పరిపాలక సభలో క్రొత్త సభ్యులు
పరిపాలక సభలో క్రొత్త సభ్యులు
వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా యొక్క వార్షిక కూటము 1999, అక్టోబరు 2, శనివారం రోజున జరిగింది. అది ఆశ్చర్యానందాల్ని రేకెత్తించిన ఒక ప్రకటనతో ముగిసింది. దానికి హాజరైన, అలాగే టెలిఫోను ద్వారా లింకు చేయబడి ఉన్న 10,594 మంది, యెహోవాసాక్షుల పరిపాలక సభకు నలుగురు క్రొత్త సభ్యులు చేర్చబడ్డారన్న వార్త విని పులకరించిపోయారు. నలుగురూ అభిషిక్త క్రైస్తవులే, ఆ సభ్యుల పేర్లు సామ్యుల్ ఎఫ్. హెర్డ్; ఎమ్. స్టీవెన్ లెట్; గయ్ హెచ్. పీయర్స్; డేవిడ్ హెచ్. స్ప్లేన్.
• సామ్యుల్ హెర్డ్ 1958 లో పయినీరింగ్ ప్రారంభించారు, 1965 నుండి 1997 వరకు సర్క్యూట్ మరియు డిస్ట్రిక్ట్ పనిలో ఉన్నారు. అటుతర్వాత ఆయనా ఆయన భార్య గ్లోరియా అమెరికా బేతేలు కుటుంబంలో సభ్యులుగా చేరారు, బ్రదర్ హెర్డ్ సర్వీస్ డిపార్ట్మెంట్లో సేవచేస్తున్నారు. ఆయన సర్వీస్ కమిటీకి కూడా సహాయకుడుగా ఉన్నారు.
• స్టీవెన్ లెట్, 1966 డిసెంబరులో పయినీరింగ్ ప్రారంభించారు, 1967 నుండి 1971 వరకు ఆయన అమెరికా బేతేలులో సేవచేశారు. తర్వాత 1971 అక్టోబరులో ఆయన సూజన్‌ను వివాహం చేసుకుని స్పెషల్ పయినీర్ సేవలోనికి ప్రవేశించారు. ఆయన 1979 నుండి 1998 వరకు సర్క్యూట్ పైవిచారణకర్తగా సేవచేశారు. ఆయనా, సూజన్ కలిసి 1998 ఏప్రిల్ నుండి అమెరికా బేతేలు కుటుంబ సభ్యులయ్యారు. అక్కడాయన సర్వీస్ డిపార్ట్మెంట్లో సేవ చేసి, టీచింగ్ కమిటీకి సహాయకునిగా కూడా ఉన్నారు.
• గయ్ పీయర్స్ ఒక కుటుంబాన్ని పెంచి పోషించి సతీసమేతంగా 1982 ఏప్రిల్‌లో పయినీరింగ్ ప్రారంభించారు. ఆయన 1986 నుండి 1997 వరకు సర్క్యూట్ పైవిచారణకర్తగా సేవచేసి, ఆయనా ఆయన భార్య పెన్నీ అదే సంవత్సరంలో బ్రూక్లిన్ బేతేలు కుటుంబ సభ్యులుగా చేరారు. బ్రదర్ పీయర్స్ పర్సనల్ కమిటీకి సహాయకునిగా సేవచేస్తున్నారు.
• డేవిడ్ స్ప్లేన్ 1963 సెప్టెంబరులో పయినీరింగ్ ప్రారంభించారు. గిలియడ్ స్కూలులో 1942 లో పట్టభద్రుడై ఆఫ్రికాలోని సెనెగల్‌లో మిషనరీగా సేవచేసి, తర్వాత 19 ఏండ్లపాటు కెనడాలో సర్క్యూట్ పనిలో ఉన్నారు. ఆయనా ఆయన భార్య లిండా 1990 నుండి అమెరికా బేతేలులో సభ్యులుగా ఉన్నారు. అక్కడాయన సర్వీస్ డిపార్ట్మెంట్, రైటింగ్ డిపార్ట్మెంట్లలో పనిచేశారు. 1998 నుండి ఆయన రైటింగ్ కమిటీకి సహాయకునిగా ఉన్నారు.
ఈ నలుగురు క్రొత్త సభ్యులకు తోడు ఇప్పుడు పరిపాలక సభలో సి. డబ్ల్యు. బార్బర్, జె. ఇ. బార్, ఎమ్. జి. హెన్షెల్, జి. లూష్, టి. జారజ్, కె. ఎఫ్. క్లైన్, ఎ. డి. ష్రోడర్, ఎల్. ఎ. స్వింగిల్, డి. సిడ్లిక్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజల కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తూ, వారి ఆధ్యాత్మిక విషయాలపట్ల శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగుతున్న, ఇప్పుడు అదనపు సభ్యులు చేర్చబడిన పరిపాలక సభను యెహోవా ఆశీర్వదిస్తూనే ఉండాలని ప్రతి ఒక్కరి ప్రార్థన.