అధ్యాయం 3
నిరంతరం నిలిచే వివాహానికి రెండు కీలకాలు
1, 2. (ఎ) వివాహం ఎంత కాలం ఉండేందుకు రూపొందించబడింది? (బి) అదెలా సాధ్యం?
దేవుడు మొదటి స్త్రీపురుషులను వివాహంలో ఐక్యపర్చినప్పుడు, ఆ కలయిక కేవలం తాత్కాలికమైనదై ఉంటుందనే ఏ సూచనా అప్పుడు లేదు. ఆదాముహవ్వలు జీవితాంతం కలిసివుండాల్సి ఉంది. (ఆదికాండము 2:24) ఘనమైన వివాహం కొరకైన దేవుని ప్రమాణమంటే, ఒక పురుషున్ని ఒక స్త్రీని ఐక్యపర్చడమే. మళ్లీ వివాహం చేసుకునే సాధ్యతతో విడాకులు తీసుకోడానికి గల లేఖనాధార కారణం జతలోని ఒకరు లేక ఇరువురు ఘోరమైన లైంగిక అవినీతికి పాల్పడడమే.—మత్తయి 5:32.
2 ఇద్దరు వ్యక్తులు అనిర్దిష్ట దీర్ఘకాలం సంతోషంగా కలిసిజీవించడం సాధ్యమేనా? సాధ్యమే, దీన్ని సాధ్యం చేసేందుకు సహాయపడే రెండు ఆవశ్యక కారకాంశాలను, లేక కీలకాలను బైబిలు సూచిస్తుంది. ఒకవేళ భార్యాభర్తలిరువురూ వీటిని ఉపయోగిస్తే, అవి సంతోషానికి మరియు అనేక దీవెనలకు ద్వారాన్ని తెరువగలవు. ఈ కీలకాలేవి?
మొదటి కీలకం
3. వివాహ భాగస్వాములు ప్రేమ యొక్క ఏ మూడు రకాలను వృద్ధిపర్చుకోవాలి?
3 మొదటి కీలకం ప్రేమ. బైబిలులో విభిన్న రకాల ప్రేమలు సూచింపబడ్డాయన్నది ఆసక్తికరం. ఒకటేమంటే, ఎవరి ఎడలనైనా ఆప్యాయత, వ్యక్తిగత అనురాగంతో కూడినది, ఆ రకమైన ప్రేమ సన్నిహిత స్నేహితుల మధ్య ఉంటుంది. (యోహాను 11:3) మరొకటి కుటుంబ సభ్యుల మధ్య పెరిగే ప్రేమ. (రోమీయులు 12:10) మూడవది ఒక వ్యక్తి వ్యతిరేక లింగ వ్యక్తుల ఎడల కలిగి ఉండే మధురమైన ప్రేమ. (సామెతలు 5:15-20) నిజమే, వీటన్నిటినీ భార్యాభర్తలు పెంపొందించుకోవాల్సి ఉంది. వీటన్నింటికంటే మరింత ముఖ్యమైనది, నాల్గవ రకమైన ప్రేమకూడా ఉంది.
4. నాల్గవ రకమైన ప్రేమ ఏది?
4 క్రైస్తవ గ్రీకు లేఖనాల మూల భాషలో, ఈ నాల్గవ రకమైన ప్రేమకుగల పదం అ.గాʹపె. “దేవుడు ప్రేమాస్వరూపి” అని మనకు చెబుతున్న 1 యోహాను 4:8లో ఆ పదమే ఉపయోగింపబడింది. వాస్తవానికి, “ఆయనే [దేవుడు] మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.” (1 యోహాను 4:19) ఒక క్రైస్తవుడు అలాంటి ప్రేమను మొదట యెహోవా దేవుని ఎడల తర్వాత తోటి మానవుల ఎడల పెంపొందించుకుంటాడు. (మార్కు 12:29-31) “క్రీస్తు మిమ్మును ప్రేమించి, . . . మనకొరకు తన్నుతాను . . . అప్పగించుకొనెను. ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి” అని పేర్కొంటున్న ఎఫెసీయులు :2నందు కూడా అ 5.గాʹపె అనే పదం ఉపయోగింపబడింది. ఈ విధమైన ప్రేమ తన నిజమైన అనుచరులను సూచిస్తుందని యేసు చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమ [అ.గాʹపె] గలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు”రు. (యోహాను 13:35) 1 కొరింథీయులు 13:13నందు అ.గాʹపె యొక్క ఉపయోగాన్ని కూడా గమనించండి: “విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే [అ.గాʹపె].”
5, 6. (ఎ) విశ్వాసము మరియు నిరీక్షణకంటే ప్రేమ ఎందుకు గొప్పది? (బి) వివాహం చిరకాలం ఉండేందుకు ప్రేమ ఎందుకు సహాయపడుతుంది అనడానికిగల కొన్ని కారణాలేవి?
5 విశ్వాస నిరీక్షణలకంటే ఏది ఈ అ.గాʹపె ప్రేమను గొప్ప దానిగా చేస్తుంది? అది సూత్రాలచేత అంటే దేవుని వాక్యంలో కనుగొనబడే సరైన సూత్రాలచేత నడిపింపబడుతుంది. (కీర్తన 119:105) దేవుని దృష్టికోణంనుండి సరైన దాన్ని మరియు మంచి దాన్ని ఇతరులకు చేయాలన్న నిస్వార్థమైన శ్రద్ధయే అది, అయితే దాన్ని పొందేవ్యక్తి దాన్ని పొందేందుకు అర్హునిగా కనిపించినా, కనిపించకపోయినా దాన్ని చేయడం కూడా అందులో ఇమిడివుంది. అలాంటి ప్రేమ వివాహ భాగస్వాములు బైబిలులోని ఈ సలహాను అనుసరించేందుకు వీలు కలిగిస్తుంది: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” (కొలొస్సయులు 3:13) “ప్రేమ అనేక పాపములను కప్పును గనుక” ప్రేమగల వివాహ దంపతులు “[ఒకరి ఎడల ఒకరు] మిక్కటమైన ప్రేమ [అ.గాʹపె]” కలిగివుండి దాన్ని వృద్ధిచేసుకుంటారు. (1 పేతురు 4:8) ప్రేమ పొరపాట్లను కప్పిపుచ్చుతుందని గమనించండి. ఏ అపరిపూర్ణ మానవుడూ తప్పిదాలనుండి స్వతంత్రుడుకాడు గనుక, అది వాటిని తీసివేయలేదు.—కీర్తన 130:3, 4; యాకోబు 3:2.
6 వివాహ దంపతులు దేవుని ఎడల మరియు ఒకరి ఎడల ఒకరు అలాంటి ప్రేమను పెంపొందించుకున్నప్పుడు, “ప్రేమ ఎన్నడూ విఫలంకాదు” గనుక, వారి వివాహం నిరంతరం నిలుస్తుంది మరియు సంతోషంగా ఉంటుంది. (1 కొరింథీయులు 13:8, NW) ప్రేమ “పరిపూర్ణతకు అనుబంధమైన”ది. (కొలొస్సయులు 3:14) మీరు వివాహితులైతే, ఈ విధమైన ప్రేమను మీరూ, మీ జత ఎలా పెంపొందించుకోగలరు? దేవుని వాక్యాన్ని కలిసి చదివి, దాని గురించి మాట్లాడండి. ప్రేమను గూర్చిన యేసు మాదిరిని పఠించి, ఆయనను అనుకరించడానికి, ఆయనవలె ఆలోచించి మరియు ప్రవర్తించడానికి ప్రయత్నించండి. దానికి తోడు, దేవుని వాక్యం బోధింపబడే క్రైసవ కూటాలకు హాజరవ్వండి. దేవుని పరిశుద్ధాత్మ ఫలమైన ఈ ఉన్నత స్థాయి ప్రేమను వృద్ధిపర్చుకోడానికి సహాయం చేసేందుకు దేవునికి ప్రార్థించండి.—సామెతలు 3:5, 6; యోహాను 17:3; గలతీయులు 5:22; హెబ్రీయులు 10:24, 25.
రెండవ కీలకం
7. గౌరవం అంటే ఏమిటి, వివాహంలో ఎవరు గౌరవం చూపాలి?
7 వివాహమైన ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు నిజంగా ప్రేమిస్తుంటే, వారు ఒకరి ఎడల ఒకరు గౌరవాన్ని కూడా కలిగివుంటారు, ధన్యతగల వివాహానికి గౌరవమే రెండవ కీలకం. “ఇతరులను ఉన్నతులుగా పరిగణించడం, వారిని ఘనపర్చడం” అని గౌరవం నిర్వచింపబడింది. భార్యాభర్తలతో సహా, క్రైస్తవులందరికీ దేవుని వాక్యమిలా సలహానిస్తుంది: “ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమీయులు 12:10) అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “పురుషులారా, . . . యెక్కువ బలహీనమైన ఘటమని [మీ భార్యలను] . . . సన్మానించి, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.” (1 పేతురు 3:7) “తన భర్తయందు భయము కలిగి” ఉండాలి అని భార్యకు సలహా ఇవ్వబడింది. (ఎఫెసీయులు 5:33) మీరు ఒకరిని ఘనపర్చాలనుకుంటే, మీరు వారి ఎడల దయతో ప్రవర్తిస్తారు, వారి ప్రతిష్ఠ ఎడల మరియు వ్యక్తపర్చబడిన వారి ఆలోచనల ఎడల గౌరవాన్ని కలిగివుంటారు, వారు మిమ్మల్ని ఏదైనా సహేతుకంగా అభ్యర్థిస్తే దాని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉంటారు.
8-10. ఒక వివాహ కలయికను దృఢమైనదిగా, సంతోషభరితమైనదిగా చేసేందుకు గౌరవం సహాయపడే కొన్ని మార్గాలు ఏవి?
8 ధన్యతగల వివాహాన్ని కలిగివుండి ఆనందించాలని ఇష్టపడే వారు, “[తమ] సొంతకార్యములను మాత్రమేగాక [తమ జత] . . . కార్యములను కూడ” చూడటం ద్వారా తమ జతకు గౌరవాన్ని కనపరుస్తారు. (ఫిలిప్పీయులు 2:4) తమకు మాత్రమే మంచిగా ఉండేదాన్ని వారు పరిగణించరు—అది స్వార్థం అవుతుంది. బదులుగా, తమ జతకు కూడా మంచిదైన దానిని గురించి వారు ఆలోచిస్తారు. వాస్తవానికి, వారు దానికే ప్రాధాన్యతనిస్తారు.
9 వివాహ భాగస్వాముల దృక్పథంలో తేడాలుంటే వారు వాటిని అంగీకరించేందుకు గౌరవం వారికి సహాయపడుతుంది. ఇద్దరు వ్యక్తులకు ప్రతి విషయంలోనూ ఏకాభిప్రాయం ఉండాలని అపేక్షించడం సహేతుకంకాదు. భర్తకు ప్రాముఖ్యమైనది భార్యకు ప్రాముఖ్యం కాకపోవచ్చు, భార్యకు నచ్చినది భర్తకు నచ్చకపోవచ్చు. అయితే ఇద్దరు ఎదుటివ్యక్తి అభిప్రాయాలను మరియు ఎంపికలను, అవి యెహోవా ధర్మాలు మరియు సూత్రాల పరిధిలో ఉన్నంతమేరకు, వాటిని గౌరవించాలి. (1 పేతురు 2:16; ఫిలేమోను 14 పోల్చండి.) అంతేకాకుండా, అందరి ఎదుటైనా లేక ఎవరూ లేనప్పుడైనా కించపరిచే వ్యాఖ్యానాలను లేక ఛలోక్తులను వారిపై వేయకుండా ఉండటం ద్వారా ఇరువురు ఎదుటివ్యక్తి ఘనతను గౌరవించాలి.
10 అవును, దేవుని ఎడల అలాగే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగివుండటం మరియు పరస్పర గౌరవం, ఈ రెండూ కూడా విజయవంతమయ్యే వివాహానికి ఆవశ్యకమైన కీలకాలు. వివాహ జీవితం యొక్క కొన్ని అత్యంత ప్రాముఖ్యమైన రంగాలలో వాటినెలా అన్వయించుకొనవచ్చు?
క్రీస్తువంటి శిరస్సత్వం
11. లేఖనాధారంగా, వివాహంలో శిరస్సు ఎవరు?
11 తనను విజయవంతుడయ్యే కుటుంబ శిరస్సును చేసే లక్షణాలతో పురుషుడు సృష్టింపబడ్డాడని బైబిలు మనకు తెలియజేస్తుంది. ఆ హోదాలో, పురుషుడు తన భార్యాపిల్లల ఆత్మీయ మరియు భౌతిక యోగక్షేమాలను చూసుకునే బాధ్యతను యెహోవా ఎదుట కలిగివున్నాడు. యెహోవా చిత్తాన్ని ప్రతిబింబించే సమతూకమైన నిర్ణయాలను ఆయన చేయవలసి ఉంటుంది మరియు ఆయన దైవిక ప్రవర్తనకు చక్కని మాదిరిగా ఉండాలి. “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు.” (ఎఫెసీయులు 5:22, 23) అయితే, భర్తకు కూడా శిరస్సు అంటే ఆయనపై అధికారముగల ఓ వ్యక్తి ఉన్నాడని బైబిలు చెబుతుంది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.” (1 కొరింథీయులు 11:3) జ్ఞానవంతుడైన భర్త, తన స్వంత శిరస్సగు క్రీస్తుయేసును అనుకరిస్తూ, శిరస్సత్వాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చుకుంటాడు.
12. లోబడటంలో మరియు శిరస్సత్వాన్ని నిర్వహించడంలో కూడా యేసు ఏ చక్కని మాదిరిని ఉంచాడు?
12 యేసుకు కూడా ఒక శిరస్సు ఉన్నాడు, ఆయన యెహోవా, ఆయనకు యేసు సరైన రీతిలో లోబడివున్నాడు. యేసు ఇలా చెప్పాడు: “నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయ గోరుదును గాని నా యిష్టప్రకారము చేయగోరను.” (యోహాను 5:30) ఎంత శ్రేష్ఠమైన ఉదాహరణ! యేసు “సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.” (కొలొస్సయులు 1:15) ఆయన మెస్సీయ అయ్యాడు. అభిషిక్త క్రైస్తవ సంఘానికి ఆయన శిరస్సుగా మరియు దేవదూతలకంటే పైగా దేవుని రాజ్యానికి ఎంపిక చేయబడిన రాజుగా ఉండాల్సిన వాడు. (ఫిలిప్పీయులు 2:9-11; హెబ్రీయులు 1:4) అలాంటి గొప్ప స్థానం మరియు అలాంటి ఉన్నతమైన ఉత్తరాపేక్షలను కలిగివున్నప్పటికీ, మానవుడైన యేసు కఠినంగా, దయలేని వానిగా లేక ఎక్కువ కోరే వానిగా లేకుండెను. తన శిష్యులు తనకు విధేయులవ్వాలని వారికి పదే పదే జ్ఞాపకం చేస్తూ, ఆయన ఒక నియంతలా లేకుండెను. యేసు ప్రేమ కనికరము కలిగివున్నాడు, ప్రాముఖ్యంగా దీనుల ఎడల ఆయనలా ఉన్నాడు. ఆయనిలా చెప్పాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్తయి 11:28-30) ఆయన సహచర్యంలో ఉండటం ఎంతో ఆనందమయంగా ఉండేది.
13, 14. యేసును అనుకరిస్తూ, ప్రేమగల భర్త తన శిరస్సత్వాన్ని ఎలా నిర్వహిస్తాడు?
13 ధన్యతగల కుటుంబ జీవితాన్ని కోరుకునే భర్త, యేసు చక్కని గుణాలను గురించి ఆలోచిస్తే ఎంతో మంచిపని చేస్తున్నాడన్నమాట. ఒక మంచి భర్త, తన శిరస్సత్వాన్ని తన భార్యను అదుపుచేసేందుకు కర్రలా తప్పుగా ఉపయోగించుకుంటూ, కఠినంగా మరియు నిరంకుశ పరిపాలకునివలె ఉండడు. బదులుగా, ఆయన ఆమెను ప్రేమించి ఘనపరుస్తాడు. యేసు “దీనమనస్సు” గలవాడైతే, భర్త అలా ఉండేందుకు అతనికి మరిన్ని ఎక్కువ కారణాలు ఉన్నాయి, ఎందుకంటే యేసువలె కాక ఆయన పొరపాట్లు చేస్తాడు. ఆయన పొరపాట్లు చేసినప్పుడు, తన భార్య తనను అర్థం చేసుకోవాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి, “నన్ను మన్నించు; నీవు చేసిందే సరైనది” అనే పదాలను చెప్పడం కష్టమైనప్పటికీ, దీనుడైన భర్త తన పొరపాట్లను ఒప్పుకుంటాడు. అహంకారి మరియు మొండి వాడైన భర్త శిరస్సత్వం కంటే, సాత్వికుడు మరియు దీనుడైన భర్త శిరస్సత్వాన్ని గౌరవించడమే భార్యకు చాలా సులభంగా ఉంటుంది. దానికి ప్రతిగా, గౌరవంగల భార్య తాను తప్పిదం చేసినప్పుడు తాను కూడా క్షమాపణ కోరుతుంది.
14 ధన్యతగల వివాహానికి తోడ్పడేందుకు ఉపయోగించగల చక్కని లక్షణాలతో దేవుడు స్త్రీని సృష్టించాడు. ఒక జ్ఞానవంతుడైన భర్త దీన్ని గుర్తించి, ఆమెను అణచివేయడు. అనేకమంది స్త్రీలు, కుటుంబం ఎడల శ్రద్ధ తీసుకోడానికి మరియు మానవ సంబంధాలను పెంపొందించుకోడానికి అవసరమైన లక్షణాలైన ఎంతో కరుణను సున్నితత్వాన్ని కలిగివుంటారు. సాధారణంగా, జీవించేందుకు ఒక ఆహ్లాదకరమైన స్థలంగా గృహాన్ని మార్చడంలో స్త్రీ ఎంతో నేర్పరి. సామెతలు 31వ అధ్యాయంలో వర్ణించబడిన “గుణవతియైన భార్య” అనేక శ్రేష్ఠమైన లక్షణాలను మరియు మహత్తరమైన కౌశలాలను కలిగివుండినది, ఆమె కుటుంబం వాటినుండి పూర్తి లాభాన్ని పొందింది. ఎందుకు? ఎందుకంటే ఆమె భర్త “ఆమెయందు నమ్మిక”నుంచాడు.—సామెతలు 31:10, 11.
15. ఒక భర్త క్రీస్తువంటి ప్రేమ మరియు గౌరవాన్ని తన భార్యకు ఎలా చూపగలడు?
15 కొన్ని సంస్కృతుల్లో, భర్త అధికారం ఎంతగా నొక్కిచెప్పబడుతుందంటే, ఆయనను ఒక ప్రశ్న అడిగినా అది అగౌరవంగా పరిగణింపబడుతుంది. ఆయన తన భార్యను దాదాపు ఒక దాసీవలె చూడవచ్చు. శిరస్సత్వాన్ని అలా తప్పుగా ప్రదర్శించడం, ఆయనకు భార్యతోనే కాక దేవునితోకూడా సరైన సంబంధం లేకుండా చేస్తుంది. (1 యోహాను 4:20, 21 పోల్చండి.) మరో వైపు, కొందరు భర్తలు తమ భార్యలు ఇంటి పెత్తనం చేసేందుకు అనుమతిస్తూ, ఆధిపత్యం వహించడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. క్రీస్తుకు సరిగ్గా లోబడిన భర్త తన భార్యకు అన్యాయం చేయడు లేక ఆమె మర్యాదను దోచుకోడు. బదులుగా, ఆయన యేసు యొక్క స్వయంత్యాగ ప్రేమను అనుకరిస్తాడు, “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను” అని పౌలు సలహా ఇచ్చినట్లు చేస్తాడు. (ఎఫెసీయులు 5:25-27) క్రీస్తుయేసు తన అనుచరులను ఎంతగా ప్రేమించాడంటే ఆయన వారికొరకు మరణించాడు. ఒక మంచి భర్త, తన భార్యనుండి ఏదో పొందేందుకు ఆశించే బదులు ఆమె మేలు కోరుతూ, అలాంటి నిస్వార్థ గుణాన్ని అనుకరిస్తాడు. ఒక భర్త క్రీస్తుకు లోబడి, క్రీస్తువంటి ప్రేమ మరియు గౌరవాన్ని ప్రదర్శిస్తే, ఆయన భార్య ఆయనకు తననుతాను లోపర్చుకోడానికి పురికొల్పబడుతుంది.—ఎఫెసీయులు 5:28, 29, 33.
భార్యగా లోబడటం
16. తన భర్తతో తనకుగల సంబంధంలో భార్య ఏ లక్షణాలను ప్రదర్శించాలి?
16 ఆదాము సృష్టించబడిన కొంత సమయం తర్వాత, “దేవుడైన యెహోవా—నరుడు ఒంటరిగానుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.” (ఆదికాండము 2:18) దేవుడు హవ్వను “సహాయకారిగా” సృష్టించాడే గానీ, పోటీదారుగా కాదు. వివాహమనేది, పోటీపడే ఇద్దరు నాయకులుగల ఓడలా ఉండకూడదు. భర్త ప్రేమపూర్వక శిరస్సత్వాన్ని ప్రదర్శించాలి, భార్య ప్రేమా గౌరవాలను ప్రదర్శిస్తూ, ఇష్టపూర్వకంగా లోబడాలి.
17, 18. భార్య తన భర్తకు నిజమైన సహాయకారిగా ఉండగల కొన్ని మార్గాలేవి?
17 అయితే, ఒక మంచి భార్య కేవలం లోబడివుండటం కంటే ఎక్కువే చేయాలి. తన భర్త తీసుకునే నిర్ణయాలలో ఆయనకు మద్దతునిస్తూ, ఆమె ఒక నిజమైన సహాయకురాలిగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. వాస్తవానికి, ఆయన నిర్ణయాలతో ఆమె ఏకీభవిస్తే అది ఆమెకు సులభమౌతుంది. అయితే ఆమె ఏకీభవించనప్పటికీ, ఆయన నిర్ణయాలు మరింత విజయవంతమైన ఫలితాలనివ్వడానికి ఆమె చురుకైన మద్దతు సహాయపడగలదు.
18 తన భర్త మంచి శిరస్సుగా ఉండేందుకు భార్య ఇతర మార్గాల్లో కూడా సహాయపడగలదు. ఆయనను విమర్శించే బదులు లేక ఆయన తనను ఎన్నడూ సంతృప్తిపర్చలేడనే భావనను ఆయనకు కలిగించే బదులు, నాయకత్వం తీసుకోవడంలోని ఆయన ప్రయత్నాల ఎడల ఆమె మెప్పును వ్యక్తం చేయగలదు. తన భర్తతో అనుకూలమైన పద్ధతిలో వ్యవహరించేటప్పుడు, “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణ”ము, తన భర్త దృష్టిలోనేకాక “దేవుని దృష్టికి” కూడా “మిగుల విలువగలది” అని ఆమె జ్ఞాపకం ఉంచుకోవాలి. (1 పేతురు 3:3, 4; కొలొస్సయులు 3:12) ఒకవేళ భర్త విశ్వాసి కాకపోతే? ఆయన విశ్వాసి అయినా కాకపోయినా, “దేవునివాక్యము దూషింపబడకుండునట్లు, . . . తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై” ఉండాలని లేఖనాలు భార్యలను ప్రోత్సహిస్తున్నాయి. (తీతు 2:4, 5) మనస్సాక్షిపూర్వకమైన విషయాలు తలెత్తితే, భార్య తన తీర్మానాన్ని “సాత్వికముతోను భయముతోను” తెలియజేస్తే, అవిశ్వాసి అయిన భర్త ఆమె తీర్మానాన్నే గౌరవించవచ్చు. కొందరు అవిశ్వాసులైన భర్తలు, “భయముతోకూడిన . . . [వారి] పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్ట”బడిరి.—1 పేతురు 3:1, 2, 15; 1 కొరింథీయులు 7:13-16.
19. దేవుని చట్టాన్ని ఎదిరించమని భర్త భార్యను అడిగితే అప్పుడెలా?
19 చేయగూడదని దేవుడు అక్షేపించిన దానిని చేయమని భర్త భార్యను అడిగితే అప్పుడేమిటి? అలా జరిగితే, దేవుడే ఆమె ప్రథమ పరిపాలకుడని ఆమె జ్ఞాపకముంచుకోవాలి. దేవుని ధర్మాన్ని ఎదిరించమని అధికారులు అపొస్తలులను అడిగినప్పుడు వారేమి చేశారో దాన్ని ఆమె ఉదాహరణగా తీసుకుంటుంది. అపొస్తలుల కార్యములు 5:29 ఇలా చెబుతుంది: ‘పేతురును అపొస్తలులును—మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా . . . అని చెప్పిరి.’
మంచి సంభాషణ
20. ప్రేమా గౌరవాలు ఆవశ్యకమైన ఒక ప్రముఖ రంగం ఏది?
20 వివాహంలోని మరో రంగంలో కూడా ప్రేమా గౌరవాలు ప్రాముఖ్యం—ఆ రంగమే సంభాషణ. ప్రేమగల భర్త తన భార్య కార్యకలాపాలు, ఆమె సమస్యలు మరియు విభిన్న విషయాలపై ఆమె దృష్టికోణాలను గురించి ఆమెతో మాట్లాడతాడు. ఆమెకు అది అవసరం. తన భార్యతో మాట్లాడేందుకు సమయాన్ని వెచ్చించి, ఆమె చెప్పేదాన్ని వాస్తవంగా వినే భర్త ఆమె ఎడల తనకుగల ప్రేమను గౌరవాన్ని ప్రదర్శిస్తాడు. (యాకోబు 1:19) తమ భర్తలు తమతో సంభాషించేందుకు చాలాతక్కువ సమయాన్ని గడుపుతారని కొందరు భార్యలు ఫిర్యాదు చేస్తారు. అది దుఃఖకరమైన విషయం. వాస్తవమే, తీరిక లభించని ఈ కాలాల్లో, భర్తలు ఉద్యోగాలలో చాలా సమయం గడపవచ్చు, ఆర్థిక పరిస్థితులవలన కొందరు భార్యలు కూడా ఉద్యోగాలు చేయవలసి ఉండవచ్చు. అయితే వివాహ దంపతులు తమ ఇరువురి కొరకు కొంత సమయాన్ని వెచ్చించాల్సిన అవసరముంది. లేకపోతే తాము ఒకరిపై మరొకరు ఆధారపడవలసిన అవసరత ఉందని వారు భావించరు. సానుభూతి చూపే సహచర్యాన్ని వారు వివాహ ఏర్పాటు వెలుపల వెదికేందుకు బలవంతం చేయబడినట్లు భావిస్తే అది గంభీరమైన సమస్యలకు కారణం కాగలదు.
21. వివాహాన్ని సంతోషంగా ఉంచుకొనేందుకు సరైన సంభాషణ ఎలా సహాయపడుతుంది?
21 భార్యాభర్తలు సంభాషించే పద్ధతి కూడా ప్రాముఖ్యం. “ఇంపైన మాటలు . . . ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి.” (సామెతలు 16:24) ఒక జత విశ్వాసి అయినా కాకపోయినా, బైబిలు ఇచ్చే ఈ సలహా వర్తిస్తుంది: “మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (కొలొస్సయులు 4:6) ఒకరి దినం కష్టంగా గడిచివుంటే, దయతోకూడిన సానుభూతిగల కొన్ని మాటలను ఒకరి జత పలికితే అదెంతో మంచిగా ఉంటుంది. “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.” (సామెతలు 25:11) స్వరము మరియు మాటల ఎంపిక చాలా ప్రాముఖ్యమైనవి. ఉదాహరణకు, చిరాకు కలిగించే, అహంకార పద్ధతిలో ఒకరు మరొకరికి: “ఆ తలుపెయ్!” అని చెప్పవచ్చు. అయితే, “దయచేసి ఆ తలుపు కొంచెం మూయగలరా?” అని నెమ్మదైన, అర్థం చేసుకునే స్వరంలో అంటే ఆ మాటలు ‘ఉప్పు వేసినట్లు’ ఎంత ‘రుచిగలవిగా’ ఉండగలవో కదా!
22. మంచి సంభాషణను కలిగివుండేందుకు దంపతులకు ఏ దృక్పథాలు అవసరం?
22 మృదువుగా పలికిన పలుకులు, దయతో కూడిన చూపులు మరియు స్పర్శ, దయ, అవగాహన మరియు సున్నితత్వం ఉన్నప్పుడు మంచి సంభాషణ వెల్లివిరుస్తుంది. మంచిగా సంభాషించేందుకు కృషి చేయడం ద్వారా, భార్యాభర్తలిరువురు తమ అవసరతలను తెలియజేసేందుకు సంకోచించరు మరియు నిరుత్సాహం లేక ఒత్తిడి సమయాల్లో ఒకరికొకరు ఆదరణను సహాయాన్ని అందించే వారిగా ఉండగలరు. “కృంగిన ప్రాణులతో ఓదార్పుకరంగా మాట్లాడండి” అని దేవుని వాక్యం పురికొల్పుతుంది. (1 థెస్సలొనీకయులు 5:14, NW) భర్త నిరుత్సాహంగా భావించే సమయాలు ఉంటాయి, భార్య కూడా అలా భావించే సమయాలు ఉంటాయి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వారు “ఓదార్పుకరంగా మాట్లాడు”కోగలరు.—రోమీయులు 15:2.
23, 24. అభిప్రాయభేదాలు ఉన్నప్పుడు ప్రేమాగౌరవాలు ఎలా సహాయపడతాయి? ఒక ఉదాహరణనివ్వండి.
23 ప్రేమ మరియు గౌరవాన్ని కనపర్చే వివాహ భాగస్వాములు ప్రతి అభిప్రాయభేదాన్ని ఒక సవాలుగా పరిగణించరు. ఒకరినొకరు “నిష్ఠురపెట్టకుం”డా ఉండేందుకు వారు కృషి చేస్తారు. (కొలొస్సయులు 3:19) “మృదువైన మాట క్రోధమును చల్లార్చును” అని ఇరువురూ జ్ఞాపకముంచుకోవాలి. (సామెతలు 15:1) తన హృదయ భావాలను మీ ఎదుట కుమ్మరించే జతను చులకన చేయడం లేక ఖండించడం వంటివి చేయకుండా జాగ్రత్తపడండి. బదులుగా, అలాంటి వ్యక్తీకరణలను ఎదుటివ్యక్తి దృక్కోణాన్ని అర్థం చేసుకోడానికి ఒక అవకాశంగా దృష్టించండి. ఇద్దరూ కలిసి, మీలోవున్న భేదాలను తొలగించుకొనేందుకు పని చేసి సామరస్యపూరితమైన ముగింపుకు రండి.
24 ఒకానొక సమస్యకు పరిష్కారాన్ని, తన భర్త అయిన అబ్రాహాముకు శారా సూచించినప్పుడు అది ఆయన భావాలతో ఏకీభవించని ఒక సందర్భాన్ని జ్ఞాపకంచేసుకోండి. అయినప్పటికీ, దేవుడు అబ్రాహాముతో ఇలా చెప్పాడు: “ఆమె మాట వినుము.” (ఆదికాండము 21:9-12) అబ్రాహాము విన్నాడు, ఆయన దీవించబడ్డాడు. అదే విధంగా, ఒక భార్య తన భర్త మనస్సులో ఉన్న విషయానికి భిన్నమైన దాన్ని సూచిస్తే, ఆయన కనీసం ఆమె చెప్పేది వినాలి. అదే సమయంలో, ఒక భార్య సంభాషణంతటిపై ఆధిపత్యం వహించకూడదు అయితే తన భర్త చెప్పే విషయాలను వినాలి. (సామెతలు 25:24) భర్తయినా, భార్యయినా తాను చెప్పిన పద్ధతినే ప్రతిసారీ అనుసరించాలని పట్టుపట్టడం ప్రేమ రాహిత్యాన్ని అగౌరవాన్ని చూపిస్తుంది.
25. వైవాహిక జీవితం యొక్క సన్నిహిత అంశాలలో సంతోషానికి మంచి సంభాషణ ఎలా దోహదపడుతుంది?
25 దంపతుల లైంగిక సంబంధ విషయంలో కూడా చక్కగా సంభాషించుకోవడం ప్రాముఖ్యం. స్యార్థం, ఆశానిగ్రహం లోపించడం వివాహంలోని ఈ అతి సన్నిహిత సంబంధాన్ని గంభీరంగా పాడుచేయగలదు. సహనంతోపాటు, మంచిగా సంభాషించుకోవడం ఆవశ్యకం. ప్రతి ఒక్కరు ఎదుటివ్యక్తి యొక్క యోగక్షేమాన్ని నిస్వార్థంగా వెదకితే, లైంగికత ఎంతో అరుదుగా మాత్రమే ఒక గంభీరమైన సమస్య అవుతుంది. ఇతర విషయాల్లో వలెనే ఇందులో కూడా ‘ఎవరును తనకొరకే కాదు, ఎదుటి వారికొరకు మేలుచేసేందుకు చూడాలి.’—1 కొరింథీయులు 7:3-5; 10:24.
26. ప్రతి వివాహానికి దాని దాని ఒడుదుడుకులు ఉన్నప్పటికీ, దేవుని వాక్యాన్ని వినడం వివాహ దంపతులు సంతోషాన్ని కనుగొనేందుకు ఎలా సహాయం చేస్తుంది?
26 దేవుని వాక్యం ఎంత చక్కని సలహాను అందిస్తుందో కదా! నిజమే, ప్రతి వివాహానికి దాని దాని ఒడుదుడుకులు ఉంటాయి. అయితే బైబిలులో బయల్పర్చబడినట్లు దంపతులు యెహోవా ఆలోచనా విధానానికి లోబడితే మరియు సూత్రాలపై ఆధారపడిన ప్రేమా గౌరవాలపై తమ సంబంధాలను ఆధారితం చేసుకుంటే, వారి వివాహం నిరంతరం ఉంటుందని, ధన్యమై ఉంటుందని వారు నిశ్చయతను కలిగివుండగలరు. అలా వారు ఒకరినొకరే కాక వివాహ ఆరంభకుడైన యెహోవా దేవున్ని కూడా ఘనపరుస్తారు.