కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

యోసేపులా లైంగిక పాపానికి దూరంగా పారిపోండి

యోసేపులా లైంగిక పాపానికి దూరంగా పారిపోండి

లైంగిక పాపం చేయాలనే ప్రలోభం మనకు ఎదురైతే, యోసేపు ఉంచిన మంచి ఆదర్శాన్ని పాటించవచ్చు. తన యజమాని భార్య ప్రలోభపెట్టిన ప్రతీసారి యోసేపు దాన్ని తిరస్కరిస్తూ వచ్చాడు. (ఆది 39:7-10) “నేను ఇంత చెడ్డపని చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను?” అని అతను అన్నాడు. ఆ మాటల్ని బట్టి, భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండడాన్ని యెహోవా ఎంత ప్రాముఖ్యంగా ఎంచుతాడో యోసేపు ముందే ఆలోచించాడని అర్థమౌతుంది. పరిస్థితి విషమించినప్పుడు అతను అక్కడినుండి పారిపోయాడు. ఒకవేళ అక్కడే ఉంటే, సరైనది చేయాలనే అతని నిశ్చయాన్ని ఆమె నీరుగార్చే అవకాశం ఉంది.—ఆది 39:12; 1కొ 6:18.

లైంగిక పాపానికి దూరంగా పారిపోండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • జిన్‌కి ఎలాంటి పరిస్థితి ఎదురైంది?

  • మ్యాథ్స్‌ హోమ్‌వర్క్‌లో సహాయం చేయమని మీక్యంగ్‌ అడిగినప్పుడు జిన్‌ ఏ తెలివైన ప్రశ్న గురించి ఆలోచించాడు?

  • మీక్యంగ్‌ అడిగినదానికి జిన్‌ ఎలా భావించాడు?

  • జిన్‌ ఎలా సహాయం పొందాడు?

  • జిన్‌ ఎలా లైంగిక పాపానికి దూరంగా పారిపోయాడు?

  • ఈ వీడియో నుండి మీరు ఏ పాఠాలు నేర్చుకున్నారు?