కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3వ భాగం

ఐగుప్తునుండి విడుదల చేయబడడం మొదలుకొని ఇశ్రాయేలీయుల మొదటి రాజు వరకు

ఐగుప్తునుండి విడుదల చేయబడడం మొదలుకొని ఇశ్రాయేలీయుల మొదటి రాజు వరకు

మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరనుండి సీనాయి పర్వతం దగ్గరకు నడిపించాడు, అక్కడ దేవుడు వాళ్ళకు తన నియమాలను ఇచ్చాడు. తర్వాత మోషే కనాను దేశాన్ని వేగు చూడడానికి 12 మందిని పంపించాడు. అయితే వారిలో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోవడమే మంచిదని ప్రజలు భావించేలా చేశారు. ఇశ్రాయేలీయులు విశ్వాసం లేకుండా ప్రవర్తించినందుకు దేవుడు వాళ్ళను 40 సంవత్సరాలపాటు అరణ్యంలో సంచరించేలా చేసి శిక్షించాడు.

చివరకు, ఇశ్రాయేలీయులను కనాను దేశానికి నడిపించడానికి యెహోషువ ఎన్నుకోబడ్డాడు. వాళ్ళు ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి సహాయం చేసేందుకు యెహోవా అద్భుతాలు చేశాడు. ఆయన యొర్దాను నది ప్రవహించకుండా ఆపుచేశాడు, యెరికో గోడలు కూలిపోయేలా చేశాడు, ఓ రోజంతా సూర్యుడు నిలిచిపోయేలా చేశాడు. ఆరు సంవత్సరాల తరువాత కనానీయులనుండి ఆ దేశం స్వాధీనపర్చుకోబడింది.

యెహోషువతో ఆరంభమై ఇశ్రాయేలు దేశం 356 సంవత్సరాలు న్యాయాధిపతులచేత పరిపాలించబడింది. వాళ్ళలో బారాకు, గిద్యోను, యెఫ్తా, సమ్సోను, సమూయేలులతోపాటు అనేకమంది గురించి మనం తెలుసుకుంటాం. రాహాబు, దెబోరా, యాయేలు, రూతు, నయోమి, దెలీలా వంటి స్త్రీల గురించి కూడా మనం చదువుతాం. మొత్తం 396 సంవత్సరాల చరిత్ర మూడవ భాగంలో వివరించబడింది.

 

ఈ భాగంలో

34వ కథ

ఒక క్రొత్త రకమైన ఆహారం

ఈ ప్రత్యేకమైన ఆహారాన్ని దేవుడు పరలోకం నుండి ఇచ్చాడు.

35వ కథ

యెహోవా తన నియమాలను ఇవ్వడం

పది ఆజ్ఞలకన్నా ఏ రెండు ఆజ్ఞలు గొప్పవి?

36వ కథ

బంగారు దూడ

చెవులకున్న పోగులను కరిగించి చేసిన విగ్రహానికి ప్రజలు ఎందుకు మ్రొక్కుతారు?

37వ కథ

ఆరాధన కోసం ఒక గుడారం

గుడారంలో చిన్న గదిలో నిబంధన మందసం ఉండేది, పెద్ద గదిలో దీపాలు, బలిపీఠము ఉండేవి.

38వ కథ

పన్నెండు మంది వేగులవారు

వేగు చూడడానికి వెళ్లినవాళ్లలో 10మంది ఒక రకమైన సమాచారాన్ని ఇస్తే మిగిలిన ఇద్దరు వేరేలా ఇస్తారు. మరి ఇశ్రాయేలీయులు దేన్ని నమ్ముతారు?

39వ కథ

అహరోను కర్రకు పువ్వులు పూయడం

ఎండిపోయిన కర్రకు రాత్రికిరాత్రే పువ్వులు, బాదం పండ్లు ఎలా కాస్తాయి?

40వ కథ

మోషే బండను కొట్టడం

మోషేకు ఫలితం వచ్చింది కానీ ఆయన యెహోవాకు కోపం కూడా తెప్పించాడు.

41వ కథ

ఇత్తడి పాము

ఇశ్రాయేలీయుల్ని కాటేయడానికి యెహోవా విషపూరితమైన పాములను ఎందుకు పంపాడు?

42వ కథ

గాడిద మాట్లాడడం

బిలాము చూడలేకపోయిన ఒకదాన్ని ఆయన గాడిద చూసింది.

43వ కథ

యెహోషువ నాయకుడు కావడం

మోషే ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాడు, మరి ఆయన స్థానంలో దేవుడు యెహోషువను ఎందుకు నియమించాడు?

44వ కథ

రాహాబు వేగులవాళ్లను దాచిపెట్టడం

రాహాబు ఇద్దరు వ్యక్తులకు ఎలా సహాయం చేస్తుంది? ఆమె వాళ్లను తిరిగి ఏ సహాయం అడుగుతుంది?

45వ కథ

యోర్దాను నది దాటడం

యాజకులు నీటిలోకి దిగగానే ఓ అద్భుతం జరిగింది.

46వ కథ

యెరికో గోడలు

గోడ కూలిపోకుండా ఓ తాడు ఎలా ఆపగలదు?

47వ కథ

ఇశ్రాయేలులో దొంగ

కేవలం ఒక్క చెడ్డ వ్యక్తి పూర్తి జనాంగానికి ఇబ్బందులు తీసుకురాగలడా?

48వ కథ

తెలివైన గిబియోనీయులు

యెహోషువను, ఇతర ఇశ్రాయేలీయులను తెలివిగా మభ్యపెట్టి వాళ్లతో ప్రమాణం చేయించుకున్నారు. కానీ ఇశ్రాయేలీయులు తమ మాటను నిలబెట్టుకున్నారు.

49వ కథ

సూర్యుడు అలాగే నిలిచిపోవడం

యెహోవా ఇంతకుముందున్నెడూ చేయనిదాన్ని యెహోషువ కోసం చేశాడు.

50వ కథ

ధైర్యంగల ఇద్దరు స్త్రీలు

ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించింది బారాకు అయితే యాయేలు ఎందుకు ఘనత పొందింది?

51వ కథ

రూతు, నయోమి

రూతు తిరిగివెళ్లకుండా నయోమితో ఉండిపోయి యెహోవాను సేవిస్తుంది.

52వ కథ

గిద్యోను, అతని 300 మంది పురుషులు

దేవుడు ఓ అసాధారణమైన పరీక్షను పెట్టి కొంతమంది సైనికుల్ని ఎంచుకున్నాడు.

53వ కథ

యెఫ్తా వాగ్దానం

యెఫ్తా యెహోవాకు ఇచ్చిన మాటలో ఆయనే కాదు ఆయన కూతురు కూడా ఇమిడి ఉంది.

54వ కథ

గొప్ప బలంగల వ్యక్తి

సమ్సోను బలం వెనుక ఉన్న కారణం దెలీలాకు ఎలా తెలుస్తుంది?

55వ కథ

చిన్నపిల్లవాడు దేవుణ్ణి సేవించడం

ప్రధాన యాజకుడైన ఏలీకి బాధకలిగించే ఓ విషయాన్ని చెప్పడానికి దేవుడు చిన్నవాడైన సమూయేలు ఉపయోగించుకుంటాడు.