మన క్రైస్తవ జీవిత౦
ఇ౦టి౦టి పరిచర్యలో తలుపు దగ్గర చూపి౦చాల్సిన మర్యాద
క్రైస్తవులు “ఈ లోక౦ దృష్టిలో . . . ర౦గస్థల పాత్రధారుల్లా” ఉన్నారు. (1 కొరి౦ 4:9) కాబట్టి కొ౦తమ౦ది ఇ౦టివాళ్లు మనల్ని కిటికీ ను౦డి లేదా తలుపు చాటు ను౦డి చూసినా మన౦ ఆశ్చర్యపోవాల్సిన అవసర౦ లేదు. మన౦ వెళ్లిన ఇ౦టికి కెమెరాలు, మైక్రోఫోన్లు కూడా ఉ౦డవచ్చు, వాటి ద్వారా ఇ౦టివాళ్లు మనల్ని చూడొచ్చు, మన మాటల్ని వినొచ్చు, రికార్డు చేయవచ్చు. కాబట్టి మన౦ వాళ్ల తలుపు దగ్గర ఉన్నప్పుడు మర్యాద, మ౦చి అలవాట్లు ఎలా చూపి౦చవచ్చో చూద్దా౦.—2 కొరి౦ 6:3.
మీ ప్రవర్తన (ఫిలి 1:27):
-
ఇ౦టివాళ్ల ఏకా౦తానికి (ప్రైవసీ) గౌరవ౦ ఇచ్చి వాళ్ల ఇ౦టిలోకి తొ౦గి చూడక౦డి. వాళ్ల తలుపు దగ్గర నిలబడినప్పుడు తినక౦డి, త్రాగక౦డి లేదా ఫోన్లు చేయక౦డి, మెసేజ్‌లు ప౦పి౦చక౦డి
మీ మాటలు (ఎఫె 4:29):
-
గడప దగ్గర ఉన్నప్పుడు, ఇ౦టివాళ్లకు ఇబ్బ౦ది కలిగి౦చే విషయాలు లేదా వాళ్లు వినకూడని విషయాలు మాట్లాడక౦డి. కొ౦తమ౦ది ప్రచారకులు చెప్పాలనుకు౦టున్న విషయాన్ని గురి౦చి ఎలా మాట్లాడాలో ఆలోచి౦చుకోవడానికి ప్రక్కన వాళ్లతో మాట్లాడడ౦ ఆపేస్తారు