ఫిలిప్పీన్స్ 2వ ఫోటో గ్యాలరీ (జూన్ 2015 నుండి జూన్ 2016 వరకు)
ఫిలిప్పీన్స్‌లోని యెహోవాసాక్షులు క్వెజాన్ సిటీలో ఉన్న తమ బ్రాంచి కార్యాలయ భవనాల్ని పునరుద్ధరించే భారీ పనిని పూర్తిచేశారు. జూన్ 2015 నుండి జూన్ 2016 మధ్యకాలంలో ఆ పని ఎలా జరిగిందో, స్వచ్ఛంద సేవకులు దానికి ఎలా మద్దతిచ్చారో ఈ ఫోటో గ్యాలరీలో చూడండి. కొన్ని నెలల తర్వాత, ఆ భవనాలు ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 2017 ఫిబ్రవరిలో అవి సమర్పించబడ్డాయి.
జూన్ 15, 2015—క్వెజాన్ సిటీలోని స్థలం
1వ, 5వ, 7వ భవనాల్ని కలిపే ఒక నడిచే దారిని వేయడానికి కాంక్రీట్ టీం వాళ్లు ఫ్రేములు బిగిస్తున్నారు.
జూన్ 15, 2015—5వ భవనం
ఒక ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు కార్పెంటర్‌లు రీజనల్ డిజైన్/నిర్మాణ విభాగం (RDC)–ఆసియా/పసిఫిక్ రూపొందించిన నమూనా చిత్రాల్ని గమనిస్తున్నారు. 2016 మార్చిలో ఆ విభాగం ఆస్ట్రేలియా నుండి ఫిలిప్పీన్స్ బ్రాంచి కార్యాలయానికి మారింది.
జూన్ 23, 2015—క్వెజాన్ సిటీలోని స్థలం
కందకాలు చేయడానికి, వాహనాలు వెళ్లే కాంక్రీట్ రోడ్డును తీసేస్తున్నారు. వాటిలో, సెంట్రలైజ్డ్ ఎ.సి. సిస్టమ్‌కి సంబంధించిన కొత్త చిల్డ్-వాటర్ పైపులు ఉంచుతారు.
జూలై 20, 2015—క్వెజాన్ సిటీలోని స్థలం
ఒక నడిచే దారి పక్కన ఉండే రెయిలింగ్‌లను వెల్డింగ్ చేయడానికి అమెరికాకు చెందిన ఒక జంట సిద్ధమౌతున్నారు.
జూలై 20, 2015—క్వెజాన్ సిటీలోని స్థలం
4వ, 5వ భవనాల మధ్య చిల్డ్-వాటర్ పైపులు ఉంచుతున్నారు.
సెప్టెంబరు 18, 2015—5వ భవనం
ఒక కార్పెంటర్ తన పనిముట్టుతో కిటికీ గడప అమర్చుతున్నాడు.
సెప్టెంబరు 18, 2015—5వ భవనం
కార్పెట్లు వేసే వ్యక్తి కార్పెట్ ముక్కల్ని పరుస్తున్నాడు. 5వ భవనంలోని రెండో ఫ్లోర్ అంతా అలా పరిచారు. అక్కడ ఆడియో/వీడియో విభాగం పనిచేస్తుంది. అలా పరచడం వల్ల శబ్దాలు తగ్గుతాయి.
అక్టోబరు 22, 2015—5వ భవనం
పెయింటర్లు ఆఫీసు భవనాలకు కూల్ పెయింట్ వేస్తున్నారు. అది సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ తగ్గించి, భవనం లోపల మరింత చల్లగా ఉండేలా చేస్తుంది. దానివల్ల ఖర్చులు కాస్త తగ్గుతాయి.
ఫిబ్రవరి 10, 2016—4వ భవనం
చుట్టుగోడ కట్టడానికి ఉపయోగించిన ఫ్రేమును తీసేస్తున్నారు. రెండు అంతస్తుల ఎత్తు ఉండే 4వ భవనంలో రకరకాల బైబిలు విద్యా పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు ఉంటారు.
ఫిబ్రవరి 10, 2016—4వ భవనం
హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్-కండీషనింగ్ టీంకి చెందిన ఒకరు చిల్డ్-వాటర్ పైపులకు ఇన్సులేషన్ పెడుతున్నారు. దానివల్ల అవి ఇంకా చక్కగా పనిచేస్తాయి, ఘనీభవించే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఫిబ్రవరి 16, 2016—4వ భవనం
ఆస్ట్రేలియాకి చెందిన ఒక సాంకేతిక నిపుణుడు కరెంట్ బోర్డులోని సర్క్యూట్ బ్రేకర్‌లను టెస్ట్ చేస్తున్నాడు. ఈ పునరుద్ధరణ ప్రాజెక్టులో పనిచేయడానికి, ఇతర దేశాలకు చెందిన 100 కన్నా ఎక్కువమంది నిపుణుల్ని ఆహ్వానించారు.