కావలికోట నం. 2 2020 | దేవుని రాజ్యం అంటే ఏంటి?
దశాబ్దాలుగా ప్రజలు ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. దానికి జవాబు బైబిల్లో తేలిగ్గా దొరుకుతుంది.
“నీ రాజ్యము వచ్చుగాక”—లక్షలమంది ప్రజలు చేసే ప్రార్థన
ఈ ప్రార్థనను అర్థం చేసుకోవడానికి, దేవుని రాజ్యం గురించి ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది?
దేవుని రాజ్యం మనకు ఎందుకు అవసరం?
అపరిపూర్ణ మనుషులు తమను తాము పరిపాలించుకుంటే సమస్యలు తప్పకుండా వస్తాయి.
దేవుని రాజ్యానికి రాజు ఎవరు?
దేవుని రాజ్యానికి రాజయ్యే వ్యక్తి ఎలా ఉంటాడో గుర్తించే వివరాల్ని వేర్వేరు బైబిలు రచయితలు రాసి పెట్టారు. మానవ చరిత్రంతటిలో ఒకే ఒక వ్యక్తి వాటికి సరిగ్గా సరిపోతాడు.
దేవుని రాజ్యం భూమ్మీద ఎప్పుడు పరిపాలిస్తుంది?
యేసు నమ్మకమైన అనుచరుల్లో కొంతమంది కూడా ఆ విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారు. వాళ్ల ప్రశ్నకు యేసు ఎలా జవాబిచ్చాడు?
దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?
భూమ్మీదున్న సమస్యల్ని కేవలం దేవుని రాజ్యం మాత్రమే తీసేస్తుందని యేసుకు తెలుసు. మన నమ్మకాన్ని బలపర్చడానికి దేవుని రాజ్యం ఇప్పటికే ఏమి చేసింది?
దేవుని రాజ్యానికి మద్దతివ్వాలని ఇప్పుడే నిర్ణయించుకోండి!
రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వమని యేసు తన అనుచరుల్ని ప్రోత్సహించాడు. మీరు దాన్నెలా చేయవచ్చు?
దేవుని రాజ్యం అంటే ఏంటి?
దేవుని రాజ్యం రావాలని చాలామంది ప్రార్థిస్తారు. కానీ మీరెప్పుడైనా దేవుని రాజ్యం అంటే ఏంటో, అదేం చేస్తుందో అని ఆలోచించారా?