కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 48

ప్రతీరోజు యెహోవాతో నడుద్దాం

ప్రతీరోజు యెహోవాతో నడుద్దాం

(మీకా 6:8)

  1. 1. యెహోవాతో ప్రతీదినం

    వినయంగా నడుస్తుందాము.

    సన్మార్గము చూపేందుకు

    ఇస్తాడాయన చేయూతను.

    సత్యమార్గం వెదికితే,

    చూపిస్తాడెంతో దయ.

    సమర్పించుకుని మనం

    ఉందాం దేవుని పక్షాన.

  2. 2. ఎంతో కోపంగా ఉన్నాడు

    మన విరోధైన సాతాను.

    అంతం చేరువౌతుండగా

    భీతిగొల్పే స్థితులుంటాయి.

    ఐనా దైవ సంరక్షణ

    మనపైన ఉంటుంది.

    యెహోవాకు దగ్గరౌతూ

    నిత్యం సేవిద్దామాయన్ని.

  3. 3. వాక్యం ద్వారా, శక్తి ద్వారా

    మనలను నడిపిస్తాడు.

    ప్రార్థనలు ఆలకిస్తూ,

    సంఘం ద్వారా ఆదరిస్తాడు.

    నీతిమార్గం చూపిస్తాడు

    ఆయనతో నడిస్తే.

    అణకువతో జీవిస్తే,

    నిత్యం నమ్మకంగా ఉంటాం.

(ఆది. 5:24; 6:9; 1 రాజు. 2:3, 4 కూడా చూడండి.)