యెహోవాసాక్షుల పరిపాలక సభ అంటే ఏంటి?
పరిపాలక సభ పరిణతిగల క్రైస్తవులతో కూడిన ఒక చిన్న గుంపు. వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులకు నిర్దేశాన్ని ఇస్తారు. వాళ్లు రెండు విధాలుగా పనిచేస్తారు.
యెహోవాసాక్షులకు ప్రచురణలు, కూటాలు, పాఠశాలల రూపంలో బైబిలు ఉపదేశాన్ని తయారుచేసే పనిని పరిపాలక సభ సభ్యులు చూసుకుంటారు.—లూకా 12:42.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యెహోవాసాక్షుల పని అంతటిని చూసుకుంటారు. దానిలో భాగంగా ప్రకటనా పనిని నిర్దేశించడం, విరాళంగా వచ్చిన డబ్బునూ వస్తువుల్నీ ఉపయోగించడం వంటివి వాళ్లు చేస్తారు.
మొదటి శతాబ్దంలో యెరూషలేములో ఉన్న అపొస్తలులు, పెద్దలు క్రైస్తవ సంఘమంతటి తరఫున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవాళ్లు. వాళ్లు పాటించిన పద్ధతినే పరిపాలక సభ సభ్యులు కూడా ఇప్పుడు పాటిస్తున్నారు. (అపొస్తలుల కార్యాలు 15:2) అప్పుడున్న నమ్మకమైన అపొస్తలులు, పెద్దలులాగే ఇప్పుడున్న పరిపాలక సభ సభ్యులు కూడా మా సంస్థకు నాయకులు కాదు. యెహోవా దేవుడు యేసుక్రీస్తును సంఘానికి నాయకునిగా నియమించాడని గుర్తిస్తూ వాళ్లు బైబిలు ఇస్తున్న నిర్దేశాన్ని పాటిస్తారు.—1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 5:23.
పరిపాలక సభలో ఎవరెవరు ఉన్నారు?
పరిపాలక సభలో ఎవరెవరు ఉన్నారంటే: జూ. కెన్నెత్ కుక్, గేజ్ ఫ్లీగల్, సామ్యూల్ హెర్డ్, జెఫ్రీ జాక్సన్, జోడి జేడ్లి, స్టీఫెన్ లెట్, గెరిట్ లోష్, జేకబ్ రంఫ్, మార్క్ సాండర్సన్, డేవిడ్ స్ప్లేన్, జెఫ్రీ విండర్. వీళ్లు అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న వార్విక్లో మా ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేస్తారు.
పరిపాలక సభ ఒక పద్ధతి ప్రకారం ఎలా పనిచేస్తుంది?
వేర్వేరు పనులను పర్యవేక్షించడానికి పరిపాలక సభ ఆరు కమిటీలను ఏర్పాటు చేసింది. పరిపాలక సభలోని ప్రతీ ఒక్కరు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కమిటీల్లో పనిచేస్తారు.
కో-ఆర్డినేటర్స్ కమిటీ: న్యాయపరమైన విషయాలను చూసుకుంటుంది, విపత్తులు వచ్చినప్పుడు, తమ మత నమ్మకాల కారణంగా సాక్షులు హింసను ఎదుర్కొన్నప్పుడు అలాగే యెహోవాసాక్షులకు సంబంధించిన ఇతర ముఖ్యమైన విషయాల్లో కూడా సహాయం చేస్తుంది.
పర్సోనెల్ కమిటీ: బెతెల్ కుటుంబసభ్యులకు కావాల్సిన ఏర్పాట్లను చూసుకుంటుంది.
పబ్లిషింగ్ కమిటీ: బైబిలు ఆధారిత పుస్తకాలను తయారుచేసే పనిని, వాటిని వేర్వేరు దేశాలకు పంపించే పనిని, ఆరాధనా స్థలాలనూ అనువాద కార్యాలయాలనూ బ్రాంచి కార్యాలయాలనూ కట్టే పనిని చూసుకుంటుంది.
సర్వీస్ కమిటీ: దేవుని ‘రాజ్య సువార్తను’ ప్రకటించే పనిని చూసుకుంటుంది.—మత్తయి 24:14.
టీచింగ్ కమిటీ: కూటాలు, పాఠశాలలు, ఆడియో-వీడియో కార్యక్రమాల రూపంలో ఆధ్యాత్మిక ఆహారాన్ని తయారుచేసే పనిని చూసుకుంటుంది.
రైటింగ్ కమిటీ: ముద్రిత రూపంలో అలాగే వెబ్సైట్ ద్వారా అందజేసే ఉపదేశాన్ని తయారుచేసే పనిని నిర్దేశిస్తుంది, అనువాద పనిని కూడా చూసుకుంటుంది.
ఈ కమిటీల్లో పనిచేయడంతోపాటు, సంస్థకున్న అవసరాల గురించి మాట్లాడుకోవడానికి పరిపాలక సభలోని సహోదరులందరూ ప్రతీవారం ఒక రోజు కలుసుకుని ఓ కూటం జరుపుకుంటారు. ఇలా కలుసుకున్నప్పుడు, లేఖనాలు చెప్తున్న విషయాలను చర్చించుకుంటారు అలాగే పవిత్రశక్తి నడిపింపు కోసం చూస్తూ అందరూ ఒకే అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడానికి కృషిచేస్తారు.—అపొస్తలుల కార్యాలు 15:25.
పరిపాలక సభ సభ్యులకు సహాయకులు ఎవరు?
నమ్మకస్థులైన క్రైస్తవులు పరిపాలక సభ కమిటీలకు సహాయం చేస్తారు. (1 కొరింథీయులు 4:2) వాళ్లను ఏ కమిటీకైతే నియమిస్తారో ఆ కమిటీలో జరిగే పనిని చేయగల సామర్థ్యం, అనుభవం వాళ్లకు ఉంటుంది. ఆ కమిటీలోని వాళ్లు ప్రతీవారం జరుపుకునే కూటానికి వాళ్లు కూడా వెళ్తారు. వాళ్లు నిర్ణయాలు తీసుకోకపోయినా, పరిపాలక సభ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వాళ్లకు ఉపయోగపడే సలహాలు, కావాల్సిన సమాచారాన్ని ఇస్తారు, తీసుకున్న నిర్ణయాలను పాటిస్తారు, అలా చేయడంవల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో కూడా గమనిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో ఉంటున్న మన సహోదరసహోదరీలను వెళ్లి కలవడం, వార్షిక కూటాలు లేదా గిలియడ్ గ్రాడ్యుయేషన్ వంటి కార్యక్రమాల్లో ప్రసంగాలు ఇవ్వడం వంటి నియామకాలు పరిపాలక సభ వాళ్లకు అప్పగిస్తుంది.
కమిటీ |
పేరు |
---|---|
కో-ఆర్డినేటర్స్ |
|
పర్సోనెల్ |
|
పబ్లిషింగ్ |
|
సర్వీస్ |
|
టీచింగ్ |
|
రైటింగ్ |
|