళ్లు పిలిపించుకున్న ముగ్గురు టాక్సీ డ్రైవర్లు కూడా అక్కడే ఉన్నారు. పోలీసులు, అగ్నిమాపక దళానికి చెందిన స్వచ్ఛంద సేవకులు విధి నిర్వహణలో ఉన్నారు. నిజమే, ప్రమాద ప్రాంతంలోకి వెళ్లడానికి ప్రతి ఒక్కరికీ తమవైన కారణాలున్నాయి, అయితే ఫలితం మాత్రం వాళ్లు తమ ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది.
మీరు ప్రమాద ప్రాంతంలో ఉన్నారా?
మనమందరం అగ్నిపర్వతం దరిదాపుల్లో నివసించకపోవచ్చు. అయినప్పటికీ, మనం ఒక భూగోళవ్యాప్త ఉపద్రవాన్ని ఎదుర్కోబోతున్నట్లైతే అప్పుడేమిటి? ప్రవచనాత్మక సమాచారానికి నమ్మదగిన మూలంగా నిరూపించబడిన ఒక పుస్తకం, రానున్న ప్రపంచవ్యాప్త వినాశనాన్ని గురించి మనల్ని హెచ్చరిస్తూ, దాన్నిలా వర్ణిస్తుంది: “చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. మత్తయి 24:29, 30) ఇక్కడ విశ్వవ్యాప్తంగా జరిగే ఖగోళ సంబంధిత అసాధారణ సంఘటన “భూమి మీదనున్న సకల గోత్రముల” వారిని ప్రభావితం చేస్తున్నట్లు వర్ణించబడింది. వేరే మాటల్లో చెప్పాలంటే, మనలో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే విపత్తు గురించి ఈ ప్రవచనం తెలియజేస్తుంది.
. . . భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.” (నమ్మదగిన ప్రవచనాలున్న ఈ పుస్తకం బైబిలు. ఆసక్తికరంగా, పైన ప్రస్తావించబడిన లేఖన భాగపు సందర్భం, ఆ భూగోళవ్యాప్త విపత్తుకు దారితీసే సంగతులను గురించిన సవివరమైన వర్ణనను ఇస్తుంది. లావా గుమ్మటం, ఇతర అగ్నిపర్వత సూచనలు, షీమాబారా నగర అధికారులు ప్రమాద ప్రాంతాన్ని నిర్ణయించడానికి కారణాలను ఇచ్చినట్లుగానే, మనం అప్రమత్తంగా ఉండడానికీ, తప్పించుకుని జీవించేలా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవడానికీ బైబిలు మనకు కారణాలను ఇస్తుంది. ఫూజెన్ పర్వతం వద్ద జరిగిన దుర్ఘటన నుండి మనం ఒక పాఠం నేర్చుకుని, రానున్నదాని తీవ్రతను గ్రహించవచ్చు.
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
COVER: Yomiuri/Orion Press/Sipa Press
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Yomiuri/Orion Press/Sipa Press