కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చేతితో రాసిన ప్రాచీన ప్రతుల్లో దేవుని పేరు

బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఏం చెప్తుంది?

దేవునికి పేరు ఉందా?

కొంతమంది ఇలా అంటారు దేవునికి పేరు లేదు. ఇంకొంతమంది దేవుడు, ప్రభువు అనేవే ఆయన పేర్లు అంటారు. మరికొంతమంది దేవునికి చాలా పేర్లు ఉన్నాయని అంటారు. మీకేమనిపిస్తుంది?

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

“యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.”—కీర్తన 83:18.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • దేవునికి ఎన్నో బిరుదులు ఉన్నా, ఆయనకు ఒకే ఒక్క పేరు ఉంది. దాన్ని ఆయనే పెట్టుకున్నాడు.—నిర్గమకాండము 3:15.

  • దేవుడు రహస్యం కాదు. మనం ఆయన్ను తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు.—అపొస్తలుల కార్యములు 17:27.

  • దేవునితో స్నేహం చేయడానికి మొదటి అడుగు ఆయన పేరును తెలుసుకోవడమే.—యాకోబు 4:8.

దేవుని పేరు పలకడం తప్పా?

మీరేమంటారు?

  • అవును

  • కాదు

  • పరిస్థితుల్ని బట్టి

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

‘నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు.’ (నిర్గమకాండము 20:7) గౌరవం లేకుండా దేవుని నామాన్ని ఉపయోగించడం తప్పు.—యిర్మీయా 29:9.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • యేసుకు దేవుని పేరు తెలుసు, దాన్ని ఉపయోగించాడు కూడా.—యోహాను 17:25, 26.

  • మనం ఆయన్ను పేరు పెట్టి పిలవాలని దేవుడు కోరుకుంటున్నాడు.—కీర్తన 105:1.

  • దేవుని శత్రువులు ఆయన పేరును ప్రజలు మర్చిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.—యిర్మీయా 23:27. (w16-E No. 3)