యథార్థవంతులుగా నడుచుకోండి
యథార్థవంతులుగా నడుచుకోండి
“నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను.”—కీర్తన 26:11.
సాతాను ఏదెను తోటలో తిరుగుబాటు చేసినప్పుడు, దేవునికి తాను సృష్టించిన ప్రాణులందరిని పరిపాలించే హక్కు ఉందా లేదా అనే విషయానికి సంబంధించి వివాదాన్ని లేవదీశాడు. ఆ తర్వాత కొంతకాలానికి అతను, మానవులు తమకు ప్రయోజనకరంగా ఉంటేనే దేవుణ్ణి సేవిస్తారు అని సవాలు చేశాడు. (యోబు 1:9-11; 2:4) కాబట్టి యెహోవా విశ్వసర్వాధిపత్యానికి సంబంధించిన వివాదంలో మానవుల యథార్థత కూడా ప్రాముఖ్యమైన భాగంగా తయారయ్యింది.
2 దేవుని సర్వాధిపత్యం ఆయన ప్రాణుల యథార్థతపై ఆధారపడిలేదు, అయినా కూడా మానవులు, దేవుని ఆత్మ కుమారులు తాము ఆ వివాదంలో ఎవరి పక్షాన ఉన్నారో చూపించవచ్చు. ఎలా? యథార్థవంతులుగా నడుచుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడం ద్వారా. వ్యక్తి యథార్థత, అతనిని లేదా ఆమెను తీర్పు తీర్చడానికి ఒక బలమైన ఆధారంగా ఉంటుంది.
3 యోబు నమ్మకంతో ఇలా చెప్పాడు: “నేను యథార్థుడనై యున్నానని దేవుడు [యెహోవా] తెలిసికొనునట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక.” (యోబు 31:6-7) “యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమ్మిక యుంచియున్నాను” అని ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన దావీదు రాజు ప్రార్థించినప్పుడు తన యథార్థతను పరీక్షించమని యెహోవాను కోరాడు. (కీర్తన 26:1) మనం కూడా యథార్థవంతులుగా నడవడం ఎంత ఆవశ్యకమో కదా! అయితే యథార్థత అంటే ఏమిటి, యథార్థవంతులుగా నడుచుకోవడం అంటే ఏమిటి? మన యథార్థతను కాపాడుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?
“నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను”
4 యథార్థతకు న్యాయంగా, నిందారహితంగా, నీతియుక్తంగా, నిష్కళంకంగా ఉండడం అనే భావం ఉంది. అయితే యథార్థంగా ఉండడమంటే కేవలం సరైనది చేయడం మాత్రమే కాదు. అది నైతిక పటిష్టతను, పూర్ణ హృదయంతో కూడిన దైవభక్తిని సూచిస్తుంది. సాతాను దేవునితో ఇలా అన్నప్పుడు యోబు ఉద్దేశాలను సవాలు చేశాడు: “నీవు చేయి చాపి అతని [యోబు] యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును.” (యోబు 2:5) యథార్థంగా ఉండడానికి సరైన చర్యలతోపాటు సరైన హృదయ ప్రేరణ కూడా ఉండాలి.
5 యథార్థంగా ఉండడానికి పరిపూర్ణంగా ఉండవలసిన అవసరం లేదు. దావీదు రాజు అపరిపూర్ణుడు, ఆయన తన జీవితకాలంలో ఎన్నో గంభీరమైన తప్పులు చేశాడు. అయినా కూడా బైబిలు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ‘యథార్థహృదయుడై’ నడుచుకున్నాడు అని చెబుతోంది. (1 రాజులు 9:4) ఎందుకు? ఎందుకంటే దావీదు యెహోవాను ప్రేమించాడు. ఆయన హృదయం దైవభక్తితో నిండివుండేది. ఆయన ఇష్టపూర్వకంగా తన తప్పులను ఒప్పుకొని, మందలింపును అంగీకరించి, తన మార్గాలను సరిదిద్దుకున్నాడు. అవును దావీదు చూపించిన హృదయపూర్వకమైన దైవభక్తినిబట్టి, యెహోవా దేవునిపట్ల చూపించిన ప్రేమనుబట్టి ఆయన యథార్థత స్పష్టమవుతోంది.—ద్వితీయోపదేశకాండము 6:5, 6.
6 యథార్థత మానవుల ప్రవర్తనకు సంబంధించిన ఒక్క అంశానికి మాత్రమే అంటే మతపరమైన భక్తికి మాత్రమే పరిమితం కాదు. అది మన జీవిత విధానాన్నంతటినీ ప్రభావితం చేస్తుంది. దావీదు యథార్థవంతునిగా ‘నడుచుకున్నాడు.’ “‘నడుచుకోవడం’ అనే క్రియాపదం ‘జీవిత విధానాన్ని’ లేదా ‘జీవన శైలిని’ సూచిస్తుంది” అని ద కీర్తన 119:1-3) యథార్థంగా ఉండాలంటే దేవుని చిత్తం చేయడానికి, ఆయన మార్గంలో నడవడానికి ఎడతెగక ప్రయత్నిస్తూ ఉండాలి.
న్యూ ఇంటర్‌ప్రెటర్స్ బైబిల్ చెబుతోంది. ‘నిర్దోషముగా నడుచుకునేవారి’ గురించి మాట్లాడుతూ కీర్తనకర్త ఇలా పాడాడు: “ఆయన [దేవుని] శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు.” (7 యథార్థవంతులుగా నడుచుకోవాలంటే ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవునిపట్ల విశ్వసనీయమైన భక్తిని ప్రదర్శించాలి. మనం కష్టాలను సహిస్తే, ప్రతికూల పరిస్థితుల్లోనూ స్థిరంగా ఉంటే, భక్తిహీన లోకంనుండి వచ్చే శోధనలను ఎదిరిస్తే మన యథార్థత స్పష్టమవుతుంది. మనం ‘యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తాము,’ ఎందుకంటే మనం యథార్థంగా ఉన్నప్పుడు ఆయన తనను నిందించే వానితో ధైర్యముగా మాట్లాడగలుగుతాడు. (సామెతలు 27:11) కాబట్టి మనం యోబులాగే ఇలా తీర్మానించుకోవాలి: “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.” (యోబు 27:5) మనం యథార్థవంతులుగా నడుచుకోవడానికి ఏమి సహాయం చేస్తుందో 26వ కీర్తన చూపిస్తోంది.
“నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము”
8 దావీదు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము.” (కీర్తన 26:2) ఈ వచనంలో అంతరింద్రియములు అని అనువదించబడిన హీబ్రూ పదం, ఒక వ్యక్తి లోతైన తలంపులను భావోద్వేగాలను సూచిస్తుంది. హృదయం ఒక వ్యక్తి అంతరంగ స్వభావాన్ని అంటే అతని ప్రేరణలను, భావాలను, అవగాహనను సూచిస్తుంది. దావీదు తనను పరిశీలించమని యెహోవాను అడిగినప్పుడు, తన లోతైన తలంపులను భావాలను వెదకమని వాటిని నిశితంగా పరిశీలించమని కోరాడు.
9 తన అంతరింద్రియములను, హృదయాన్ని పరిశోధించమని కూడా దావీదు వేడుకున్నాడు. మన అంతరంగ స్వభావాన్ని యెహోవా ఎలా పరిశోధిస్తాడు? దావీదు ఇలా పాడాడు: “నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను. రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది.” (కీర్తన 16:7) దాని భావమేమిటి? దైవిక ఉపదేశం దావీదు అంతరాళాల్లోకి చొచ్చుకొని వెళ్ళి అక్కడ స్థిరపడిందని, అది ఆయన లోతైన తలంపులను భావోద్వేగాలను సరిదిద్దుతుందని దానర్థం. మనం దేవుని వాక్యంనుండి, ఆయన ప్రతినిధులనుండి, ఆయన సంస్థనుండి వచ్చే ఉపదేశం గురించి కృతజ్ఞతాపూర్వకంగా ఆలోచించినప్పుడు, అది మనలో నాటుకోవడానికి అనుమతించినప్పుడు దైవిక ఉపదేశం మన లోతైన తలంపులను భావోద్వేగాలను సరిదిద్దగలదు. ఆ విధంగా మనల్ని పరిశోధించమని యెహోవాకు క్రమంగా ప్రార్థించడం మనం యథార్థవంతులుగా నడుచుకోవడానికి సహాయం చేస్తుంది.
“నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను”
10“నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను, నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను” అని దావీదు అన్నాడు. (కీర్తన 26:3) దావీదుకు దేవుని కృపాకార్యములు అంటే ప్రేమపూర్వక దయతో కూడిన కార్యములు బాగా తెలుసు, ఆయన వాటి గురించి కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానించేవాడు. “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము” అని ఆయన పాడాడు. దేవుని “ఉపకారములలో” ఒకదానిని గుర్తు తెచ్చుకుంటూ దావీదు ఇంకా ఇలా పాడాడు: “యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను.” (కీర్తన 103:2, 6, 7) బహుశా దావీదు, ఇశ్రాయేలీయులు మోషే కాలంలో ఐగుప్తీయుల చేతుల్లో అనుభవించిన బాధల గురించి ఆలోచించి ఉండవచ్చు. ఆయన దాని గురించే ఆలోచించివుంటే, యెహోవా తన రక్షణ మార్గాలను మోషేకు తెలియజేసిన విధానం గురించి ధ్యానించడం బహుశా దావీదు హృదయాన్ని స్పృశించివుంటుంది, దేవుని సత్యానికి అనుగుణంగా నడుచుకోవాలనే ఆయన తీర్మానాన్ని బలపరచి ఉంటుంది.
11 దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేయడం, దానినుండి మనం నేర్చుకున్నవాటి గురించి ధ్యానించడం కూడా మనం యథార్థవంతులుగా నడుచుకోవడానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకు, పోతీఫరు భార్య అనైతిక కార్యానికి పాల్పడమని కోరినప్పుడు యోసేపు అక్కడనుండి పారిపోయాడు అనే విషయం గుర్తు తెచ్చుకోవడం, మన ఉద్యోగస్థలంలో, స్కూల్లో, లేదా ఇంకెక్కడైనా అలాంటి పరిస్థితి ఎదురైతే అక్కడనుండి పారిపోవాలని మనల్ని ప్రోత్సహిస్తుంది. (ఆదికాండము 39:7-12) ఆస్తిపాస్తులు లేదా ఈ లోకంలో పేరు ప్రతిష్ఠలను అధికారాన్ని సంపాదించుకునే అవకాశాలు మనల్ని శోధిస్తే అప్పుడెలా? ఐగుప్తు వైభవాలను నిరాకరించిన మోషే ఉదాహరణ మనకు ఉంది. (హెబ్రీయులు 11:24) యోబు సహనాన్ని మనసులో ఉంచుకోవడం, మనం వ్యాధిగ్రస్తులమైనా లేదా కష్టాల్లో చిక్కుకున్నా యెహోవాకు నమ్మకంగా ఉండాలనే మన తీర్మానాన్ని బలపరచుకోవడానికి సహాయం చేస్తుందనడంలో సందేహం లేదు. (యాకోబు 5:11) మనం హింసించబడితే అప్పుడెలా? సింహాల గుహలో పడవేయబడిన దానియేలు ఉదాహరణను గుర్తు తెచ్చుకోవడం మనల్ని ధైర్యంతో నింపుతుంది!—దానియేలు 6:16-22.
“పనికిమాలినవారితో నేను సాంగత్యము చేయను”
12 తన యథార్థతను బలపరచిన మరో అంశాన్ని ప్రస్తావిస్తూ దావీదు ఇలా అన్నాడు: “పనికిమాలినవారితో నేను సాంగత్యము చేయను; వేషధారులతో పొందుచేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో కీర్తన 26:3-5) దావీదు భక్తిహీనులతో కూర్చోవడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన చెడు సహవాసాలను అసహ్యించుకున్నాడు.
సాంగత్యము చేయను.” (13 మన విషయమేమిటి? మనం టీవీ కార్యక్రమాలు, వీడియోలు, చలన చిత్రాలు, ఇంటర్నెట్ సైట్లు లేదా ఇతర మాధ్యమాల ద్వారా పనికిమాలిన వారితో సహవసించడానికి నిరాకరిస్తామా? మనం వేషధారులనుండి దూరంగా ఉంటామా? స్కూల్లో లేదా మన ఉద్యోగస్థలంలో కొంతమంది మోసకరమైన ఉద్దేశాలతో మన స్నేహితులుగా నటించవచ్చు. దేవుని సత్యానికి అనుగుణంగా నడుచుకోనివారితో సన్నిహిత సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి మనం ఇష్టపడతామా? మతభ్రష్టులు తాము యథార్థమైనవారమని చెప్పుకున్నా, మనల్ని యెహోవా సేవనుండి దూరం చేయాలనే తమ ఉద్దేశాలను మననుండి దాచిపెట్టవచ్చు. క్రైస్తవ సంఘంలో కొందరు ద్వంద్వ జీవితాలు జీవించేవారు ఉంటే ఎలా? వారు కూడా తమ నిజ స్వరూపాలను దాచిపెడతారు. ఇప్పుడు పరిచర్య సేవకుడిగా సేవచేస్తున్న జేసన్ యౌవనస్థుడిగా ఉన్నప్పుడు ఆయనకు అలాంటి స్నేహితులు ఉండేవారు. ఆయన వాళ్ళ గురించి ఇలా చెప్పాడు: “ఒకరోజు వాళ్ళలో ఒకడు నాతో ఇలా అన్నాడు: ‘మనం ఇప్పుడు ఏమి చేసినా ఫర్వాలేదు, ఎందుకంటే నూతనలోకం వచ్చినప్పుడు మనందరం చనిపోతాము. అప్పుడు మనం ఏదో కోల్పోయామని మనకు తెలియనే తెలియదు.’ అలాంటి మాటలు నేను అప్రమత్తంగా ఉండాలని నాకు గుర్తు చేశాయి. నూతనలోకం వచ్చినప్పుడు నేను చనిపోవాలనుకోలేదు.” జేసన్ జ్ఞానయుక్తంగా ప్రవర్తించి అలాంటివారితో స్నేహం చేయడం మానేశాడు. “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (1 కొరింథీయులు 15:33) మనం చెడు సహవాసాలకు దూరంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా!
‘నేను నీ ఆశ్చర్యకార్యములను వివరిస్తాను’
14“నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యెహోవా, నీ బలిపీఠము చుట్టు ప్రదక్షిణము చేయుదును” అని దావీదు అన్నాడు. ఎందుకు? “అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్యకార్యములను వివరింతును.” (కీర్తన 26:6, 7) దావీదు యెహోవాను ఆరాధించడం కోసం, దేవునిపట్ల తనకున్న భక్తి గురించి ప్రకటించడం కోసం నైతికంగా పరిశుభ్రంగా ఉండాలని కోరుకున్నాడు.
15 మందిర గుడారమువద్ద, ఆ తర్వాత ఆలయంవద్ద సత్యారాధనకు సంబంధించిన ప్రతి విషయం ‘పరలోకసంబంధమగు వస్తువుల ఛాయారూపకంగా’ పని చేసింది. (హెబ్రీయులు 8:5; 9:23) బలిపీఠము, మానవుల విమోచన కోసం యేసుక్రీస్తు బలిని అంగీకరించడంలో యెహోవా చిత్తాన్ని సూచించింది. (హెబ్రీయులు 10:5-10) ఆ బలియందు విశ్వాసముంచడం ద్వారా మనం నిర్దోషులమని మన చేతులు కడుక్కొని ‘యెహోవా బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేస్తాము.’—యోహాను 3:16-18.
16 విమోచన క్రయధనంవల్ల మనం పొందే ప్రయోజనాలన్నింటి గురించి ఆలోచించినప్పుడు యెహోవాపట్ల ఆయన అద్వితీయ కుమారునిపట్ల మన హృదయం కృతజ్ఞతతో నిండదా? కాబట్టి మనం కృతజ్ఞత నిండిన హృదయంతో, ఏదెను తోటలో మానవుడు సృష్టించబడినప్పటినుండి దేవుని నూతనలోకంలో అన్ని విషయాలు వాటివాటి స్థానాలకు తీసుకురాబడేవరకూ దేవుడు చేసిన, ఇక ముందు చేయబోయే అద్భుతమైన కార్యాల గురించి ఇతరులకు తెలియజేద్దాము. (ఆదికాండము 2:7; అపొస్తలుల కార్యములు 3:21) రాజ్య ప్రకటనా పని, శిష్యులను చేసే పని ఖచ్చితంగా మనకు ఆధ్యాత్మిక రక్షణను కలుగజేస్తాయి! (మత్తయి 24:14; 28:19, 20) ఆ పనుల్లో నిమగ్నమై ఉండడం భవిష్యత్తు కోసమైన మన నిరీక్షణను తేటగా ఉంచుకోవడానికి, దేవుని వాగ్దానాల్లో మన నమ్మకాన్ని బలంగా ఉంచుకోవడానికి, యెహోవాపట్ల తోటి మానవులపట్ల మన ప్రేమను సజీవంగా ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది.
‘నీ నివాసమందిరమును నేను ప్రేమించుచున్నాను’
17 బలులు అర్పించడానికి బలిపీఠము ఉన్న మందిర గుడారము ఇశ్రాయేలులో యెహోవా ఆరాధనకు కేంద్రస్థానంగా ఉండేది. ఆ స్థలం తనకు సంతోషాన్ని కలుగజేస్తుందని వ్యక్తం చేస్తూ దావీదు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను.”—కీర్తన 26:8.
18 మనం యెహోవా గురించి నేర్చుకునే స్థలాల్లో సమకూడడానికి ఇష్టపడతామా? క్రమంగా ఆధ్యాత్మిక ఉపదేశం అందించే కార్యక్రమం ఉన్న ప్రతి రాజ్యమందిరమూ స్థానికంగా సత్యారాధనకు కేంద్రస్థానంగా ఉంటుంది. అంతేకాకుండా మనకు వార్షిక సమావేశాలు, ప్రాంతీయ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు ఉన్నాయి. అలాంటి కీర్తన 119:167) మన సంక్షేమంపట్ల శ్రద్ధ కలిగి, యథార్థతను కాపాడుకోవడానికి మనకు సహాయం చేసే తోటి విశ్వాసులతో సమయం గడపడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా!—హెబ్రీయులు 10:24, 25.
కూటాల్లోను సమావేశాల్లోను యెహోవా “శాసనములు” చర్చించబడతాయి. మనం వాటిని ‘అతిగా ప్రేమించడం’ నేర్చుకుంటే, కూటాలకు హాజరై పూర్తి అవధానంతో వినడానికి మనం ఆసక్తి చూపిస్తాము. (“నా ప్రాణమును” తీసివేయకుము
19 దేవుని సత్యంనుండి వైదొలగడంవల్ల వచ్చే పర్యవసానాలు దావీదుకు బాగా తెలుసు కాబట్టి ఆయన ఇలా వేడుకున్నాడు: “పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది.” (కీర్తన 26:9, 10) దావీదు దుష్కార్యములు చేసేవారిలో లేక లంచాలు తీసుకునేవారిలో ఒకడిగా ఎంచబడాలని కోరుకోలేదు.
20 నేటి లోకం విపరీతమైన అనైతిక చర్యలతో నిండి ఉంది. టీవీ, పత్రికలు, సినిమాలు అనైతిక ప్రవర్తనను అంటే “జారత్వము, అపవిత్రత, కాముకత్వము” వంటివాటిని ప్రోత్సహిస్తున్నాయి. (గలతీయులు 5:19) కొంతమంది పోర్నోగ్రఫీకి బానిసలయ్యారు, అది తరచూ అనైతిక ప్రవర్తనకు దారితీస్తుంది. ప్రత్యేకించి యౌవనస్థులు అలాంటి ప్రభావాలకు లోనవుతున్నారు. కొన్ని దేశాల్లో డేటింగ్ (అమ్మాయి అబ్బాయి కలిసి తిరగడం) ఒక ఆచారంగా తయారయ్యింది, యౌవనస్థులు తాము ఖచ్చితంగా డేటింగ్ చేయాలని ఆలోచించడానికి బలవంతపెట్టబడుతున్నారు. చాలామంది యౌవనస్థులు పెళ్ళి చేసుకునేంత వయసు లేకపోయినా ప్రేమలో పడుతున్నారు. తమలో కలుగుతున్న లైంగిక కోరికలను తీర్చుకోవడానికి వారు వ్యభిచారము చేసేంతగా అనైతిక ప్రవర్తనకు పాల్పడుతున్నారు.
21 చెడు ప్రభావాలకు పెద్దలు అతీతులేమీ కాదు. నిజాయితీలేని వ్యాపారాలు, స్వార్థపూరిత ఉద్దేశాల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు యథార్థత లేదని సూచిస్తాయి. లౌకిక మార్గాల్లో నడుచుకోవడం మనల్ని యెహోవానుండి దూరం చేస్తుంది. మనం “కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు” యథార్థంగా నడవడంలో కొనసాగుదాము.—ఆమోసు 5:15.
“నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము”
22 దావీదు ఇలా అంటూ దేవునికి తాను చేస్తున్న విన్నపాన్ని ముగించాడు: “నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను; సమాజములలో యెహోవాను స్తుతించెదను.” (కీర్తన 26:11, 12) దావీదు తన యథార్థతను కాపాడుకోవాలని తీర్మానించుకోవడమే కాకుండా తనను విమోచించమని యెహోవాను వేడుకున్నాడు. అది ఎంత ప్రోత్సాహకరమైనదో కదా! మనం పాపులమైనా యథార్థవంతులుగా నడుచుకోవాలని నిర్ణయించుకుంటే యెహోవా మనకు సహాయం చేస్తాడు.
23 మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలోను మనం దేవుని సర్వాధిపత్యాన్ని గుర్తిస్తున్నామని, దానిని గౌరవిస్తున్నామని మన జీవిత విధానం చూపించాలి. మనలో ప్రతి ఒక్కరమూ మన లోతైన తలంపులను భావాలను పరిశీలించమని వాటిని పరిశోధించమని యెహోవాను ప్రార్థనాపూర్వకంగా అడగవచ్చు. మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం ద్వారా ఆయన సత్యాన్ని నిత్యమూ మన కళ్ళెదుట ఉంచుకోవచ్చు. కాబట్టి మనం చెడు సహవాసాలకు దూరంగా ఉండి కూటాల్లోను సమావేశాల్లోను యెహోవాకు స్తుతులు చెల్లిద్దాము. మనం రాజ్య ప్రకటనా పనిలోను శిష్యులను చేసే పనిలోను అత్యంతాసక్తితో పాల్గొంటూ దేవునితో మనకున్న అమూల్యమైన సంబంధాన్ని ఈ లోకం ప్రమాదంలో పడవేసేందుకు ఎన్నడూ అనుమతించకుండా ఉందాము. యథార్థవంతులుగా నడుచుకోవడానికి మనం శాయశక్తులా ప్రయత్నించినప్పుడు యెహోవా మనపై కరుణిస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు.
24 యథార్థత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి మనం ఒక ప్రాణాంతకమైన ఉరి గురించి అంటే మితిమీరి మద్యం సేవించే ఉరి గురించి తెలుసుకొని ఉండాలి. ఆ విషయం తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడుతుంది.
మీకు గుర్తున్నాయా?
• బుద్ధిసూక్ష్మతగల ప్రాణులను వారి యథార్థత ఆధారంగా న్యాయంగా తీర్పు తీర్చడం ఎందుకు సాధ్యం?
• యథార్థత అంటే ఏమిటి, యథార్థవంతులుగా నడుచుకోవడం అంటే ఏమిటి?
• యథార్థవంతులుగా నడుచుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?
• యథార్థతను కాపాడుకోవడానికి మనం ఏ ప్రమాదాల గురించి తెలుసుకొని వాటిని నివారించాలి?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) మానవుల యథార్థత దేవుని సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదంలో ఒక ప్రాముఖ్యమైన భాగంగా ఎందుకు అయ్యింది? (బి) బుద్ధిసూక్ష్మతగల ప్రాణులు తాము యెహోవా సర్వాధిపత్యం పక్షాన ఉన్నామని ఎలా చూపించవచ్చు?
3. (ఎ) యోబు, దావీదు యెహోవా తమలో దేనిని చూడాలని, దేనిని బట్టి తీర్పు తీర్చాలని కోరారు? (బి) యథార్థత గురించి ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి?
4. యథార్థత అంటే ఏమిటి?
5. మనం యథార్థంగా ఉండడానికి పరిపూర్ణంగా ఉండవలసిన అవసరం లేదని ఏది చూపిస్తోంది?
6, 7. యథార్థవంతులుగా నడుచుకోవడంలో ఏమేమి ఇమిడివున్నాయి?
8. తన అంతరింద్రియములను, హృదయాన్ని పరిశీలించమని దావీదు యెహోవాను వేడుకోవడం నుండి మీరేమి నేర్చుకున్నారు?
9. యెహోవా మన అంతరింద్రియములను, హృదయాన్ని ఎలా పరిశోధిస్తాడు?
10. దేవుని సత్యానికి అనుగుణంగా నడుచుకోవడానికి దావీదుకు ఏమి సహాయం చేసింది?
11. యథార్థవంతులుగా నడుచుకోవడానికి మనకేమి సహాయం చేయగలదు?
12, 13. మనం ఎలాంటి సహవాసాలకు దూరంగా ఉండాలి?
14, 15. మనం ఎలా ‘యెహోవా బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయవచ్చు’?
16. దేవుని అద్భుత కార్యాల గురించి ఇతరులకు ప్రకటించడం మనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?
17, 18. క్రైస్తవ కూటాల విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి?
19. దావీదు ఎలాంటి పాపాలు చేసేవాడిగా ఉండాలని కోరుకోలేదు?
20, 21. భక్తిహీన ప్రజలు నడిచే మార్గంలో మనం నడిచేలా ఏది చేయగలదు?
22-24. (ఎ) మీకు 26వ కీర్తన ముగింపు మాటల్లో ఎలాంటి ప్రోత్సాహం లభించింది? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏ ఉరి గురించి చర్చించబడుతుంది?
[14వ పేజీలోని చిత్రం]
యెహోవా ప్రేమపూర్వక దయా క్రియలను మీ కళ్ళెదుట ఉంచుకుంటారా?
[14వ పేజీలోని చిత్రం]
మీ లోతైన తలంపులను పరిశీలించమని మీరు యెహోవాను క్రమంగా అడుగుతారా?
[15వ పేజీలోని చిత్రం]
మనం శ్రమల్లో యథార్థతను కాపాడుకుంటే అది యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తుంది
[17వ పేజీలోని చిత్రాలు]
యథార్థవంతులుగా నడుచుకోవడానికి సహాయం చేసేందుకు యెహోవా చేసిన ఏర్పాట్లను మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా?