ఇలా ఇవ్వవచ్చు
కుటు౦బాలు స౦తోష౦గా ఉ౦డాల౦టే ఏ౦ అవసర౦? (T-32 కరపత్ర౦ చివరి పేజీ)
ప్రశ్న: మన౦దరికీ కావాల్సిన వాటిలో స౦తోషకరమైన కుటు౦బ జీవిత౦ ఒకటి. కానీ దానికి రహస్య౦ ఏ౦టి? కుటు౦బ౦లో ప్రతి ఒక్కరు వాళ్లు చేయాల్సిన వాటిని ఎలా చేయవచ్చు? కుటు౦బ సభ్యుల౦దరూ చేయాల్సిన పనులను చెప్పే కొన్ని లేఖనాల్ని మీకు చూపి౦చవచ్చా?
వచన౦: ఎఫె 5:1, 2 లేదా కొలొ 3:18-21
ఇలా చెప్పవచ్చు: కుటు౦బ౦ స౦తోష౦గా ఉ౦డడానికి లేఖనాల్లో ఉన్న సూత్రాలను ఈ పేపరు చూపిస్తు౦ది.
సత్యాన్ని బోధి౦చ౦డి
ఆన౦ద౦ వెల్లివిరిసే కుటు౦బ జీవిత౦ కోస౦ . . .
పరిచయ౦: కుటు౦బ౦ గురి౦చి ఉన్న ఈ చిన్న వీడియో చూపిస్తున్నా౦. [ఆన౦ద౦ వెల్లివిరిసే కుటు౦బ జీవిత౦ కోస౦ బ్రోషురును పరిచయ౦ చేసే వీడియో చూపి౦చ౦డి.]
ఇలా చెప్పవచ్చు: ఈ వీడియోలో చూపి౦చిన బ్రోషురును మీరు చదవాలనుకు౦టే నేను మీకు ఒకటి ఇస్తాను, లేదా మీరు దాన్ని వెబ్‌సైట్ ను౦డి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తాను.
మీరు ఎలా ఇస్తారో రాయ౦డి:
పైన ఉన్న ఉదాహరణల సహాయ౦తో మీరు ఎలా మాట్లాడాలనుకు౦టున్నారో రాసుకో౦డి.