వారు నిజంగా అంతకాలం జీవించారా?
వారు నిజంగా అంతకాలం జీవించారా?
బైబిలు ప్రకారం, ఆదాము 930 సంవత్సరాలు, షేతు 912 సంవత్సరాలు జీవించారు. మెతూషెల 969 సంవత్సరాలు జీవించాడు, ఆయన మరో 31 సంవత్సరాలు జీవించివుంటే వెయ్యి వసంతాలు పూర్తిచేసుకునేవాడే! (ఆదికాండము 5:5, 8, 27) ఒక ఏడాదిలో మనకున్నన్ని రోజులే వారికి కూడా ఉండేవా లేదా కొందరు భావిస్తున్నట్లుగా ఒక ఏడాదిలో తక్కువ రోజులు, బహుశా మన నెలలతో సమానంగా ఉండే సంవత్సరాలు ఉండేవా?
వారికి మనలాంటి అక్షరార్థ సంవత్సరాలే ఉండేవని బైబిల్లోని అంతర్గత రుజువు సూచిస్తోంది. దీనిని పరిశీలించండి: ప్రాచీనకాలపు సంవత్సరం మన నెలతో సమానమైతే ఈ క్రింది వ్యక్తులు అతిచిన్న ప్రాయంలోనే తండ్రులై ఉండేవారు, అది సాధ్యంకాని విషయం. కేయినాను ఆరేళ్లు నిండకముందు, మహలలేలు, హనోకు ఐదేళ్లు నిండిన తర్వాత తండ్రులై ఉండేవారు.—ఆదికాండము 5:12, 15, 21.
అంతేకాక, ఆ ప్రాచీనకాల ప్రజలు రోజులు, నెలలు, సంవత్సరాల మధ్యవున్న భేదాలను గుర్తించారు. (ఆదికాండము 1:14-16; 8:13) వాస్తవానికి, నోవహు సమకూర్చిన పూర్తి వివరాలతో కూడిన కాలవృత్తాంతం ఒక నెలలో ఎన్ని రోజులు ఉండేవో తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఆదికాండము 7:11, 24 వచనాలను ఆదికాండము 8:3, 4 వచనాలతో పోలిస్తే, రెండవ నెల పదిహేడవ రోజు నుండి ఏడవనెల పదిహేడవ రోజు వరకున్న ఐదు నెలలు 150 రోజులతో సమానమని చూపిస్తుంది. దీనినిబట్టి నోవహు 30 రోజులను ఒక నెలగా, 12 నెలలను ఒక సంవత్సరంగా లెక్కించాడని స్పష్టమౌతోంది.—ఆదికాండము 8:5-13. *
అయితే ప్రజలు 900 లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు ఎలా జీవించగలిగారు? మానవులు నిరంతరం జీవించేలా యెహోవా వారిని సృష్టించాడని, ఆదాము పాపం మానవ కుటుంబానికి అపరిపూర్ణతను, మరణాన్ని కొనితెచ్చిందని బైబిలు మనకు తెలియజేస్తోంది. (ఆదికాండము 2:17; 3:17-19; రోమీయులు 5:12) జలప్రళయం ముందు జీవించినవారు పరిపూర్ణతకు మనకన్నా మరింత దగ్గరగా ఉన్నారు, వారి ధీర్ఘాయుష్షుకు అది ఖచ్చితంగా ఒక ప్రధాన కారణం. ఉదాహరణకు, మెతూషెల, ఆదాము నుండి కేవలం ఏడవ తరానికి చెందినవాడు.—లూకా 3:37, 38.
అయితే, త్వరలో యెహోవా దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు చిందించిన రక్తంపట్ల విశ్వాసం కనబరిచే వారందరిలోనుండి ఆదాము పాపానికి సంబంధించిన జాడలన్నిటినీ తొలగిస్తాడు. “పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.” (రోమీయులు 6:23) అవును, మెతూషెల జీవించిన 969 సంవత్సరాలు చాలా తక్కువని అనిపించే కాలం రానుంది! (g 7/07)
[అధస్సూచి]
^ యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం), 2వ సంపుటిలో 1214వ పేజీ చూడండి.
[21వ పేజీలోని గ్రాఫు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
1000
మెతూషెల
ఆదాము
షేతు
900
800
700
600
500
400
300
200
100
నేడు సగటు మానవుడు