కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు భవిష్యత్తును తెలుసుకోగలరు!

మీరు భవిష్యత్తును తెలుసుకోగలరు!

మీరు భవిష్యత్తును తెలుసుకోగలరు!

భవిష్యత్తు గురించి దాదాపు అందరూ గంభీరంగా ఆలోచిస్తారు. ముందుగా పథకం వేసుకోవాలనీ, వివేకంతో పెట్టుబడి పెట్టాలనీ, భద్రతా భావాన్ని పొందాలనీ ఇష్టపడతారు. కానీ రేపటి విషయంలో హామీ కలిగి ఉండేందుకు ఏమైన మార్గం ఉందా?

అలాంటి ఒక మార్గాన్ని కనుగొనేందుకు మానవులు అనేక రకాల ప్రయోగాలను చేశారు. భవిష్యత్తు శాస్త్రజ్ఞులని పిలువబడే సాంఘిక శాస్త్రజ్ఞులు ప్రస్తుత ధోరణులను విశ్లేషించి వాటి ఆధారంగా భవిష్యత్తు గురించి చెబుతున్నారు. అర్థశాస్త్రజ్ఞులు కూడా తమ రంగంలో అదే పని చేస్తున్నారు. ఖగోళశాస్త్రజ్ఞులూ జోస్యం చెప్పేవాళ్ళూ గ్రహాలనూ, స్ఫటికగోళాలనూ, అతీంద్రియ శక్తులనూ ఉపయోగించి భవిష్యత్తు గురించి చెబుతారు. వాళ్ళకు చాలామంది అనుచరులు కూడా ఉన్నారు. ఉదాహరణకు, ఫ్రాన్స్‌కు చెందిన ఖగోళశాస్త్రవేత్తయైన నోస్ట్రాడమస్‌ సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తైనప్పటికీ, ఆయనకు ఇప్పటికీ జనాదరణ ఉంది.

ప్రవక్తలమని చెప్పుకునే వీరందరూ కూడా నమ్మదగినవారుకాదనీ, భవిష్యత్తు విషయమై నిరుత్సాహపరచేవారనీ రూఢి అయ్యింది. ఎందుకని? ఎందుకంటే, వాళ్ళు యెహోవా దేవుడ్నీ, ఆయన వాక్యమైన బైబిలునీ అలక్ష్యం చేస్తారు. ఈ కారణం వల్లే, వారు, ‘భవిష్యత్తు గురించి బైబిలులో ముందుగా చెప్పబడిన విషయాలు జరుగుతాయని నేనెందుకు నిశ్చయం కలిగి ఉండగలను? అవి మానవుని గురించిన దేవుని ఉద్దేశానికి ఎలా అనుగుణ్యంగా ఉన్నాయి? నేనూ నా కుటుంబమూ ఈ ప్రవచనాల నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?’ వంటి ప్రాథమిక ప్రశ్నలకు జవాబివ్వలేకపోతున్నారు. ఈ ప్రశ్నలకు బైబిలు జవాబిస్తుంది.

బైబిలు ప్రవచనం మరనేక విధాల్లో కూడా అత్యున్నతమైనదిగా ఉంది. ఖగోళశాస్త్ర ప్రవచనాల్లా కాక, అది వ్యక్తిగత ఎంపికకు తావిస్తుంది. కనుక, విధి బాధితులంటూ ఎవరూ ఉండరు. (ద్వితీయోపదేశకాండము 30:19) నోస్ట్రాడమస్‌లాంటి వాళ్ళ రచనలు నీతి లేనివి, వాటిలోని ఆ శూన్యతను భర్తీ చేసేందుకు వాళ్లు అస్పష్టతనూ, భావోద్వేగజనకమైన విషయాలను ఉపయోగిస్తారు. కానీ బైబిలు ప్రవచనానికి సుస్థిరమైన నీతి అనే పునాది ఉంది. దేవుడు తాను ఉద్దేశించినట్లుగానే ఎందుకు చేయబోతున్నాడు అన్నది అది వివరిస్తుంది. (2 దినవృత్తాంతములు 36:15) యెహోవా ప్రవచనాలు ఎన్నడూ విఫలం కావు, ఎందుకంటే ‘దేవుడు అబద్ధమాడనేరడు.’ (తీతు 1:4) కనుక, దేవుని వాక్యం చేత నడిపించబడే వ్యక్తులు జ్ఞానోదయాన్ని పొందుతారు, వారి జీవితానికి ఉద్దేశముంటుంది, వారు తమ విలువైన సమయాన్నీ, వనరులనూ వ్యర్థ అన్వేషణలపై వెచ్చించరు, సంతోషకరమైన జీవితాలను గడుపుతారు.—కీర్తన 25:12, 13.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన, 1999/2000 “దేవుని ప్రవచన వాక్యము” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశంలో, ఈ విషయాలూ, మరనేక అంశాలూ చర్చించబడ్డాయి. అక్కడ ప్రసంగాలూ, ఇంటర్వ్యూలూ, ప్రదర్శనలూ, ఒక బైబిలు నాటకమూ నిర్వహించబడ్డాయి. అవి, దేవుని ప్రవచన వాక్యాన్ని అధ్యయనం చేసి తమ జీవితాల్లో అన్వర్తింపజేసుకునేవారు అనుభవించే అద్భుతమైన ఆధ్యాత్మిక వారసత్వం వైపుకు ప్రేక్షకుల అవధానాన్ని మళ్ళించాయి. తర్వాతి శీర్షిక సమావేశంలోని కొన్ని ఉత్తేజకరమైన ఉన్నతాంశాలను పునఃసమీక్షిస్తుంది.