దేవునిలో ముగ్గురు ఉన్నారా?
బైబిలు ఇచ్చే జవాబు
చాలా క్రైస్తవ మతశాఖలు దేవునిలో ముగ్గురు ఉన్నారనే త్రిత్వ సిద్ధాంతాన్ని బోధిస్తాయి. ‘కొత్త నిబంధనలో త్రిత్వం అనే పదం గానీ, ఆ సిద్ధాంతం గురించిన వివరణ గానీ కనిపించదు ... ఎన్నో శతాబ్దాల కాలంలో, ఎన్నో వివాదాల నడుమ ఈ సిద్ధాంతం రూపుదిద్దుకుంది’ అని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది.
నిజానికి, దేవుడు త్రిత్వంలో భాగంగా ఉన్నట్టు బైబిల్లో ఎక్కడా లేదు. ఈ వచనాలు చూడండి:
“మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.”—ద్వితీయోపదేశకాండము 6:4.
“యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.”—కీర్తన 83:18.
“అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.
“దేవుడు ఒక్కడే.”—గలతీయులు 3:20.
చాలా క్రైస్తవ మతశాఖలు దేవుడు త్రిత్వం అని ఎందుకు బోధిస్తున్నాయి?